Leg pains
-
తరుచు కాళ్ల నొప్పులు వస్తున్నాయా..?
కొందరు తరుచు కాళ్ల నొప్పితో బాధపడుతుంటారు. అదొక దీర్ఘకాలిక వ్యాధిలా ఇబ్బంది పెడుతుంటుంది. ఎందువల్ల వస్తుందో తెలయదు గానీ సడెన్‌గా వచ్చి నానా ఇబ్బందులు పెడుతుంటుంది. ఇలా ఎందుకు జరగుతుంది? ఏమైనా అనారోగ్యాలకు సంకేతమా? ప్రధాన కారణాలేంటి తదితరాల గురించే ఈ కథనం కాళ్ల నొప్పికి చాలా కారణాలు ఉండొచ్చు. అది నొప్పి తీవ్రతపై కూడా ఆధారపడి ఉంటుంది. కొన్ని రకాల ఆరోగ్య సమస్యల కారణంగా కూడా ఇలా కాలి నొప్పి రావొచ్చు. అందుకు గల ప్రధాన కారణాలేంటో చూద్దాం కండరాల ఒత్తిడి లేదా అతిగా కష్టపడినా.. కాలినొప్పిలో అత్యంత సాధారణ కారణాల్లో ఒకటి కండరాల ఒత్తిడి లేదా అతిగా నడవటం. తీవ్రమైన శారీరక శ్రమ, వ్యాయామం చేసే సమయంలో సరికాని విధానంల లేదా మీ కండరాలను వాటి పరిమితికి మించి నెట్టడం వల్ల జరగొచ్చు. గాయాలు లేదా ప్రమాదాలు కాలికి ఏదైన గాయం లేదా ప్రమాదంలో కాళ్లకు తీవ్రంగా గాయం అయినా ఈ నొప్పులు రావడం జరుగుతుంది. ఆ టైంలో బెణకడం జరిగి అది సెట్ అవ్వక కూడా తరుచుగా ఇలా కాలి నొప్పి రూపంలో ఇబ్బంది పెట్టొచ్చు. పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్(ప్యాడ్) కాళ్లకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో ఫలకం ఏర్పడినప్పుడూ ప్యాడ్ సంభవిస్తుంది. ఈ పరిస్థితి కండరాలకు రక్తప్రసరణను తగ్గిస్తుంది. ముఖ్యంగా కార్యకలాపాల సమయాల్లో నొప్పికి దారితీస్తుంది. ప్యాడ్ ఉన్న వ్యక్తుల కాళ్లల్లో తిమ్మిరి, లేదా బలహీనత సంభవించొచ్చు నరాల కుదింపు తుంటి లేదా తొడ వెనుక భాగపు నరములు కుదింపు లేదా చిట్లడం వల్ల నొప్పి రావొచ్చు. హెర్నియేటెడ్ డిస్కలు లేదా స్పైనల్ స్టెనోసిస్ వంటి పరిస్థితులు నరాల మీద ఒత్తిడికి దారితీయొచ్చు. ఫలితంగా నొప్పి, జలదరింపు లేదా తిమ్మిరి కాళ్లలో ఏర్పడి నొప్పిలా అనిపిస్తుంది. పరిధీయ నరాల వ్యాధి పరిధీయ నరాల వ్యాధి అనేది తరచుగా మధుమేహం, ఆల్కహాల్ సేవించడం లేదా కొన్ని మందుల కారణంగా పరిధీయ నరాలకు నష్టం జరగడంతో ఈ పరిస్థితి సంభవిస్తుంది. కీళ్ల సమస్య కీళ్లను ప్రభావితం చేసే పరిస్థితులు లేదా ఆర్థరైటిస్ వంటివి కూడా కాళ్లనొప్పులకు దారితీస్తాయి. ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా గౌట్ వంటివి కాళ్ల కీళ్లల్లో మంట, అసౌకర్యాన్ని కలిగిస్తాయి. డీప్ వెయిన్ థ్రాంబోసిస్ కాళ్లల్లో రక్తం గడ్డకట్టడం వల్ల ఎర్రగా వాపు వచ్చి నొప్పి వస్తుంది. డీప్ వెయిన్ థ్రాంబోసిస్(డీవీటీ)తో సంబంధం ఉన్న కాలు నొప్పి సాధారణంగా నిరంతరం తిమ్మిరి లాంటి అసౌకర్యం లేదా తీవ్రమైన నొప్పి ఉంటుంది. అంతేగాక ప్రభావిత ప్రాంతంలో వెచ్చగా ఎరుపుతో కూడిన నొప్పి ఉంటుంది. ఈ నొప్పి తొడ వరకు విస్తరించొచ్చు. కదిలిన లేదా నిలబడేందుకు చూసిన మరింత తీవ్రంగా నొప్పి వస్తుంది. ఇది తీవ్రంగాక మునుపే వైద్యుడిని తక్షణమే సంప్రదించాలి. లేదంటే రక్తం గడ్డకట్టుకుపోయిన ప్రాంతం చలనం కోల్పోయి తీసివేయడం లేదా ప్రాణాంతకంగానో మారొచ్చు. ముఖ్యంగా పైన చెప్పిన ఏవిధమైన అనుభూతి కలిగిన సమీపంలోని వైద్యుడిని సంప్రదించి, సూచనలు పాటించడం ఉత్తమం. సాధారణ నొప్పిగా నిర్లక్ష్యం వహిస్తే పూర్తిగా నడవలేని స్థితిని కొని తెచ్చుకోవద్దని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. (చదవండి: రాగిపాత్రల్లో ఈ పానీయాలను అస్సలు తాగొద్దు!) -
Health: పిక్క భాగంలో రక్తనాళాలు ఉబ్బినట్లు కన్పిస్తున్నాయా? నిర్లక్ష్యం చేస్తే
Health Tips In Telugu- Varicose Veins: సాధారణంగా గుండె... మిగతా మానవ శరీరమంతటికీ తన నుంచి వెలువడే రక్తనాళాల ద్వారా రక్తాన్ని సరఫరా చేస్తుంటుంది. ఈ రక్తనాళాలను ధమనులు అంటారు. మళ్లీ కొన్ని రక్తనాళాల ద్వారా గుండెకు రక్తం చేరుతుంది. ఇలా గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్ని సిరలుగా చెబుతారు. కాళ్ల దగ్గర ఉండే ఈ సిరలు దెబ్బతినడం, లేదా పై వైపునకు వెళ్లాల్సిన రక్తం సాఫీగా ప్రవహించకపోవడంతో కాళ్ల కింది భాగంలో, ప్రధానంగా పిక్కల వంటి చోట్ల రక్తనాళాలు ఉబ్బినట్లుగా కనిపిస్తాయి. ఇలా కనిపించడాన్ని ‘వేరికోస్ వెయిన్స్’ అంటారు. ఆ కండిషన్‌పై అవగాహన కోసం... సంక్షిప్తంగా ఈ కథనం. ఇతర శరీర భాగాల విషయంలో ఎలా ఉన్నప్పటికీ కాళ్ల విషయానికి వస్తే భూమి ఆకర్షణ శక్తి వల్ల గుండెకు చేరాల్సిన రక్తప్రసరణ కాస్త ఆలస్యమవుతుంది. అంతేకాదు... వయసు పైబడటం, స్థూలకాయం, కుటుంబ చరిత్ర వంటి అంశాలతోనూ, ట్రాఫిక్ పోలీసులు, బస్కండక్టర్లు వంటి వృత్తుల్లో ఉన్నవారు అదేపనిగా నిలబడే ఉండటం వంటి కొన్ని వృత్తిపనుల్లో రక్తప్రసరణ ఆలస్యం అవుతుంది. మహిళల్లో గర్భం దాల్చడం, హార్మోన్లు ప్రభావం వంటి అంశాలూ రక్తప్రసరణను ఆలస్యమయ్యేలా చేయవచ్చు. ఈ సమస్య శరీరంలో ఏ భాగానికైనా రావచ్చు. కానీ సాధారణంగా మోకాలి కింది భాగం నుంచి పాదాల వరకు వచ్చినప్పుడు ఈ పరిస్థితి చాలా ఇబ్బంది పెడుతుంది. ఈ సమస్య వచ్చినప్పుడు డాక్టర్‌ను సంప్రదించి, పడుకునే సమయంలో కాలిని కాస్త ఎత్తుగా ఉండేలా కాలికింద దిండు వేసుకుంటే సరిపోతుంది. కానీ వేరికోస్ వెయిన్స్ బాధిస్తుంటే డాక్టర్ సహాయం అవసరం. వేరికోస్ వెయిన్స్ అంటే కొన్ని సందర్భాల్లో మాత్రం పరిస్థితి ఇంకాస్త తీవ్రంగా ఉంటుంది. కాలి రక్తనాళాల్లో ఏవైనా అడ్డంకులు ఏర్పడినా; లేదా మోకాలి కింద ఉండే రక్తనాళాలు దెబ్బతిన్నా లేదా అవి బలహీనపడ్డా, ఆ రక్తనాళాల్లో రక్తాన్ని కిందికి పోకుండా నిలిపే కొన్ని కవాటాలు బలహీనపడటం వల్ల ఒక్కోసారి గుండెకు చేరాల్సిన రక్తసరఫరా సాఫీగా సాగదు. అలాంటప్పుడు మోకాలి కింది రక్తనాళాలు ఉబ్బినట్టుగా ఉండటం, సాలీడు కాళ్లను పోలిన ఉబ్బుతో కనిపించడం, అలా ఉబ్బిన రక్తనాళాలు నీలం, ఎరుపు రంగులో కనిపిస్తుంటే ఆ కండిషన్‌ను ‘వేరికోస్ వెయిన్స్’గా చెబుతారు. నిర్ధారణ పరీక్షలు వేరికోస్ వెయిన్స్ నిర్ధారణ కోసం కొన్ని పరీక్షలు చేస్తారు. వీనస్ అల్ట్రాసౌండ్, లోపలి రక్తనాళాలను చూస్తూ పరిస్థితి తెలుసుకునేందుకు సీటీ, ఎమ్మారై, ‘వీనోగ్రామ్’ వంటి పరీక్షలు చేస్తారు. చికిత్సలు పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పుడు లేదా అప్పటికే రక్తనాళాలు ఉబ్బి బాగా బయటికి కనిపిస్తూ, తీవ్రమైన నొప్పి వస్తున్నప్పుడు శస్త్రచికిత్స ద్వారా పరిస్థితిని చక్కబరచాల్సి వస్తుంది. ఇందులో దెబ్బతిన్న రక్తనాళాలను శస్త్రచికిత్సతో తొలగిస్తారు. ఈ ప్రక్రియను ‘వీన్ లైగేషన్ అండ్ స్ట్రిప్పింగ్’ అంటారు. అయితే ఇప్పుడు శస్త్రచికిత్సను అంతగా ఉపయోగించడం లేదు. వైద్యశాస్త్రంలో వచ్చిన గణనీయమైన పురోగతి వల్ల ఇప్పుడు వేరికోస్ లేజర్ చికిత్సలు, గ్లూ చికిత్సల వంటి ఇతర అధునాతన ప్రక్రియలు, చికిత్స మార్గాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అది కూడా కోత పెట్టడంతో కాకుండా కేవలం రక్తనాళాల్లోకి (ఇంట్రావీనస్) కాన్యులా పంపడం వంటి సులువైన ప్రక్రియలతోనూ చికిత్స సాధ్యమవుతోంది. -డాక్టర్ శ్రీధర్‌రెడ్డి బద్దం , సీనియర్ కన్సల్టెంట్, వాస్క్యులార్ అండ్ ఆంకో ఇంటర్వెన్షనల్ స్పెషలిస్ట్ చదవండి: Jeelakarra Health Benefits: జీలకర్ర వేసి కాచిన గోరువెచ్చని నీటిని రోజూ పరగడుపున తాగితే జరిగేది ఇదే! ఈ విషయాలు తెలిస్తే.. దుర్వాసన లేకుండా బాత్రూమ్ శుభ్రంగా ఉంచుకోండిలా! లేదంటే అతిథులు యాక్ అంటూ పారిపోతారు మరి.. Winter Care Tips: చలికాలంలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! చల్లారిన ఆహారం తిన్నారంటే.. -
నొప్పి మళ్లీ తిరగబెడుతోంది.. ఎందుకు?
దాదాపు ఎనిమిది నెలల కిందట నా కాలు స్లిప్ అయ్యి, చీలమండ బెణికింది. అప్పట్లో ప్లాస్టర్ వేశారు. కానీ ఇప్పటికీ నాకు ఆ ప్రాంతంలో తరచూ నొప్పి తిరగబెడుతూ ఉంది. చీలమండ వద్ద వాపు, నొప్పి కనిపిస్తున్నాయి. ఇంతకాలం తర్వాత కూడా ఇలా ఎందుకు నొప్పి వస్తోంది? దయచేసి వివరించండి. మీ కాలు బెణికినప్పుడు చీలమండ వద్ద ఉన్న లిగమెంట్లు గాయపడి (స్ప్రెయిన్ అయి) ఉండవచ్చు. మీరు ప్లాస్టర్ కాస్ట్ వేయించుకున్నానని చెబుతున్నారు. కాబట్టి ఆ సమయంలో మీ లిగమెంట్లు ఉన్న పరిణామం కంటే కాస్త తగ్గి పొట్టిగా మారే అవకాశం ఉంది. పైగా అవి తమ సాగే గుణాన్ని (ఎలాస్టిసిటీని) కోల్పోయి, తాము ఉండాల్సిన స్థానాన్ని తప్పి ఉండవచ్చు. ఆ తర్వాత కాలు ఏ కొద్దిపాటి మడతపడ్డా పాత గాయాలు మళ్లీ రేగి లిగమెంట్లు మళ్లీ దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. దాంతో నొప్పి, వాపు వస్తాయి. మీరు స్ట్రెచింగ్ వ్యాయామాలు చేస్తూ, మీ లిగమెంట్లు మళ్లీ మామూలు దశకు వచ్చేలా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మణికట్టు వంచినప్పుడల్లా క్లిక్‌మని శబ్దం! నా వయసు 33 ఏళ్లు. బైక్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నా కుడి మణికట్టులో కొద్ది నెలలుగా తీవ్రమైన నొప్పి వస్తోంది. దాన్ని కొద్దిగా పక్కకు వంచినప్పుడు క్లిక్ మనే శబ్దం వచ్చి నొప్పి వస్తోంది. ఈ నొప్పి కారణంగా ఏ పనీ చేయలేకపోతున్నాను. నాకు తగిన పరిష్కారం చెప్పండి. మన మణికట్టు చాలా సంక్లిష్టమైన నిర్మాణం. ఈ మణికట్టులో 15 ఎముకలతో పాటు ఎన్నో లిగమెంట్లు ఉంటాయి. కొన్ని చిన్న ఎముకలు విరిగినప్పుడు మనకా విషయమే తెలియదు. ఉదాహరణకు స్కాఫాయిడ్ అనే ఎముక మన మణికట్టును గుండ్రగా తిప్పడానికి ఉపయోగపడుతుంది. దీంతోపాటు కొన్ని రకాల ఎముకలు విరిగిన విషయం కూడా మనకు సాధారణ ఎక్స్‌రేలో తెలియపోవచ్చు. అయితే కొన్నిసార్లు రెండు, మూడు వారాల తర్వాత చేసే రిపీటెడ్ ఎక్స్‌రేలో తెలుస్తాయి. మీరు చెబుతున్న లక్షణాలు స్కాఫాయిడ్ ఎముక విరిగినట్లుగా సూచిస్తున్నాయి. మీ సమస్య టీనోసైనోవైటిస్ లేదా రిపిటేటివ్ స్ట్రెయిన్ ఇంజ్యురీ కూడా అయిఉండవచ్చు. కాబట్టి మీరు ఒకసారి ‘ఆర్థోపెడిక్ సర్జన్’ను కలిసి తగిన ఎక్స్–రే పరీక్షలు చేయించుకోండి. సమస్యను బట్టి చికిత్స ఇస్తారు. డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి, చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
హార్ట్ ఎటాక్ లాంటిదే ఈ ‘లెగ్’ అటాక్!
నా వయసు 60 ఏళ్లు. గతంలో పొగతాగే అలవాటు ఉండేది. నడుస్తున్నప్పుడు నాకు కాలునొప్పి వస్తోంది. పిక్కలు, తొడలు, తుంటిభాగంలోనూ నొప్పిగా ఉంటోంది. మెట్లు ఎక్కుతున్నప్పుడు వచ్చే నొప్పి, ఆగితే తగ్గుతోంది. నొప్పి సన్నగా, తిమ్మిరి ఎక్కినట్లుగా ఉంటోంది. కాళ్ల కండరాలు అలసిపోయినట్లుగా ఫీలవుతున్నాను. పిరుదులు కూడా నొప్పిగా ఉంటున్నాయి. నా సమస్యకు కారణం తెలపండి. –ఎమ్. రమణరావు, నెల్లూరు మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీకు కాలిలోని రక్తనాళాలు పూడిపోయినట్లుగా అనిపిస్తోంది. గుండెకు రక్తసరఫరా చేసే రక్తనాళాలు బ్లాక్ అయిన గుండెపోటు వచ్చినట్లే... కాలిలో కూడా అదే పరిణామం సంభవించే అవకాశం ఉంది. గుండెపోటులో ఉంటే ప్రమాదం లాగే ఈ లెగ్ అటాక్స్ ప్రమాదకరం. కాలిపైన ఎంతకూ నయంకాని అల్సర్స్ వచ్చి, చివరకు కాలు తీసేయాల్సిన పరిస్థితి దారితీయవచ్చు. లెగ్ అటాక్స్‌లో ఉన్న మరో ప్రమాదకరమైన అంశం... వీటిని చివరిదశ వరకూ గుర్తించడం కష్టం. అంతకుమించి ఈ వ్యాధి గురించి సాధారణ ప్రజల్లో అవగాహన చాలా తక్కువ. డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు, 50 ఏళ్లు పైబడిన వారు, స్థూలకాయులు, రక్తపోటు ఎక్కువగా ఉన్నవారు, పొగతాగే వారు ఈ లెగ్ అటాక్స్ గురయ్యే అవకాశాలు ఎక్కువ. మీరు పేర్కొన్న లక్షణాలతో పాటు కాళ్లు లేదా పాదాలు క్రమంగా పాలిపోయినట్లుగా ఉండటం, కాళ్లు నీలిరంగులోకి లేదా ముదురు ఎరుపు రంగులోకి మారడం వంటివీ చోటుచేసుకుంటాయి. నడవకుండా విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా మీ లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉంటే వ్యాధి తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్లు గ్రహించాలి. ఈ రక్తనాళాల జబ్బును నిర్ధారణ చేయడానికి యాంజియోగ్రామ్ బాగా ఉపయోగపడుతుంది. అయితే నిర్ధారణలో మరింత కచ్చితత్వం కోసం అల్ట్రాసోనోగ్రఫీ, ఎమ్మారైలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇలా కాలి రక్తనాళాల్లో పూడిక పేరుకుందని తెలిసినప్పుడు ప్రాథమిక దశలో సరైన మందులు, జీవనశైలిలో మార్పుల ద్వారా దీనికి చికిత్స చేస్తారు. దీనికి ఎంత త్వరగా చికిత్స చేయిస్తే అంత మంచిది. ఎందుకంటే వ్యాధి ముదిరాక డాక్టర్‌ను సంప్రదిస్తే ఒక్కోసారి కాలిని తొలగించే ప్రమాదమూ ఉండవచ్చు. అందుకే మీలో కనిపించిన లక్షణాలను గుర్తిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఇప్పుడు దీనికి బెలూన్ యాంజియోప్లాస్టీ, స్టెంట్ వంటి సమర్థమైన, సురక్షితమైన చికిత్స ప్రక్రియలు అందుబాటులోకి వచ్చాయి. వేరికోస్ వెయిన్స్విషయంలోనిర్లక్ష్యం వద్దు వాస్క్యులార్ కౌన్సెలింగ్ నా వయసు 47 ఏళ్లు. మోకాలి కింది భాగం నుంచి పాదాల వరకు ఉన్న రక్తనాళాలు ఉబ్బినట్లుగా కనిపిస్తున్నాయి. అవి ఎర్రటి, నీలం రంగులో ఉన్నాయి. వాటి వల్ల నాకు ఎలాంటి నొప్పి కలగడం లేదు. అయితే చూడటానికి ఎబ్బెట్టుగా, ఇబ్బందికరంగా ఉన్నాయి. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చూపగలరు. – ఎల్. రవికుమార్, నిజామాబాద్ సాధారణంగా మనిషి శరీరాన్నంతటికీ గుండె, రక్తనాళాల ద్వారా రక్తాన్ని సరఫరా చేస్తుంది. మళ్లీ అవే రక్తనాళాల ద్వారా రక్తం గుండెకు చేరుతుంది. అయితే మిగతా భాగాల విషయంలో ఎలా ఉన్నప్పటికీ కాళ్ల విషయానికి వస్తే భూమి ఆకర్షణ శక్తి వల్ల ఈ రక్తప్రసరణ ప్రక్రియ కాస్త ఆలస్యమవుతుంది. అంతేకాకుండా వయసు పైబడటం, కుటుంబ నేపథ్యం, స్థూలకాయం, కూర్చొని పనిచేయటం, అదేపనిగా నిలబడి పనిచేయడం, బరువైన వృత్తిపనులు చేయడంతో జరిగినప్పుడు రక్తప్రసరణ ఆలస్యం అవుతుంది. మహిళల్లో గర్భం దాల్చడం, హార్మోన్లు ప్రభావం వంటి అంశాలు రక్తప్రసరణ ఆలస్యమయ్యేలా చేయవచ్చు. శరీరంలో ఏ భాగానికైనా ఈ సమస్య ఏర్పడవచ్చు. కానీ సాధారణంగా మోకాలి కింది భాగం నుంచి పాదాల వరకు ఇది ఇబ్బంది పెడుతుంది. ఈ సమస్య ఉన్నప్పుడు మీ ఫ్యామిలీ డాక్టర్‌ను కలిసి, ఆయన సూచనల మేరకు మీ కాలి దగ్గర ఒక ఎత్తయిన దిండు వేసుకుంటే సరిపోతుంది. అలాకాకుండా మీ కాలి రక్తనాళాల్లో ఏవైనా అడ్డంకులు ఏర్పడినా లేదా రక్తనాళాలు ఉబ్బి గుండెకు చేరాల్సిన రక్తసరఫరాను అది అడ్డుకుంటుంటే అప్పుడు మీరు ‘వేరికోస్ వెయిన్స్’ అనే కండిషన్ బారిన పడ్డట్లు చెప్పవచ్చు. మీరు మీ డాక్టర్‌ను సంప్రదిస్తే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయిస్తారు. ఒకవేళ మీరు ‘వేరికోస్ వెయిన్స్’ బారిన పడ్డా కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు చెప్పిన వివరాల ప్రకారం మీ సమస్య మొదటి దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆధునిక వైద్య చికిత్సల్లో వచ్చిన పురోగతి వల్ల మీ సమస్యను పూర్తిగా నయం చేయవచ్చు. సర్జరీ వంటి ప్రక్రియలకు ఖర్చుచేయడం అనవసరం అనే అభిప్రాయంతో మీ సమస్య తీవ్రతను పెంచుకోవద్దు. అలాగే నొప్పి, దురద, వాపులాంటివి లేవనుకొని నిర్లక్ష్యం చేయకూడదు. మీరు వెంటనే డాక్టర్‌ను సంప్రదించి తగిన చికిత్స చేయించుకోండి. డయాబెటిక్ ఫుట్ అంటే? నా వయసు 59. గత పదిహేనేళ్లుగా షుగర్‌వ్యాధితో బాధపడుతున్నాను. కొన్ని నెలల నుంచి నా కాళ్లు తరచూ తిమ్మిరెక్కుతున్నాయి. కాళ్లలో మంటలుగా అనిపిస్తున్నాయి. ఒక రోజు మరుగుతున్న నీళ్లు కాళ్ల మీద పడి బొబ్బలు కూడా వచ్చాయి. కానీ నాకు బాధ తెలియలేదు. నేను ఆందోళనతో డాక్టర్‌ను కలిశాను. డయాబెటిస్ ఫుట్ అని చెప్పి చికిత్స అందించారు. నాకు డయాబెటిస్ ఉందిగానీ... కాళ్లకు ప్రత్యేకంగా ఈ డయాబెటిస్ ఏమిటో నాకు అర్థం కావడం లేదు. అసలు డయాబెటిక్ ఫుట్ అంటే ఏమిటి? దయచేసి వివరంగా చెప్పండి. – జి. ప్రభావతి, నల్లగొండ డయాబెటిస్ ఫుట్ అంటే విడిగా కాళ్లకు డయాబెటిస్ సోకడం కాదు. డయాబెటిస్తో బాధపడే చాలామందిలో ఎదురయ్యే ప్రధానసమస్యల్లో కాళ్లపై పుండ్లు ఏర్పడే డయాబెటిక్ ఫుట్ ముఖ్యమైనది. దాదాపు ఆరోవంతు మంది వ్యాధిగ్రస్తుల్లో ఇది కనిపిస్తుంది. రోడ్డు ప్రమాదాల్లో కాకుండా... దేశవ్యాప్తంగా కాళ్లను తొలగించే పరిస్థితుల్లో 50 శాతానికి పైగా ఈ డయాబెటిక్ ఫుట్ కారణంగానే చోటుచేసుకుంటున్నాయి. ఇక డయాబెటిస్ సమస్య తీవ్రమై కాలు తొలగించాల్సి వచ్చిన వారిలోనూ 40 శాతం మందిలో ఆ తర్వాత మూడేళ్లకే రెండో కాలు కూడా తొలగించాల్సి వస్తోంది. అయితే ఇలాంటి రోగులకు ఆశాజనకం, ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే... ఇలా కాలిని తొలగించాల్సిన కేసుల్లో కాస్త ముందుజాగ్రత్తగా వ్యవహరిస్తే 85 శాతం మందిలో ఈ ప్రమాదాన్ని నివారించవచ్చు. డయాబెటిస్ కారణంగా వచ్చే ఈ పరిస్థితి గురించి తగిన అవగాహన లేకపోవడమే మనలో కాలు కోల్పోవడానికి ఒక ప్రధాన సమస్య. అందుకే డయాబెటిస్‌పై తగిన అవగాహన పెంచుకోవాలి. డయాబెటిస్ రోగులు... తమ కాలు తిమ్మిరిగా ఉండటం, నొప్పినీ... వేడి–చల్లదనాలను కాలు గుర్తించలేకపోవడం, కాళ్లమంటలు, కొద్దిపాటి బరువును కూడా భరించలేకపోవడం (పలుచని బెడ్‌షీట్ కాలి మీద పడ్డా అది చాలా బరువుగా అనిపించడం), కాలి కండరాలు బలహీనపడటం వంటి లక్షణాలతో డయాబెటిక్ ఫుట్‌ను ముందుగా గుర్తించవచ్చు. ఈ కారణాల వల్ల కాలికి దెబ్బతగిలినా రోగికి అది తెలియదు. మరోవైపు ఆ గాయం మానకుండా పెద్దదవుతుంది. పుండు పడుతుంది. డయాబెటిస్ వల్ల కాలికి జరిగే రక్తసరఫరాలో కూడా సమస్యలు ఎదురవుతాయి. తగినంత రక్తం సరఫరా కాకపోవడంతో గాయాలు పుండ్లు త్వరగా మానవు. అది గ్యాంగ్రీన్గా మారే ప్రమాదం పొంచి ఉంటుంది. కొద్దిపాటి జాగ్రత్తలతో డయాబెటిక్ ఫుట్ నుంచి కాళ్లూ, పాదాలను కాపాడుకోవచ్చు. వెచ్చని నీళ్లు, సబ్బు ఉపయోగిస్తూ ప్రతిరోజూ పాదాలను శుభ్రంగా కడుక్కోవాలి. పాదాలను నీళ్లలో నాన్చి ఉంచకూడదు. వేళ్ల మధ్యభాగాలతో సహా మొత్తం కాలు, పాదాన్ని తుడిచి పొడిగా ఉంచుకోవాలి. కాళ్లు, పాదాలపై పుండ్లు, బొబ్బలు, కమిలిన ప్రదేశాలు ఏమైనా ఏర్పడ్డాయా అని ప్రతిరోజూ చూసుకుంటూ ఉండాలి. కాళ్లల్లో రక్తప్రసరణకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే ఈ విషయంలో మరింత జాగ్రత్త అవసరం. బయటే కాకుండా ఇంట్లో కూడా పాదరక్షలు ధరించి తిరగాలి. వీలైనంతవరకు సాక్స్ వేసుకోకపోవడమే మంచిది. వేళ్లను కప్పి ఉంచే పాదరక్షలను ధరించి తిరగాలి. మార్నింగ్ వాక్, ఇతర సమయాల్లో షూస్ ధరించేట్లయితే కాన్వాస్‌తో తయారుచేసిన వాటినే ఎంచుకోవాలి. డాక్టర్ దేవేందర్ సింగ్ సీనియర్ వాస్క్యులార్ అండ్ఎండోవాస్క్యులార్æ సర్జన్,యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ -
కాలి నొప్పితో వస్తే కాటికి పంపారు
రాంగోపాల్‌పేట్: కాలి నొప్పితో బాధపడుతూ సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వస్తే వైద్యులు ఏకంగా కాటికే పంపారని ఆరోపిస్తూ మృతుని బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చీర్యాలకు చెందిన యాదయ్య (38) గత కొద్ది రోజుల నుంచి వాస్కులర్ సమస్యతో బాధపడుతున్నాడు. కాళ్ల నొప్పులు తీవ్రం కావడంతో సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చిన అతను వాస్కులర్ సర్జన్ డాక్టర్ ప్రవీణ్‌ను సంప్రదించాడు. గుండె నుంచి కాలికి రక్తం సరఫరా చేసే ప్రధాన నాళంలో క్యానర్స్ గడ్డ ఉన్నందున శస్త్ర చికిత్సచేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. ఇందుకు రూ.4లక్షలు ఖర్చవుతుందన్నారు. యాదయ్య ఈ నెల 24న రూ. 3 లక్షలు చెల్లించి ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. 25న అబ్జ్వర్వేషన్‌లో ఉంచిన వైద్యులు 26న శస్త్ర చికిత్స చేశారు. రాత్రి 9గంటల సమయంలో యాదయ్య చనిపోయినట్లు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే అతను మృతి చెందాడని ఆరోపిస్తూ మృతుని బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. దీనిపై రాంగోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అరుదైన కేసు: ఆస్పత్రి యాజమాన్యం యాదయ్యకు సంబంధించి అరుదైన క్లిష్టమైన కేసు. 1996 నుంచి ఇప్పటివరకు ప్రపంచంలో కేవలం 22 కేసులు మాత్రమే గుర్తించారు. గుండె నుంచి రక్తం సరఫరా చేసే ప్రదాన రక్త నాళంలో క్యాన్సర్ గడ్డ ఉంది. ఇలాంటి కేసుల్లో శస్త్ర చికిత్స చేసినా బతకడం కష్టం. కీ విషయాన్ని బంధువులకు ముందుగానే చెప్పాము. -
బాబుకు ఛాతీలో నెమ్ము, ఏం చేయాలి?
పీడియాట్రిక్ కౌన్సెలింగ్స్ మా బాబు వయసు 14 నెలలు. ఛాతీలో నెమ్ము ఉందని డాక్టర్లు చెప్పారు. యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ చేశారు. మాకు చాలా ఆందోళనగా ఉంది. ఇలా నెమ్ము ఎందుకు వస్తుంది? దాని విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా చెప్పండి. – ఎమ్. సుప్రియ, రాజమండ్రి మీ బాబుకు ఉన్న కండిషన్‌ను వైద్య పరిభాషలో నిమోనియా అంటారు. పిల్లల్లో ప్రమాదకరంగా మారేందుకు కారణమయ్యే వ్యాధుల్లో నిమోనియా ఒకటి. డయేరియా తర్వాత పిల్లల్లో ప్రమాదకరంగా పరిణమించే వ్యాధుల్లో ఇది రెండోదని చెప్పవచ్చు. వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు నిమోనియాకు అత్యంత ప్రధాన కారణాలు. కొన్ని సందర్భాల్లో కొన్ని శరీర నిర్మాణపరమైన లోపాల (అనటామికల్ ప్రాబ్లమ్స్) వల్ల, రోగనిరోధక శక్తి లోపాల (ఇమ్యునిటీ ప్రాబ్లమ్స్) వల్ల కూడా పదే పదే నిమోనియా కనిపించవచ్చు. ఒక ఏడాదిలో వ్యవధిలోనే రెండు మూడు సార్లు నిమోనియా వస్తే అలాంటి పిల్లల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాగని మొదటిసారి వచ్చినప్పుడు నిర్లక్ష్యం వహించడం సరికాదు. నిమోనియా వచ్చినప్పుడు వారం నుంచి పది రోజుల పాటు యాంటీబయాటిక్స్‌తో పిల్లలకు సరైన వైద్య చికిత్స అందించడం ఎంతైనా ముఖ్యం. తీసుకోవాల్సిన జాగ్రత్తలు... ∙ఇలాంటి పిల్లలను మిగతా సాధారణ పిల్లల్లాగానే పరిగణించవచ్చు. అయితే సమూహాలుగా జనం ఉన్న ప్రాంతాలకు పిల్లలను పంపకూడదు. చాలా తీవ్రమైన ఇన్ఫెక్షన్లతో బాధపడేవారి నుంచి పిల్లలను దూరంగా ఉంచాలి. ∙పిల్లలందరికీ టీకాలు వేయించడం (ఇమ్యూనైజేషన్) చాలా ప్రధానం. హెచ్ఐబీ, నిమోకోకల్ వ్యాక్సిన్లు, ఫ్లూ వైరస్ వ్యాక్సిన్లతో నిమోనియాను చాలా వరకు నివారించవచ్చు. మీ బాబుకు ఈ వ్యాక్సిన్లు వేయించడం తప్పనిసరి. నిమోనియా వచ్చిన పిల్లలకు యాంటీబయాటిక్స్‌తో పాటు వాళ్లలో కనిపించే లక్షణాలకూ చికిత్స చేయడం (సపోర్టివ్ కేర్) అవసరం. పాపకు మళ్లీ చెవి నొప్పి... తగ్గేదెలా? మా పాప వయస్సు ఆరేళ్లు. రెండు నెలల క్రితం మా పాపకు జలుబు వస్తే ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరకు తీసుకెళ్లాం. ఆయన ముక్కు నుంచి చెవికి ఉండే ఎడినాయిడ్ గ్రంథి బ్లాక్ అయిందన్నారు. తగ్గిపోయాక ఇప్పుడు మళ్లీ మరో పక్క చెవి నొప్పిగా ఉందని అంటోంది. మళ్లీ ఇలా వచ్చే అవకాశం ఉందా? – శాంతిశ్రీ, మధిర మీరు చెబుతున్న అంశాలను బట్టి మీ పాపకు ఉన్న కండిషన్‌ను ‘అడినాయిడైటిస్ విత్ యూస్టేషియన్ కెటార్’ అని చెప్పవచ్చు. ఎడినాయిడ్స్ అనే గ్రంధులు ముక్కు వెనకాల, టాన్సిల్ పైన ఉంటాయి. ఈ గ్రంథులకు టాన్సిల్స్ తరహాలో ఇన్ఫెక్షన్ రావచ్చు. ఇది కొన్ని వారాలు, నెలలు ఉండవచ్చు. చిన్న పిల్లల్లో ఈ కండిషన్‌ను తరచూ చూస్తుంటాం. ఇలాంటిది జరిగినప్పుడు మధ్య చెవి నుంచి ముక్కు వెనుక భాగంలో ఉండే యూస్టేషియన్ ట్యూబులో కొన్ని మార్పులు జరగవచ్చు. ఎడినాయిడ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు సైనుసైటిస్, ముక్కు రంధ్రాలు మూసుకుపోవడం (బ్లాక్ కావడం), నోటితో గాలి పీల్చడం, నిద్రపట్టడంలో ఇబ్బంది (రెస్ట్‌లెస్ స్లీప్) వంటి ఇతర లక్షణాలూ కనిపించవచ్చు. ఇలాంటి పిల్లలకు యాంటీహిస్టమిన్, యాంటీబయాటిక్ కోర్సులతో చికిత్స చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నొప్పి ఉంటే పెయిన్ మెడికేషన్ కూడా అవసరం కావచ్చు. ఇలాంటి లక్షణాలు చాలా దీర్ఘకాలం కొనసాగితూ ఉంటే కొందరిలో చాలా అరుదుగా ఎడినాయిడ్స్‌ను తొలగించాల్సి రావచ్చు. మీరు మీ పీడియాట్రీషియన్ లేదా ఈఎన్టీ సర్జన్‌ను కలిసి తగిన చికిత్స తీసుకోండి. ఈ వయసులోనే పాపాయికి కాళ్లనొప్పులా... ఎందుకిలా? మా పాపకు ఏడేళ్లు. తరచూ కాళ్లనొప్పులంటూ ఏడుస్తోంది. ఇటీవల మరీ ఎక్కువగా ఉన్నట్లు గమనించాం. కొన్నిసార్లు నిద్రనుంచి లేవడం, కాసేపు కాళ్లు నొక్కాక అవి తగ్గడం, ఆ తర్వాత పడుకోవడం చేస్తోంది. మా డాక్టర్గారిని సంప్రదిస్తే ఆందోళన అక్కర్లేదని చెప్పారు. మా దగ్గరి బంధువుల్లో ఒక పెద్దావిడకు కూడా ఇలాగే కాళ్లనొప్పులు వస్తుంటే వారు డాక్టర్‌ను సంప్రదించారు. ఆమెకు రుమటాయిడ్ సమస్య అని చెప్పారు. మా పాపకు కూడా రుమటాయిడ్ సమస్య వచ్చి ఉంటుందంటారా? ఇవి దాని తాలూకు లక్షణాలా? మాకు తగిన సలహా ఇవ్వండి. – నీరజ, నెల్లూరు పిల్లల్లో కండరాల నొప్పులు కనిపిస్తున్నాయనేది చాలా సాధారణంగా వినిపించే ఫిర్యాదు. దాదాపు 10 శాతం నుంచి 30 శాతం మంది పిల్లల్లో రకరకాల స్థాయుల్లో కండరాల నొప్పులు (మస్క్యులో స్కెలెటల్ పెయిన్స్) కనిపిస్తుంటాయి. అయితే వీటిల్లో ఎక్కువగా కనిపించేవన్నీ చాలావరకు హానికరం కాని బినైన్ తరహావే. పిల్లల్లో ఇలా నొప్పి అని చెప్పేవాటిల్లో చాలావరకు ప్రమాదవశాత్తు దెబ్బతగలడం (ట్రామా), ఎక్కువగా ఆడటం (ఓవర్ యూజ్), పెరుగుదల సమయంలో మన ఎముకల్లో (స్కెలెటల్ గ్రోత్) కనిపించే హెచ్చుతగ్గుల వంటి చాలా సాధారణ సమస్యల వల్లనే కనిపిస్తుంటాయి. ఇక పిల్లల్లో కనిపించే నొప్పుల్లో ఏది ఏది ప్రమాదకరం కానిది లేదా ప్రమాదకరమైనది అని నిర్ణయించేందుకు ఈ సూచనలను గమనించండి. ప్రమాదకరం కానివి 1. ఏదైనా పనిచేయగానే పెరిగేవి, విశ్రాంతి తీసుకున్న తర్వాత తగ్గేవి 2. సాయంత్రంపూట, రాత్రి పూట కనిపించేవి 3. కీళ్ల దగ్గర వాపు లేకపోవడం, ముట్టుకుంటే నొప్పి/మంట (టెండర్నెస్) లేకపోవడం. 4. పిల్లల్లో పెరుగుదల మామూలుగానే ఉండటం 5. ల్యాబ్ పరీక్షలు / ఎక్స్–రే పరీక్షలు నార్మల్‌గా ఉండటం. 6. జ్వరం వంటి లక్షణాలేమీ లేకుండా ఉండటం. ప్రమాదకరమైనవి 1. ఏదైనా పనిచేయగానే కాస్తంత ఉపశమనం అనిపించేవి, విశ్రాంతి తీసుకున్నా తగ్గనివి 2. ఉదయం వేళల్లోనూ, చాలా రాత్రి గడిచాక కనిపించేవి 3. కీళ్ల దగ్గర వాపు కనిపించేవి, ముట్టుకుంటే నొప్పి/మంట (టెండర్నెస్) ఉండటం. కీళ్లు బిగుసుకుపోయి, కదలికలు తక్కువగా ఉండటం. 4. పిల్లల్లో పెరుగుదల తక్కువగా ఉండటం. 5. ల్యాబ్ పరీక్షలు / ఎక్స్–రేలో మార్పులు ఉండటం. 6. జ్వరం వంటి లక్షణాలు కనిపించడం. మీరు మీ లేఖలో మీ పాపకు పైన పేర్కొన్న తీవ్రమైన / ప్రమాదకరమైన లక్షణాలేమీ ఉన్నట్లు చెప్పలేదు. కాబట్టి అవి అంత తీవ్రమైనవి కావనీ, హానికరం కానివేనని భావించవచ్చు. పిల్లలు పెరిగే సమయంలో కనిపించే సాధారణమైన నొప్పులుగా (అంటే నాక్చర్నల్ పెయిన్స్ ఆఫ్ ఛైల్డ్హుడ్గా) వీటిని పరిగణించవచ్చు. పెరుగుతున్నప్పుడు 20 శాతం మంది పిల్లల్లో ఇలా నొప్పులు కనిపించడం చూస్తుంటాం. పెరిగే పిల్లల్లో కీళ్లనొప్పులు, తొడ, పిక్కల్లో ఇవి కనిపిస్తూ తరచూ వచ్చిపోతుంటాయి. మసాజ్ చేయగానే లేదా కొద్దిపాటి పెయిన్‌కిల్లర్స్‌తో ఇవి తగ్గిపోతుంటాయి. మర్నాడు ఉదయానికి ఈ నొప్పులు ఉండవు. వయసు పెరుగుతున్నకొద్దీ ఈ నొప్పులు క్రమేపీ తగ్గిపోతాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కొందరిలో నొప్పి భరించే శక్తి (పెయిన్ థ్రెషోల్డ్) తక్కువగా ఉంటుంది. ఇలాంటి పిల్లల్లో ఈ కండరాల నొప్పులతో పాటు పొట్టనొప్పి, తలనొప్పి వంటివి కూడా కనిపిస్తూ ఉండటం చూడవచ్చు. ఇక మీ పాప విషయానికి వస్తే మీరు ఎలాంటి ఆందోళన చెందకుండా ఆమెకు అవసరమైనప్పుడు కొద్దిపాటి నొప్పి నివారణ మందుతో పాటు ధైర్యం చెప్పడం, ఆరోగ్యకరంగా నిద్రపుచ్చడం వంటివి చేస్తూ ఉంటే ఇవి క్రమేపీ తగ్గిపోతాయి. ఇక మీరు మీ బంధువుల్లో పెద్దలెవరికో రుమాటాయిడ్ సమస్యను ప్రస్తావిస్తూ ఒక ప్రశ్న అడిగారు. మీ సందేహానికి జవాబు ఏమిటంటే... పిల్లల్లోనూ రుమటాయిడ్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. దీన్నే జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. కానీ మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీ పాపకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నట్లుగా ఏమాత్రమూ అనిపించడం లేదు. కాబట్టి మీరు ఆందోళన చెందకండి. పైన పేర్కొన్న విషయాలను ఒకసారి మీ పీడియాట్రీషియన్ లేదా రుమటాలజిస్ట్తో చర్చించి, వారు పాపకు ఏవైనా పరీక్షలు సూచిస్తే వాటిని చేయించి, నిశ్చింతగా ఉండండి. డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
వయసు పెరుగుతుంటే... ఎముకల పటుత్వం తగ్గుతుంది
నిర్ధారణ వయసు పెరిగే కొద్దీ ఎముకల పటుత్వం లోపించడంతో వార్ధక్య చిహ్నాలు కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పుల రూపంలో బయటపడుతుంటాయి. ఆస్టియోపోరోసిస్‌ను నిర్ధారణ చేయాలంటే... మెడికల్ హిస్టరీ... గతంలో జరిగిన ప్రమాదాలు రక్తసంబంధీకుల ఎముకల సమస్యలు, ఆహారవిహారాల వివరాలు. ఫిజికల్ ఎగ్జామినేషన్ బోన్ డెన్సిటీ టెస్ట్ ఫాక్స్ (ఫ్రాక్చర్ రిస్క్ అసెస్మెంట్ టూల్) లాబొరేటరీ టెస్ట్‌ల్లో భాగంగా రక్తం, మూత్ర పరీక్షల ద్వారా ఎముక పటుత్వం తగ్గడానికి కారణాలను తెలుసుకుంటారు. ఇందులో రక్తంలో క్యాల్షియం స్థాయులు, 24 గంటల పాటు విసర్జించిన మూత్రంలో క్యాల్షియం మోతాదును పరీక్షించడం, థైరాయిడ్ పనితీరు, పారాథైరాయిడ్ హార్మోన్ స్థాయులు, టెస్టోస్టీరాన్ స్థాయులు (మగవారిలో), హైడ్రాక్సి విటమిన్ -డి పరీక్ష, బయోకెమికల్ మార్కర్ టెస్ట్‌లు ఉంటాయి. అవసరమైతే న్యూక్లియర్ బోన్ స్కాన్, సి.టి. స్కాన్, ఎం.ఆర్.ఐ కూడా చేయాల్సి ఉంటుంది.