letters War
-
ఆ లేఖల్లో ఏముంది?
దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ లేఖలు మరోసారి వార్తల్లోకెక్కాయి. స్వాతంత్య్ర పోరాట సమయంలో పుంఖానుపుంఖాలుగా ఆయన రాసిన లేఖలు అనంతర కాలంలో ఎంతగానో ప్రసిద్ధికెక్కాయి. బ్రిటిషర్ల చెరలో జైలు జీవితం అనుభవిస్తూ కూతురు ఇందిరకు రాసిన లేఖలైతే సంకలనాలుగా వెలువడి ఎంతో ఆదరణ కూడా పొందాయి. జయప్రకాశ్ నారాయణ్ వంటి రాజకీయ ఉద్ధండులు మొదలుకుని భౌతికశాస్త్ర దిగ్గజం ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ దాకా ప్రముఖులెందరితోనో నెహ్రూ జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు లోకప్రసిద్ధం. చక్కని రచనా శైలికే గాక అద్భుతమైన అభివ్యక్తికి వాటిని నిలువెత్తు నిదర్శనంగా చెబుతుంటారు. నెహ్రూ తదనంతరం ఆయన లేఖలన్నింటినీ ప్రధానమంత్రి మ్యూజియం, లైబ్రరీ (పీఎంఎంఎల్)లో భద్రపరిచారు. అయితే యూపీఏ హయాంలో 2008లో కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాంధీ వాటన్నింటినీ తన నివాసానికి తరలించిన వైనం ఇప్పుడు రాజకీయ రగడకు దారితీస్తోంది. నెహ్రూ లేఖలతో కూడిన ఏకంగా 51 పెట్టెలను తన సోనియా తరలించుకుని వెళ్లారని బీజేపీ ఆరోపిస్తోంది. వాటన్నింటినీ తిరిగివ్వాల్సిందిగా పీఎంఎంఎల్ తాజాగా సోనియాను కోరింది. కనీసం జిరాక్సులో, పీడీఎఫ్‌లో అయినా అందజేస్తే భద్రపరుస్తామంటూ విజ్ఞప్తి చేసింది. దాంతో, ‘‘అసలు నెహ్రూ లేఖలను సోనియా పనిగట్టుకుని తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచి్చంది? అందుకెవరు అనుమతించారు? 16 ఏళ్లుగా తన వద్దే ఎందుకు ఉంచుకున్నారు? ఎందుకు తిరిగివ్వడం లేదు? అంతగా దాచాల్సిన అంశాలు ఆ లేఖల్లో ఏమున్నాయి?’’ వంటి అనేకానేక ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. వీటికి సమాధానంగా అన్ని వేళ్లూ నెహ్రూ–ఎడ్వినా లేఖలవైపే చూపిస్తుండటం విశేషం. ఎడ్వినా నాటి వైస్రాయ్ లార్డ్ మౌంట్‌బాటెన్ భార్య. ఆమెకు, నెహ్రూకు మధ్య చాలా సాన్నిహిత్యం ఉందంటారు. ‘‘నిజానికిది బహిరంగ రహస్యమే. అప్పట్లో రాజకీయ వర్గాల్లో నిత్యం అందరి నోళ్లలోనూ నానిన అంశం కూడా’’ అని చరిత్రకారులు కూడా చెబుతారు. ‘‘నెహ్రూ, ఎడ్వినా సాన్నిహిత్యానికి వారి నడుమ సాగిన లేఖలు అద్దం పట్టాయి. దాంతో అవి వెలుగు చూడకూడదని సోనియా భావించారు. అందుకే వాటితో పాటు అన్ని లేఖలనూ పీఎంఎంఎల్ నుంచి తరలించుకుపోయారు’’ అని బీజేపీ ఆరోపిస్తోంది. ‘గాం«దీ–నెహ్రూ కుటుంబం’ అంటూ ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ అవకాశం దొరికినప్పుడల్లా పదునైన విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ లేఖల రగడ ఎంత దూరం వెళ్తుందన్నది ఆసక్తికరంగా మారింది. సోనియా తరలించుకుపోయిన నెహ్రూ లేఖలన్నింటినీ తిరిగి ఇప్పించాలంటూ ఆమె కుమారుడు, విపక్ష నేత రాహుల్‌గాం«దీకి పీఎంఎంల్ సభ్యుడు, చరిత్రకారుడు రిజ్వాన్ కాద్రీ డిసెంబర్ 10న లేఖ రాశారు. ‘‘అవన్నీ ఎడ్వినా, ఐన్‌స్టీన్, జేపీ, పద్మజా నాయుడు, విజయలక్ష్మీ పండిట్, అరుణా అసఫ్ అలీ, బాబూ జగ్జీవన్‌రాం, జేబీ పంత్ తదితరులకు నెహ్రూ జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు. 1971లో ఇందిర వాటిని పీఎంఎంల్ (అప్పట్లో నెహ్రూ మ్యూజియం)కు అప్పగించారు. అవి పీఎంఎంల్లో ఉంటే స్కాలర్లకు, పరిశోధకులకు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుంది’’ అని పేర్కొన్నారు. దాంతో నెహ్రూతో ఎడ్వినా సాన్నిహిత్యం ఆయన మరణించిన 80 ఏళ్ల తర్వాత మరోసారి తెరపైకి వచ్చింది. మిగతా లేఖల సంగతి ఎలా ఉన్నా గత చరిత్ర, బీజేపీ ఆరోపణల పుణ్యమా అని నెహ్రూ–ఎడ్వినా లేఖలపైనే అందరికీ ఆసక్తి నెలకొంది. ‘‘వాటిలో అంత గోప్యంగా ఉంచాల్సిన అంశాలేమున్నాయి? ఎందుకు వాటిని సోనియా తన ఇంట్లో దాచిపెట్టుకున్నారు? ఆమె బదులిచ్చి తీరాలి’’ అంటూ బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ డిమాండ్ చేయడం విశేషం. పార్టీ మరో అధికార ప్రతినిధి సంబిత పాత్ర కూడా సోమవారం ఏకంగా లోక్‌సభలోనే ఈ అంశాన్ని ప్రస్తావించారు. దీనిపై సరైన చర్యలు తీసుకుంటామంటూ కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ బదులివ్వడం విశేషం. అనంతరం పాత్ర మీడియాతో కూడా దీనిపై మాట్లాడారు. ‘‘నెహ్రూ లేఖలు గాంధీ కుటుంబపు వ్యక్తిగత ఆస్తి కాదు. దేశ సంపద. వాటిని బయట పెట్టడానికి గాంధీ కుటుంబం వెనకాడుతుండటం ఎన్నో సందేహాలకు తావిస్తోంది. సరిగ్గా పీఎంఎంల్లోని లేఖల డిజిటైజేషన్ ప్రక్రియ మొదలు పెట్టే ముందే నెహ్రూ లేఖలను సోనియా తీసుకెళ్లారు. వాళ్లేం దాస్తున్నారో తెలుసుకోవాలని దేశం భావిస్తోంది’’ అన్నారు. ‘గాఢమైన’ బంధం నెహ్రూ, ఎడ్వినా మధ్య నడిచిన లేఖలు ఇప్పుడు ఎవరికీ అందుబాటులో లేవు. అయితే ఎడ్వినా కూతురు పమేలా హిక్స్ తదితరులు వాటికి సంబంధించిన పలు విశేషాలను గతంలో పంచుకున్నారు. నెహ్రూ, ఎడ్వినా మధ్య ‘అత్యంత గాఢమైన’ బంధం కొనసాగిందని పమేలా తన పుస్తకంలో స్పష్టంగా పేర్కొనడం విశేషం! ‘‘నా తల్లి, నెహ్రూ పరస్పరం ఎంతగానో ప్రేమించుకున్నారు. ఒకరంటే ఒకరికి చెప్పలేనంత గౌరవాభిమానాలుండేవి. దీన్ని నేను ఎన్నోసార్లు గమనించాను. మా అమ్మ తానెంతగానో తపించిన ఆదర్శ సాహచర్యాన్ని పండిట్జీ (నెహ్రూ) రూపంలో పొందింది. అయితే వారిద్దరి మధ్య శారీరక బంధానికి అంతగా అవకాశం లేకపోయింది. నిత్యం తమను చుట్టుముట్టి ఉండే సిబ్బంది తదితరుల వల్ల ఏకాంతం దొరకడం గగనంగా ఉండేది. ఎడ్విన్ భారత్ వీడేముందు నెహ్రూకు ఓ ఉంగరమివ్వాలని భావించారు. తీసుకుంటారో లేదోనని చివరికి ఆయన కుమార్తె ఇందిరకు ఇచ్చి వెళ్లారు’’ అని పమేలా చెప్పుకొచ్చారు. నెహ్రూ తన వీడ్కోలు ప్రసంగంలోనూ ఎడ్వినాను ఆకాశానికెత్తిన వైనాన్నీ ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మావోయిస్టులపై పోస్టర్ ‘యుద్ధం’..!
ప్రభుత్వాలకు, పోలీసులకు వ్యతిరేకంగా మావోయిస్టులు పోస్టర్ ‘యుద్ధం’ సాగించడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు, సరికొత్తగా.. మావోయిస్టులపై ‘పోస్టర్’ యుద్ధం మొదలైంది...! మావోయిస్టులకు వ్యతిరేకంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చర్ల, తేగడ, కలివేరు, సత్యనారాయణపురం, ఆర్.కొత్తగూడెం, కుదునూరు, దేవరాపల్లి, రాళ్లగూడెం తదితర ప్రాంతాల్లో ఆదివాసీ, గిరిజన సంఘాల పేరిట సోమవారం అర్ధరాత్రి ఈ వాల్ పోస్టర్లు పడ్డాయి. చర్ల: ప్రభుత్వాలకు, పోలీసులకు వ్యతిరేకంగా మావోయిస్టులు పోస్టర్ ‘యుద్ధం’ సాగించడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు, సరికొత్తగా... మావోయిస్టులపై ‘పోస్టర్’ యుద్ధం మొదలైంది...! మావోయిస్టులకు వ్యతిరేకంగా చర్ల మండలంలోని చర్ల, తేగడ, కలివేరు, సత్యనారాయణపురం, ఆర్ కొత్తగూడెం, కుదునూరు, దేవరాపల్లి, రాళ్లగూడెం తదితర ప్రాంతాలలో ఆదివాసీ, గిరిజన సంఘాల పేరిట సోమవారం అర్ధరాత్రి ఈ వాల్ పోస్టర్లు పడ్డాయి. వాటిలో ఇలా ఉంది. ‘మేధావులు, ప్రజాసంఘాలు, పత్రికావివిమిత్రులు ఆలోచించండి. ఈ రోజు ఆపరేషన్ సమాధాన్‌కు వ్యతిరేకంగా మావోయిస్టులు జరుపుతున్న దమనకాండ దేనికి ఉపయోగపడుతుంది..? ప్రభుత్వ, ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తే ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉంటుందా..? మావోయిస్టులు కేవలం తమ ఉనికిని చాటుకునేందుకు మాత్రమే విధ్వంసాలు సృష్టిస్తున్నారు. విజ్ఞులైన మీరందరూ దీనిని ప్రశ్నించాలి. రోజువారీ పనులు చేసుకోనియకుండా ఆదివాసీలను గత వారం రోజులుగా మావోయిస్టులు హింసిస్తున్నారు. ప్రతి ఇంటి నుంచి బియ్యం, ఇతర వస్తువులను బలవంతంగా వసూలు చేసి, సభలు.. సమావేశాల పేరిట వారిని ఇబ్బందిపెడుతున్నారు. ఆదివాసీ గ్రామాలలో పాఠశాలలు బంద్ చేసి, ఆదివాసీ ప్రజలంతా సమావేశాలకు రావాలని హెచ్చరిస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని వారాంతపు సంతలపై వారం రోజులుగా నిఘా పెట్టారు. వ్యాపారుల నుంచి వస్తువులన్నీ మావోయిస్టులు తీసుకుంటున్నారు. ఆదివాసీ ప్రజలకు ఎటువంటి నిత్యావసర వస్తువులు అందకుండా చేస్తున్నారు. మావోయిస్టుల అనుమతి లేనిదే సంతలు నిర్వహించడానికి వీల్లేదట. పైకి మాత్రం, ఆదివాసీలను పోలీసులు హింసిస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి మావోయిస్టులే ఆదివాసీలను హింసిస్తున్నారు. ఆ తప్పును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మోపుతున్నారు. సోడి సోగయ్య అనే నరహంతకుడి ఆరాచకాలు ఇంకా ఎన్నాళ్లు ...? ఇతడు ఇంతకు ముందు కుర్నపల్లి గ్రామస్తులపై దాడులు చేశాడు. ఇర్పా వెంకటేశ్వర్లును చంపాడు. ఎందుకు చంపిందీ మావోయిస్టులు ఇంతవరకు సమాధానం చెప్పలేదు. పొట్ట కూటి కోసం ఆర్అండ్బీ గ్యాంగ్‌మెన్‌గా పనిచేస్తున్న నాగుల నాగేశ్వరావు, నిట్టా రాజ్‌కుమార్, పందెం నాగేశ్వరావు, గగ్గూరి వెంకటేశ్వరావును చెన్నాపురం సమీపంలో మందుపాతర పేల్చి గాయపరిచారు. అదృష్టవశాత్తు వారికి ప్రాణాపాయం తప్పింది. ఒకవేళ చనిపోతే... వారి భార్యాపిల్లల పరిస్థితి ఏమవుతుందో మావోయిస్టు పార్టీ ఆలోచించాలి. దీనికి తెలంగాణ మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ క్షమాపణ చెప్పాలి. సోడి జోగయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలి. గతంలో రాళ్లాపురంలో మంత్రాలు చేస్తున్నదనే నెపంతో కుడుం ఉంగి అనే మహిళను మావోయిస్టులు కొట్టి చంపారు. దీనికి కూడా ఆ పార్టీ ఇంతవరకు సమాధానం చెప్పలేదు. తెలంగాణకు చెందిన మావోయిస్టు పార్టీ కేడర్ అంతా ఇక్కడ (తెలంగాణ)లో ఆదరణ కోల్పోయింది. అందుకే వారు ఛత్తీస్‌గఢ్ అడవుల్లో తల దాచుకుని, అమాయక ఆదివాసీల ద్వారా ఇతరులపై దాడులు చేయిన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు కమిటీ వదిలి వెళ్లిన తరువాత ఇక్కడి ఆదివాసీ ప్రజలు మంచి జీవనం సాగిస్తున్నారు. మీరు (మావోయిస్టులు) ఛత్తీస్‌గఢ్ వెళ్లిన తరువాత అక్కడి ఆదివాసీలకు కష్టాలు మొదలయ్యాయి. మీరు అక్కడ ఉన్నంత కాలం వారి కష్టాలు తీరవు, అభివృద్ధి జరగదు. కాబట్టి, ఆదివాసీ ప్రజలంతా మావోయిస్టులపై తిరగబడి, తరిమికొట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం’. -
వామపక్షాల లేఖల యుద్ధం
హైదరాబాద్: రాష్ట్రంలో వామపక్ష పార్టీల మధ్య విమర్శల పర్వం కొనసాగుతోంది. లేఖల యుద్ధం ముదురుతోంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణల మధ్య లేఖ యుద్దం సాగుతోంది. రాఘవులు నిన్న రాసిన లేఖకు నారాయణ ఈరోజు ఘాటుగా సమాధానం ఇచ్చారు. నారాయణ తనతో పాటు తన పార్టీ పరువు, ప్రతిష్టలను దిగజార్చుతున్నారని రాఘవులు రాసిన లేఖలో దుయ్యబట్టారు. నారాయణ తన స్థాయి మరిచి విమర్శలకు దిగి అసత్యాలు, దిగజారుడు మాటలు మాట్లాడవద్దని హితవుపలికారు. వైఎస్సార్సీపీతో సర్దుబాట్లపై చర్చలకు తానే ప్రత్యక్ష సాక్షినన్నట్లు మాట్లాడిన నారాయణ నిజాయితీ ఉన్న కమ్యూనిస్టయితే వాటిని నిరూపించాలని రాఘవులు సవాల్ చేశారు. వైఎస్సార్సీపీతో సీపీఎం రహస్యంగా సీట్ల ఒప్పందం కుదుర్చుకుంటోందని నారాయణ విమర్శించిన నేపథ్యంలో రాఘవులు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. పదేపదే లేఖలు రాసినా సీపీఎం పట్ల నారాయణ దురుసుగానే ప్రవర్తిస్తున్నారని చెప్పారు. వామపక్షాల మధ్య ఉండాల్సిన స్థాయిలో ఈ విమర్శలు ఉండడం లేదని, వ్యక్తిగత దూషణలకు దిగి అబద్ధాలు మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. ఈ విమర్శల వల్ల నారాయణకు, ఆయన పార్టీకే తీరని నష్టమని అన్నారు.రాష్ట్రంలో అనిశ్చితి తేలేవరకు ఎన్నికల గురించి చర్చించబోమని ఇదివరకే చెప్పామని గుర్తు చేశారు. ఒంగోలులో గురువారం నారాయణ చేసిన వ్యాఖ్యలను ఖండించడంతో పాటు, నిరాధార, కల్పిత ఊహాగానాలు చేయవద్దని సలహా ఇచ్చారు. దీంతో రాఘవులు లేఖకు ఈరోజు నారాయణ కూడా లేఖ ద్వారానే కటువుగా సమాధానామిచ్చారు. తాను ఒంగోలులో చేసిన ఆరోపణలకు రాఘవులు సూటిగా సమాధానం చెప్పలేకపోయారని పేర్కొన్నారు. బహిరంగంగా చేసిన ఆరోపణను జీర్ణించుకోలేకపోయారని నారాయణ లేఖలో విమర్శించారు. నిజానిజాలు భవిష్యత్తులో తేలుతాయన్నారు.