ఎల్జీ ఎక్స్ స్క్రీన్ ధర ఎంతో తెలుసా?
న్యూఢిల్లీ: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిదారు ఎల్జీ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'ఎల్జీ ఎక్స్ స్క్రీన్'ను మార్కెట్ లో లాంచ్ చేసింది. దీనిధరను రూ.12,990 లుగా కంపెనీ నిర్ణయించింది. స్నాప్ డీల్ ద్వారా జులై 20 నుంచి అమ్మకాలు మొదలుకానున్నట్టు సంస్థ తెలిపింది. అలాగే ఎల్జీ ఎక్స్ స్క్రీన్' వినియోగదారులకు 45 రోజుల ఉచిత హంగామా మ్యూజిక్ వీడియో డౌన్లోడ్ అందిస్తోంది. వొడాఫోన్ స్మార్ట ఫోన్ వినియోగదారులకు డబుల్ డేటా ఉచితం. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పానిక్ బటన్ ఇందులో అమర్చబడింది. వినియోగదారడు పవర్ బటన్ వరుసగా ఐదు సార్లు నొక్కితే నిర్దేశిత నెంబర్లకు హెచ్చరికలు పంపుతుంది.
బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఆఫరింగ్‌లో తమ స్థానాన్ని బలపర్చుకోవడానికి డ్యూయల్ డిస్ప్లే ఫోన్ మార్కెట్లోకి తీసుకొస్తున్నట్టు కంపెనీ వెల్లడించినసంగతి తెలిసిందే. ఈ డ్యూయల్ డిస్ప్లే ఫోన్ ద్వారా నోటిఫికేషన్లను చూసుకోవడాని వేరే ప్రోగ్రామ్‌ను ఆపాల్సిన అవసరం ఉండదు. బ్రౌజర్లో వర్క్ చేసుకుంటూనే వాట్సప్, ఫేస్బుక్ నోటిఫికేషన్లను చూసుకోవచ్చు. ఒకేసారి రెండు ప్రోగ్రామ్స్‌పై వర్క్ చేసుకోవచ్చు.
ఎల్జీ ఎక్స్ స్క్రీన్ ఫీచర్లు...
4.93 ఇంచ్ హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే, 1280-720 పిక్సెల్ స్ర్కీన్ రిజల్యూషన్
1.76 ఇంచ్ సెకండరీ డిస్ప్లే, 520 x 80 పిక్సెల్ స్క్రీన్ రిజల్యూషన్
1.2 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్, అడ్రినో 306 గ్రాఫిక్స్
2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
4జీ ఎల్టీఈ, బ్లూటూత్ 4.1, ఎన్ఎఫ్సీ
120 గ్రాముల బరువు 7.1 ఎంఎ మందం
2300 ఎంఏహెచ్ బ్యాటరీ
కాగా ఇటీవల కె10,కె 7 పేరుతో డబుల్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లో విడుదల చేసింది.