legislative council session
-
Watch Live: ఏపీ శాసన మండలి సమావేశాలు.. మండలిలో YSRCP ఎమ్మెల్సీల ఆందోళన
-
రచ్చే.. చర్చ వద్దు
సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాలు స్తంభించేలా గొడవ చేయాలని టీడీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. మూడు రాజధానుల అంశంపై ప్రభుత్వం బిల్లు పెట్టినా, చర్చ పెట్టినా అందులో పాల్గొనకుండా అసెంబ్లీని రద్దు చేయాలని డిమాండ్ చేయాలని పదే పదే స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బుధవారం మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఉదయం నుంచి రాత్రి వరకు చంద్రబాబు చర్చలు జరిపారు. సభకు ఆటంకం కలిగించేలా ఏం చేయాలనే విషయంపై ఎమ్మెల్యేలతో చంద్రబాబు చర్చించారు. మూడు రాజధానుల అంశాన్ని రిఫరెండంగా తీసుకుని అసెంబ్లీని రద్దు చేయాలనే డిమాండ్‌ను శాసన సభ, మండలిలో పెట్టి దానిపైనే గొడవ చేయాలని నిర్ణయించారు. సభ జరగకుండా అడ్డుకోవాలని, ఇందుకోసం మొదటి రోజే మూడు రాజధానులపై అసెంబ్లీ రద్దు డిమాండ్‌ను లేవనెత్తి అధికారపక్షాన్ని అడ్డుకోవాలని నిర్ణయించారు. గత సమావేశాల్లో శాసన సభ నిబంధనలకు విరుద్ధంగా సభలోకి చిడతలు తీసుకెళ్లి వాయించినట్లు ఈసారి కూడా అలాంటిది ఏదైనా చేసి సభను అడ్డుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. నిరుద్యోగం – యువత ఆందోళన, జగన్ పాలనలో పన్నుల బాదుడు, వరి వేసుకుంటే ఉరే, ఇసుక, మద్యం దోపిడీ వంటి అంశాలపై చర్చకు పట్టుబట్టాలని చంద్రబాబు సూచించారు. వీటిపైనా చర్చకు పట్టుబట్టి గొడవకు దిగాలని సూచించినట్లు తెలిసింది. శాసనమండలిలోనూ ఇవే అంశాలను లేవనెత్తి సభను అడ్డుకోవాలని సూచించారు. గొడవ చేయడం ద్వారానే మీడియాలో ఫోకస్ అవ్వాలని నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాలను కనీసం 15 రోజులు నిర్వహించాలని బీఏసీలో డిమాండ్ చేయాలని, తక్కువ రోజులు సమావేశాలు జరపడాన్ని ప్రశ్నించాలని చంద్రబాబు ఎమ్మెల్యేలకు సూచించారు. గతంలో చెప్పినట్లుగానే అసెంబ్లీ సమావేశాలకు తాను దూరంగా ఉంటానని చంద్రబాబు చెప్పారు. కానీ ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తానని, వాటికి అనుగుణంగా పని చేయాలని సూచించారు. -
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు
-
మండలిలో రెండు బిల్లులు పాస్
సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్, వస్తు సేవల పన్ను సవరణ బిల్లులకు శాసనమండలి ఆమోదముద్ర వేసింది. సోమవారం మండలిలో పంచాయతీరాజ్ సవరణ బిల్లును ఆ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రవేశపెట్టారు. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని సుప్రీం కోర్టు స్పష్టం చేసినందున.. దానికి అనుగుణంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని భావించినా, ఆ అంశం న్యాయ పరిధిలో ఉన్నందున సాధ్యపడలేదని మంత్రి వివరణ ఇచ్చారు. బీసీలకు న్యాయం చేసింది కేసీఆర్ సర్కారేనని, వారి అభిమానంతోనే మరోసారి విజయం సాధించామన్నారు. బీసీలకు ఏదో చేసినట్లు మాట్లాడటం భావ్యం కాదని కాంగ్రెస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించకపోవడం శోచనీయమని, మైనార్టీలు, బీసీలకు ఈ రిజర్వేషన్ల వల్ల అన్యాయం జరిగిందని వాపోయారు. అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం మేరకు రిజర్వేషన్లు కల్పించినా.. మానవీయకోణంలో ఈ అంశాన్ని పరిశీలించాలని సూచించారు. మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పిం చేందుకు ఉద్దేశించిన బీసీ(ఈ) వ్యవహారం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉందని, ఈ అంశాన్ని బిల్లులో ఎలా పొందుపరుస్తారని రామచంద్రరావు (బీజేపీ) ప్రశ్నించారు. 50 శాతం రిజర్వేషన్లలో వీటిని పరిగణనలోకి తీసుకోవడంపై సమీక్షించాలన్నారు. పంచాయతీరాజ్ సవరణ బిల్లుకు మజ్లిస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ఆ పార్టీ ఎమ్మెల్సీ జాఫ్రీ స్పష్టం చేశారు. జీఎస్టీ తగ్గింపుతో ఊరట రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడితోనే వస్తు, సేవల పన్ను విధింపును కేంద్రం సరళీకరించిందని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మండలిలో జీఎస్టీ–2019 బిల్లును మండలిలో ప్రవేశపెట్టారు. పన్ను ఎక్కువగా ఉంటే.. ఎగవేసేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుందనే తమ వాదనను కేంద్రం అంగీకరించిందన్నారు. బీడీలపై 28 శాతం జీఎస్టీ వసూలు చేయడం సరికాదని, ధూమపానం చేసేవారి సంఖ్య ను తగ్గించేందుకే భారీగా పన్ను వడ్డించామనే కేం ద్రం వాదన అర్థరహితమన్నారు. ఉత్తర తెలంగాణ లో సుమారు 5 లక్షల మంది పేదలు బీడీ తయారీపై ఆధారపడి జీవిస్తున్నారని, బీడీలపై భారీ పన్ను వల్ల వారంతా రోడ్డున పడే ప్రమాదం ఏర్పడిందంటూ సభ్యుడు రాజేశ్వర్‌రావు అడిగిన ప్రశ్నకు ఈటల సమాధానమిచ్చారు. పెట్రోలియం, మద్యం అమ్మకాలను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని, తద్వారా ధరల నియంత్రణ సాధ్యపడుతుందని మజ్లిస్ ఎమ్మెల్సీ జాఫ్రీ అభిప్రాయపడ్డారు. జీఎస్టీతో పన్ను ఎగవేతదారుల సంఖ్య తగ్గిందని, భారీగా ఆదాయం సమకూరుతుందని బీజేపీ సభ్యుడు రామచంద్రరావు అన్నారు. జీఎస్టీ అంటే గబ్బర్‌సింగ్ టాక్స్ అని, రైతులు, చిన్న, మధ్యతరగతి ప్రజలపై గుదిబండగా మారిందని కాంగ్రెస్ సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు సుధాకర్‌రెడ్డి, ఎంఎస్ ప్రభాకర్ బిల్లుకు మద్దతుగా మాట్లాడారు. -
రేపటి నుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలు ప్రారంభం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసన మండలి సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఏపీ అసెంబ్లీలో స్పీకర్ కోడెల శివప్రసాద్‌తో సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీ జేవీ రాముడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా శాసనసభ సమావేశాల నిర్వహణపై చర్చించారు. అలాగే ఈ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే టీడీపీ దాని మిత్రపక్షం బీజేపీ ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో అధికారంలోని వచ్చి 14 నెలలు అయింది. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాపై కేంద్రం స్పష్టమైన వివరణ ఇవ్వడం లేదు. హోదా కాదు ప్రత్యేక ప్యాకేజీ అంటూ మంత్రులతోపాటు నాయకులు అడపాదడపా ప్రకటిస్తున్నారు. దాంతో రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. హోదాపై ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు టీడీపీపై విమర్శనాస్త్రాలు సంధించాయి. దాంతో ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆ పార్టీ నేతలు ఈ రోజు సమావేశమయ్యారు. అసెంబ్లీ, మండలిలో అనుసరించాల్సిన వ్యూహాంపై వారు ఈ సందర్భంగా చర్చించారని సమాచారం. అలాగే ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... ఈ రోజు సాయంత్రం ఆ పార్టీ నేతలతో భేటీ కానున్నారు. ప్రభుత్వాన్ని ఎండగట్టే అంశాలపై అధినేత...ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను దిశానిర్దేశం చేయనున్నారు.