పోలీసు అయి ఉండి.. మహిళలకు భద్రత కల్పించాల్సింది పోయి, మహిళా సిబ్బందికే అసభ్య ఎస్ఎంఎస్లు పంపినట్లు ఒడిషాలోని ఓ సీనియర్ పోలీసు అధికారిపై ఫిర్యాదులు వచ్చాయి. ఇలాంటి ఫిర్యాదులను విచారించేందుకు ఏర్పాటైన ప్రత్యేక సెల్ ఈ విషయమై దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ నృసింఘ చరణ్ స్వైన్ తెలిపారు. పని ప్రదేశాలలోమహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం కింద కేంద్రపర జిల్లాలో విచారణ జరుగుతున్న మొట్టమొదటి కేసు ఇదే.
ఈ చట్టం గత సంవత్సరమే అమలులోకి రాగా, ఇప్పటివరకు ఈ జిల్లాలో ఒక్క ఫిర్యాదు కూడా నమోదు కాలేదు. మహిళా సిబ్బంది ఫిర్యాదుతో, ఓ మహిళా పోలీసు ఇన్స్పెక్టర్ నేతృత్వంలోని ప్రత్యేక సెల్ విచారణ ప్రారంభించింది. విచారణ పూర్తయ్యి, నివేదిక వెలువడిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. నిందితుడు, బాధితురాలు.. ఇద్దరూ కేంద్రపర పోలీసు స్టేషన్లోనే పని చేస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
మహిళా సిబ్బందికి పోలీసు అశ్లీల ఎస్ఎంఎస్లు
Published Tue, Apr 29 2014 2:51 PM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM
Advertisement
Advertisement