Lewd SMS
-
పేరుకే అభిరాముడు.. మహిళను చూస్తే వదలడు!!
డాక్టర్లు.. లాయర్లు.. కౌన్సిలర్లు.. ప్రతి ఒక్కరూ ఆయన బాధితులే. ఆయన వయసు 53 ఏళ్లు. కానీ ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా 300 మందికి తన సెల్‌ఫోన్ నుంచి అసభ్య ఎస్ఎంఎస్లు పంపాడు. ఎట్టకేలకు పోలీసులు ఆ కొద్దిబుద్ధులున్న పెద్దాయనను అరెస్టు చేశారు. అభిరామ్ అతుల్కర్ అనే ఆ పెద్దమనిషి పై అలీబాగ్ మునిసిపల్ కౌన్సిల్ అధ్యక్షురాలు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దాదాపు మూడు నెలల క్రితం మొదటిసారి అతడి నుంచి తనకు అసభ్య ఎస్ఎంఎస్ వచ్చిందని, దాని గురించి అప్పట్లో పెద్దగా పట్టించుకోలేదని అలీబాగ్ మునిసిపల్ ఛైర్మన్ నమితా నాయక్ తెలిపారు. తర్వాత చాలా ఎక్కువగా దారుణమైన మెసేజిలు వచ్చాయని, ఈ విషయం కొందరు స్నేహితుల వద్ద ప్రస్తావిస్త.. వాళ్లు కూడా అతడి బాధితులమేనని చెప్పారని ఆమె అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, న్యాయ సంస్థలు, ఆస్పత్రులలో పనిచేసే దాదాపు 300 మంది మహిళలకు అభిరామ్ అతుల్కర్ ఇలా అసభ్య మెసేజిలు పంపేవాడని పోలీసులు చెప్పారు. మరికొందరికి అయితే లేఖలు కూడా రాసేవాడని, కానీ ఎవరూ ఇంతవరకు ఫిర్యాదు చేయలేదని.. చివరకు తానే ధైర్యం చేసి ఈ వ్యవహారానికి ముగింపు పలకాలని నిర్ణయించుకుని ఫిర్యాదు చేశానని నమితా నాయక్ చెప్పారు. -
మహిళా సిబ్బందికి పోలీసు అశ్లీల ఎస్ఎంఎస్లు
పోలీసు అయి ఉండి.. మహిళలకు భద్రత కల్పించాల్సింది పోయి, మహిళా సిబ్బందికే అసభ్య ఎస్ఎంఎస్లు పంపినట్లు ఒడిషాలోని ఓ సీనియర్ పోలీసు అధికారిపై ఫిర్యాదులు వచ్చాయి. ఇలాంటి ఫిర్యాదులను విచారించేందుకు ఏర్పాటైన ప్రత్యేక సెల్ ఈ విషయమై దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ నృసింఘ చరణ్ స్వైన్ తెలిపారు. పని ప్రదేశాలలోమహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం కింద కేంద్రపర జిల్లాలో విచారణ జరుగుతున్న మొట్టమొదటి కేసు ఇదే. ఈ చట్టం గత సంవత్సరమే అమలులోకి రాగా, ఇప్పటివరకు ఈ జిల్లాలో ఒక్క ఫిర్యాదు కూడా నమోదు కాలేదు. మహిళా సిబ్బంది ఫిర్యాదుతో, ఓ మహిళా పోలీసు ఇన్స్పెక్టర్ నేతృత్వంలోని ప్రత్యేక సెల్ విచారణ ప్రారంభించింది. విచారణ పూర్తయ్యి, నివేదిక వెలువడిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. నిందితుడు, బాధితురాలు.. ఇద్దరూ కేంద్రపర పోలీసు స్టేషన్లోనే పని చేస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. -
ఫేస్'బుక్కైపోయాడు'
హైదరాబాద్ : సామాజిక వెబ్సైట్ ఫేస్బుక్లో యువతుల పేర్లతో అకౌంట్లు క్రియేట్ చేసి అభ్యంతరకర సందేశాలు, అశ్లీల ఫోటోలు పోస్ట్ చేస్తున్న ఓ యువకుడిని సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. డీసీపీ పాలరాజు కథనం ప్రకరాం బేగంపేటలోని గన్ బజార్ నివాసి మహ్మద్ ఖాలేద్ ఓల్డ్ బోయిన్‌పల్లిలోని ఓ పెస్ట్ కంట్రోల్ సంస్థలో టెక్నీషియన్. గతంలో ఇతడితో కలిసి మరో సంస్థలో విధులు నిర్వర్తించిన యువతిపై ఆశలు పెంచుకున్న ఖాలేద్ ఫేస్బుక్లో ఆమె అకౌంట్‌ను గుర్తించి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. ఆమె నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో కక్షకట్టాడు. యువతికి చెందిన ఫోటోను ఆమె పేరుతో నకిలీ అకౌంట్ తెరిచాడు. దీన్ని వినియోగించి యువతి ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఉన్న మహిళలు/యువతులకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. రిసీవ్ చేసుకున్న వారంతా సదరు యువతే పంపిందని భావించి యాక్సెప్ట్ చేశారు. ఇలా ఫ్రెండ్స్‌గా మారిన వారిలో ఓ యువతితో అసభ్యకర పదజాలంతో చాటింగ్ చేశాడు. ఆమె ద్వారా సమాచారం అందుకున్న బాధితురాలు సీసీఎస్ డీసీపీ పాలరాజుకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన ఇన్స్పెక్టర్ రాజు నేతృత్వంలోని బృందం సాంకేతిక దర్యాప్తు చేపట్టి నిందితుడైన ఖాలేద్‌ను గుర్తించారు. శుక్రవారం ఇతడిని అరెస్ట్ చేసి విచారించగా... ఇదే తరహాలో మరో ఏడు బోగస్ అకౌంట్లు క్రియేట్ చేసి,అశ్లీల ఫోటోలు పోస్ట్ చేయడంతో పాటు వారి పేర్లతో చాటింగ్స్ చేసినట్లు వెల్లడైంది.