Lieutenant-General
-
చైనాతో తొలగుతున్న ఉద్రిక్తతలు
న్యూఢిల్లీ: సరిహద్దు వివాదానికి సంబంధించి భారత్, చైనాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు క్రమంగా తొలగుతున్నాయి. ఈ దిశగా, తాజాగా, బుధవారం ఇరు దేశాల మధ్య మేజర్ జనరల్ స్థాయి చర్చలు జరిగాయి. అన్ని వివాదాస్పద ప్రాంతాల నుంచి చైనా అదనంగా మోహరించిన బలగాలను తక్షణమే వెనక్కు పంపించాలని, సరిహద్దుల్లో వివాదం తలెత్తకముందున్న పరిస్థితి మళ్లీ నెలకొనేలా చూడాలని సుమారు 5 గంటల పాటు జరిగిన ఈ చర్చల్లో భారత్ డిమాండ్ చేసిందని సంబంధిత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఉద్రిక్తతలను తొలగించే దిశగా సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయని పేర్కొన్నాయి. ఇప్పటికే తూర్పు లదాఖ్‌లోని గాల్వన్ లోయ, చాంగ్ చెన్‌మొ రివర్ వ్యాలీల్లో ఉన్న పలు సున్నిత ప్రాంతాల నుంచి రెండు దేశాలు తమ బలగాలను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఆయా ప్రదేశాల నుంచి చైనా సుమారు 1.5కిమీలు వెనక్కు వెళ్లినట్లు భారత మిలటరీ వర్గాలు మంగళవారం వెల్లడించాయి. అయితే, ప్యాంగాంగ్ సొ, దౌలత్ బేగ్ ఓల్డీ, దెమ్చాక్‌ల్లో మాత్రం రెండు దేశాల సైన్యం ఇంకా ఢీ అంటే ఢీ అనే స్థితిలోనే ఉన్నాయి. మే 5వ తేదీ నుంచి సరిహద్దుల్లో భారత్, చైనాల సైనికుల మధ్య ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. వాటిని తొలగించే దిశగా ఇరు దేశాలు మిలటరీ, దౌత్య మార్గాల ద్వారా ప్రయత్నాలు ప్రారంభించాయి. జూన్ 6న భారత లెఫ్ట్‌నెంట్ జనరల్ హరీందర్ సింగ్, చైనా మేజర్ జనరల్ లియూ లిన్ల మధ్య చర్చలు జరిగాయి. ఆ చర్చల సందర్భంగా కుదిరిన ఏకాభిప్రాయం మేరకు రెండు దేశాల సైన్యం సానుకూల చర్యలు చేపట్టాయని బుధవారం చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ వ్యాఖ్యానించారు. 1962 నాటి భారత్ కాదు.. ఇది 1962 నాటి భారత్ కాదని, ఇప్పుడు భారతదేశాన్ని పాలిస్తోంది కాంగ్రెస్ కాదని, నరేంద్ర మోదీ అనే ధైర్య సాహసాలున్న నాయకుడు ప్రధానిగా ఉన్నాడని బీజేపీ వ్యాఖ్యానించింది. చైనాకు సంబంధించిన వ్యూహాత్మక అంశాలను ట్వీటర్లో ప్రస్తావించకూడదన్న కనీసం జ్ఞానం కూడా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి లేదని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. చైనాతో ఉద్రిక్తతల విషయంలో ప్రధాని మోదీ మౌనం వహించడాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. లదాఖ్‌లోని భారత్ భూభాగాలపైకి చైనా సైన్యం వచ్చినప్పటికీ.. ప్రధాని పెదవి విప్పడం లేదని విమర్శించారు. -
తదుపరి ఆర్మీచీఫ్‌గా దల్బీర్‌సింగ్ సుహాగ్
-
తదుపరి ఆర్మీచీఫ్‌గా దల్బీర్‌సింగ్ సుహాగ్
బీజేపీ నిరసనలను పట్టించుకోకుండా నియమించిన ప్రభుత్వం జూలై 31న రిటైరవనున్న ప్రస్తుత ఆర్మీ చీఫ్ న్యూఢిల్లీ: లెఫ్టినెంట్ జనరల్ దల్బీర్‌సింగ్ సుహాగ్‌ను తదుపరి ఆర్మీ చీఫ్‌గా ప్రభుత్వం నియమించింది. ఆర్మీచీఫ్ నియామకంపై బీజేపీ నుంచి ఎదురవుతున్న నిరసనలను పట్టించుకోకుండా, ప్రధాని మన్మోహన్సింగ్ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ సుహాగ్ నియామకంపై రక్షణ శాఖ సిఫారసును మంగళవారం ఆమోదించింది. ప్రస్తుత ఆర్మీచీఫ్ జనరల్ బిక్రమ్ సింగ్ జూలై 31న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన తర్వాత సుహాగ్ ఆర్మీచీఫ్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుతం ఆర్మీలో పనిచేస్తున్న లెఫ్టినెంట్ జనరల్స్‌లో గూర్ఖా అధికారి అయిన దల్బీర్‌సింగ్ సుహాగ్ (59) అందరి కంటే సీనియర్. చిత్తోర్‌గఢ్ సైనిక్ స్కూలులో విద్యాభ్యాసం చేసిన సుహాగ్, 1970లో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొంది, 1974 జూన్‌లో 4/5 గూర్ఖా రెజిమెంట్‌లో చేరారు. సైనిక శిక్షణకు సంబంధించి దేశ విదేశాల్లో పలు కోర్సులు పూర్తిచేసిన సుహాగ్, శ్రీలంకలో చేపట్టిన ‘ఆపరేషన్ పవన్’లో కంపెనీ కమాండర్‌గా కీలక పాత్ర పోషించారు. కాశ్మీర్ లోయలో 2003 జూలై నుంచి 2005 మార్చి వరకు చేపట్టిన చొరబాటు నిరోధక ఆపరేషన్‌కు నాయకత్వం వహించారు. కార్గిల్ యుద్ధంలో 2007 అక్టోబర్ నుంచి 2008 డిసెంబర్ వరకు 8 మౌంటైన్ డివిజన్‌ను విజయవంతంగా నడిపించారు. జనరల్ వీకే సింగ్ ఆర్మీ చీఫ్‌గా ఉన్న సమయంలో తలెత్తిన వివాదం అనంతరం 2012 జూన్ 16న ఈస్టర్న్ ఆర్మీ కమాండర్‌గా బాధ్యతలు చేపట్టారు. వీకే సింగ్ ఆర్మీ చీఫ్‌గా ఉన్నప్పుడు ఆయన సుహాగ్‌పై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా నిషేధం విధించారు. వీకే సింగ్ పదవీ విరమణ తర్వాత బిక్రమ్ సింగ్ ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే సుహాగ్‌పై నిషేధాన్ని తొలగించారు. ఆర్మీ చీఫ్‌గా దల్బీర్ ఎంపికపై బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కొద్దిరోజుల్లోనే కొత్త ప్రభుత్వం అధికారంలోకి రానున్నందున ఇప్పటికిప్పుడే ఈ నియామకాన్ని చేపట్టేందుకు తొందరేమొచ్చిందని ప్రశ్నించింది.