Life alms
-
నా భర్తకు ప్రాణభిక్ష పెట్టండి
* కువైట్‌లో డ్రగ్స్ కేసులో ఇరికించారు * నిందితులపై చర్యలు తీసుకోండి * పోలీసులకు బాధితురాలి అభ్యర్థన రొంపిచెర్ల: ‘నా భర్తను అన్యాయంగా డ్రగ్స్ కేసులో ఇరికించడంతో కువైట్ ప్రభుత్వం మరణశిక్ష విధించింది, ప్రభుత్వం, పోలీసులు రంగప్రవేశం చేసి ప్రాణభిక్ష పెట్టాల’ని శుక్రవారం ఓ మహిళ పోలీసులను అభ్యర్థిం చింది. బాధితురాలి కథనం మేరకు రొంపిచెర్ల మండలం పెద్దమల్లెల గ్రామ పంచాయతీ దుస్సావాండ్లపల్లెకు చెందిన సుధారాణి, ఎర్రావారిపాళెం మండలం మెదరపల్లెకు చెందిన పొంతల మహేష్ 8 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి పిల్లలు రీతూ(6), పవన్(4) ఉన్నారు. కుటుంబ జీవనం కష్టంగా ఉండటంతో మూడు సంవత్సరాల క్రితం రొంపిచెర్ల మండలం దుస్సావాండ్లపల్లెకు వచ్చి నివాసం వచ్చారు. కూలి పనులు చేసుకుంటూ జీవించేవారు. ఆశించిన మేరకు పనులు లేక పోవడంతో బతుకుదెరువు కోసం రెండేళ్ల క్రితం మహేష్ కువైట్‌కు వెళ్లాడు. అక్కడ వ్యవసాయుక్షేత్రంలో పనిచేస్తూ కిడ్నీల జబ్బు బారిన పడ్డాడు. దీంతో 11 నెలల క్రితం వుళ్లీ కువైట్ నుంచి రొంపిచెర్ల మండలం దుస్సావారిపల్లెకు వచ్చారు. వైద్య పరీక్షలు చేసుకోని వుళ్లీ 9 నెలల క్రితం కువైట్‌కు బయలుదేరాడు. అ సమయంలో ఎర్రావానిపాళెం మండలం మెదరపల్లెకు చెందిన అతని పిన్నమ్మ చిట్టెమ్మ కుమారులు బాలసుబ్రమణ్యం, కిరణ్ కలిశారు. కువైట్‌లో ఉన్న వారి అమ్మకు నూతన వస్త్రాలు తీసుకెళ్లాలని ఒక బాక్స్ తెచ్చి ఇచ్చారు. దాన్ని మహేష్ కువైట్‌కు తీసుకెళ్లాడు. అక్కడ విమానాశ్రయంలో పోలీసుల తనిఖీచేయగా ఆ బాక్స్‌లో డ్రగ్స్ ఉన్నట్లు బయట పడింది. ఈ కేసులో మహేష్‌కు వారం రోజుల క్రితం వురణశిక్ష విధించింది. ఈ విషయూన్ని అతడు భార్య సుధారాణికి ఫోన్ ద్వారా తెలియజేశారు. దీంతో ఆమె, అత్తమామలు వెంకట్రామ్మయ్య, పద్మావతమ్మ కలిసి అతనికి ప్రాణబిక్ష పెట్టాలని పీలేరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేష్‌కు శుక్రవారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అజ్ఞాతంలో చిట్టెమ్మ ? డ్రగ్స్ కేసులో మహేష్ కువైట్‌లో పోలీసులకు పట్టుబడడంతో అక్కడ ఉన్న చిట్టెమ్మ గుట్టు చప్పుడు కాకుండా ఇండియాకు బయలుదేరి వచ్చిందని సమాచారం. ఆమె ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో తలదాచుకుంటోందని తెలిసింది. పోలీసులు తప్పనిసరిగా చిట్టెమ్మ కుటుంబంపై దాడి చేస్తారని భావించిన ఆమె అజ్ఞాతంలోకి వెళ్లారని తెలిసింది. అలాగే ఆమె కుమారులు కూడ ఇతర ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారని గ్రామస్తుల ద్వారా తెలిసింది. ఎర్రావారిపాళెం మండలంలో డ్రగ్స్ ముఠా? ఎర్రావారిపాళెం మండలంలో విదేశాలకు డ్రగ్స్ సరఫరా చేసే ముఠా ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఎర్రావారిపాళెం వుండలానికి చెందిన ముఠా తిరుపతిలోని పలు కళాశాలల్లో విద్యార్థులకు సైతం డ్రగ్స్‌ను విక్రయించినట్లు తెలిసింది. -
అయ్యో పాపం.. అనూహ్య
⇒ చిన్నారిని వేధిస్తున్న రక్తహీనత ⇒ ఏడాదిన్నరగా మంచానికే పరిమితం ⇒ రూ.25 లక్షలుంటేనే వైద్యం ⇒ తల్లడిల్లుతున్న నిరుపేద కుటుంబం ⇒ దాతల కోసం ఎదురుచూపు బంజారాహిల్స్: ఓ నిరుపేద కుటుంబానికి పెద్ద కష్టమొచ్చింది. ఆడుతూ పాడుతూ బడికి వెళ్లాల్సిన చిన్నారి ఏడాదిన్నర కాలంగా మంచానికే పరిమితమైంది. తీవ్రమైన రక్తహీనతతో బాధపడుతుండడంతో ఆ చిన్నారి తల్లిదండ్రులను కలిచివేసింది. రూ.లక్షలు వెచ్చించి వైద్యం చేయించే స్థోమత లేక.. కన్నపేగును కాపాడుకునే మార్గం తెలియక తల్లడిల్లిపోతున్నారు. వివరాలిలా.. పి.శ్రీనివాసరావు, భారతి దంపతులు. వీరికి ఒక బాబు, ఓ పాప. శ్రీనివాస్‌రావు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. బంజారాహిల్స్‌లో నివాసం ఉంటున్నారు. బాబు బధిరుడు. కొన్నేళ్లపాటు అవస్థపడి శక్తికి మించి ఖర్చు చేసి వైద్యం చేయించి ఓ కొలిక్కి తీసుకువచ్చారు. పరిస్థితి మెరుగుపడిందనుకున్న దశలో పాప అనూహ్య (8) ఒక్కసారిగా కుప్పకూలింది. చదువుతోపాటు ఆట, పాటల్లో రాణిస్తూ ఎంతో హుషారుగా ఉండేది. వైద్యులకు చూపించగా ఏడాదిన్నర క్రితం భయంకరమైన వాస్తవం బయటపడింది. అప్లాస్టిక్ ఎనీమియా (తీవ్రమైన రక్తహీనత)తో బాధపడుతుందని వైద్యులు నిర్ధారించారు. ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి కాకపోవడం, ఎముకల్లో ఉండే తెల్లని పదార్థం రక్తకణాలను, ప్లేట్‌లెట్స్‌ను ఉత్పత్తి చేయడం మానేసింది. ఎర్ర రక్తకణాలు తగ్గిపోవడంతో రక్తానికి ఆక్సీజన్ అందక అనూహ్య నీరసించి పోయింది. ఈ వ్యాధి నయం చేయాలంటే స్టెమ్‌సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు రూ.8.50 లక్షలు, నిమ్స్‌లో చికిత్సకు రూ.16.50 లక్షలు మొత్తం రూ.25 లక్షలు ఖర్చుఅవుతుందని చిన్నారి తండ్రి శ్రీనివాస్‌రావు తెలిపాడు. ఇంత మొత్తం వెచ్చించే పరిస్థితి లేదని వాపోతున్నాడు. దాతలెవరైనా ముందుకు వచ్చి తన కూతురికి ప్రాణ భిక్ష పెట్టాలని వేడుకుంటున్నాడు. సహాయం చేయాలనుకునే వారు 9059705169, 9052301145 నంబర్లలో సంప్రదించాలని కోరుతున్నాడు. బ్యాంకులో డబ్బులు వేయాలకునే వారు ‘పి.కెరెన్ అనూహ్య, అకౌంట్ నం.20202376033, ఎస్బీఐ, శ్రీపురం మలక్‌పేట, హైదరాబాద్, ఐఎఫ్ఎస్సీ కోడ్: ఎస్బీఐఎన్0060339’ శ్రీనివాస్‌రావు తెలిపాడు.