life partners
-
‘స్మార్ట్’ వాదనలు స్మార్ట్ కాదు! లైఫ్ పార్ట్నర్తో ‘ఫెక్స్‌టింగ్’ చేస్తున్నారా?
భార్యాభర్తలు, జీవిత భాగస్వాముల మధ్య ఏదో అంశం మీద వాదోపవాదనలు, చిన్న చిన్న గొడవలు మామూలే. వాదన జరుగుతుండగా... ఆఫీసుకు వెళ్తూ తన పార్ట్నర్ నుంచి దూరంగా వెళ్తే గొడవ సద్దుమణగడం ఖాయం. కానీ మొబైల్ ఫోన్లో టెక్ట్స్ మెసేజీల రూపంలో అదే గొడవ అదే పనిగా కొనసాగితే...? ఇలా లైఫ్ పార్ట్నర్స్ మధ్య ఫైటింగ్ కాస్తా టెక్ట్స్ మెసేజీల రూపంలో కొనసాగడాన్ని‘ఫెక్స్‌టింగ్’ అనే ధోరణిగా అభివర్ణిస్తున్నారు. మొబైల్స్ ఎన్నెన్నో కొత్త కొత్త రకాల ఫీచర్స్‌తో వస్తున్నాయి కాబట్టి వాటిని ‘స్మార్ట్’ఫోన్స్ అన్నారు. కానీ ‘ఫెక్స్‌టింగ్’ అంత స్మార్ట్ కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘ఫెక్స్‌టింగ్’ అంటే కేవలం జీవిత భాగస్వాముల మధ్య ఫైటింగ్ అనే కాదు... పేరెంట్స్, ఫ్రెండ్స్ మధ్య కూడా కావచ్చుకానీ... అత్యధికంగా ప్రభావం చూపేది భార్యాభర్తల మధ్యనే కావడంతో సాధారణంగా దాన్ని లైఫ్పార్ట్నర్స్కే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అత్యంత ప్రఖ్యాతమైన ఓ సెలబ్రిటీ కేస్‌స్టడీ: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన భార్య, అమెరికన్ ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ల దాంపత్యం వయసు 45 ఏళ్లు పైమాటే. ఇటీవల ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాము వాదించుకునేందుకు టెక్ట్స్ మెసేజీలు వాడతామని చెప్పా రు. అందుకు ఓ వినోదాత్మక కారణం కూడా తెలిపారు. తమ ఘర్షణ, వాదోపవాదాలు అమెరికన్ సీక్రెట్ ఏజెన్సీకి తెలియకుండా ఉండేందుకు ఈ మార్గాన్ని ఉపయోగిస్తుంటామని సరదాగా వెల్లడించారామె. అంటే అందరి గుట్టుమట్లు పసిగట్టే అత్యంత సమర్థమైన ఏజెన్సీనే బురిడీ కొట్టించడానికి ఆమె ‘ఫెక్స్‌టింగ్’ ను ఎంచుకున్నారన్న మాట. రెండు రకాల వాదనలు ఫెక్స్టింగ్లో పార్ట్నర్స్ ఎదురెదురుగా ఉండరు కాబట్టి... ముఖ కవళికలూ. అందులోని ఆవేశాలూ, ఉద్వేగాలూ కనిపించవు. వాదన తాలూకు తీవ్రత అక్షరాల్లో అంతగా ప్రభావ పూర్వకంగా కనిపించదు కాబట్టి అంత హానికరం కాదనీ అనేవాళ్లూ ఉంటారు. అంతేకాదు... ఆ వాదన కొనసాగడానికి ఇష్టపడని వారు... టెక్ట్స్‌కు బదులుగా క్రమంగా ‘స్మైల్’ లేదా షేక్‌హ్యాండ్ ఎమోజీల్లాంటివి ఉపయోగిస్తూ పోతే, ఎదుటివారి నుంచి తగినంత ప్రతిస్పందన లేకపోవడంతో క్రమంగా వాదన సన్నగిల్లిపోతుందనీ, ఎదురుబొదురు ఉన్నప్పటంత హాని జరగకపోవచ్చనీ కొందరు చెబుతుంటారు. సరిగ్గా దీనికి పూర్తి భిన్నంగా వాదించేవారూ ఉంటారు. మాటలు తడబడవచ్చు. ఏదో మాట సరిగా వ్యక్తం కాకపోవచ్చు. కానీ సరిగ్గా వ్యక్తీకరించగలిగేవాళ్లైతే రాతలోనే ప్రభావం ఎక్కువ అని చెప్పేవాళ్లూ ఉన్నారు. పాతగాయాలూ రేగే ప్రమాదం దంపతుల మధ్య సంభాషణల రూపంలో ఎదురుబొదురుగా ఘర్షణలు జరుగుతున్నప్పుడు ఏదైనా మాటతూలినా గాలికి పోయే మాటల వల్ల ఆ తర్వాత ఎలాంటి ప్రభావమూ ఉండదు. కానీ ‘రాత’ ఎప్పటికీ నిలిచిపోయే అవకాశం ఉంది. అందువల్ల ఆ తర్వాత ఎప్పుడో చదువుకున్నప్పుడూ పాత మాటలూ, పాత వాదనల ప్రభావాలు కెలికినట్లుగా అయి, అవి ఆ తర్వాతెప్పుడో కూడా ప్రమాదం తెచ్చిపెట్టవచ్చని మరికొందరు చెబుతున్నారు. అంతుఉండకపోవచ్చు... ఆ అంశమే ప్రమాదం తేవచ్చు... పొద్దున్నే భార్యాభర్తల మధ్య వాదన చెలరేగింది. ఇద్దరూ తమ తమ పనులు చేసుకుంటూనే వాదనల్లో మునిగిపోయారు. ఆఫీసుకు బయల్దేరే సమయానికి ఘర్షణ పెద్దదైంది. కానీ ఆఫీసు సమయానికి ఎవరి దారిలో వాళ్లు వెళ్లిపోవడంతో ఆ ‘వాదోపవాదాలు’ అక్కడితో ముగుస్తాయి. కానీ ‘ఫెక్స్‌టింగ్’ అలా కాదు. ఆఫీసుకు వెళ్లే దారిలో బస్సులోనో, ఆటోలోనో లేదా మెట్రోరైల్ లోనో అలాగే కొనసాగవచ్చు. అంతేకాదు... ఆఫీసుకు చేరి, సీట్లలో కూర్చున్నాక కూడా అదేపనిగా కొనసాగితే ప్రమాదమే. ఆ మాటకొస్తే కీలకమైన మీటింగుల్లోనూ ‘టెక్ట్స్ మెసేజు’లు కొనసాగుతూ... అసలు లక్ష్యానికి అడ్డంగా మారవచ్చు. టెక్ట్స్ వల్ల ఒనగూరే సౌలభ్యమల్లా వాదన మౌనంగా కొనసాగుతూ... అది మాటల ద్వారా బయటకు తెలియదంతే. కానీ పని ప్రదేశంలో... చేయాల్సిన పని వదిలేసి అదేపనిగా వాదులాడుకుంటూ పోతే... ఆఫీసులో పూర్తి చేయాల్సిన పనులు కొనసాగకపోగా / జరగకపోగా... అదే ఇబ్బంది తెచ్చిపెట్టే ప్రమాదమూ ఉందంటున్నారు కపుల్ కౌన్సెలింగ్ నిర్వాహకులు, మనస్తత్వ నిపుణులు. అంతేకాదు... అది పనితీరుతో పాటు, బంధాల విషయాల్లోనూ ప్రమాదం తెచ్చిపెట్టవచ్చునని హెచ్చరిస్తున్నారు. వస్తువులో కాదు... అంతా మన విచక్షణలోనే ఉంది... ‘‘ఏదైనా ప్రయోజనం అన్నది ఆ వస్తువును మనం ఉపయోగించే తీరులో లేదా మన విచక్షణను బట్టే ఉంటుందిగానీ... ఉపకరణంలో ఏమీ ఉండదు. ఇంగ్లిష్‌లో చెప్పా లంటే ‘ఆబ్జెక్ట్’లో కాకుండా ‘ఆబ్జెక్టివ్’లోనే అంతా ఉంది’’ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు కొందరు మనస్తత్వ నిపుణులు. ఎప్పుడైనా అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు ఎదురుబొదురుగా ఉండి మాట్లాడుకోవడమే మంచిది. కొన్ని పదాలు, పంక్చువేషన్లు, ఎమోజీల వల్ల దురభిప్రాయాలు వచ్చే అవకాశమూ ఉంది. మాటల్లో చెప్పుకునే విషయాలను రాతలో పెట్టినప్పుడు అది మరింతగా హాని చేసే ప్రమాదం ఉంది. ‘మీ అభిప్రాయం తో ఏకీభవించకపోవచ్చు. కానీ మీ అభిప్రాయానికి విలువివ్వాల్సిందే’ అనే పరస్పర గౌరవ భావన, దృక్పథాల వల్లనే మంచి ఫలితాలు వస్తాయి. – డాక్టర్ సుజాత రాజమణి, మానసిక నిపుణులు -
‘హెచ్4’ ఉద్యోగాలతో ముప్పేం లేదు!
వాషింగ్టన్: అమెరికాలోని హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వామ్యులకు ఉద్యోగావకాశాలు కల్పించే నిబంధనను తొలగించేలా ఆదేశాలివ్వవద్దని దేశాధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం వాషింగ్టన్‌లోని ఫెడరల్ కోర్టును కోరింది. వారు ఉద్యోగాలు పొందడం వల్ల అమెరికన్ల ఉద్యోగావకాశాలు అంతగా ప్రభావితం కావడం లేదని కోర్టుకు తెలిపింది. హెచ్4 వీసాదారుల వల్ల అమెరికన్ల ఉద్యోగాలకు తీవ్రస్థాయిలో ముప్పు ఏర్పడుతుందన్న ‘సేవ్ జాబ్స్ యూఎస్ఏ’వారి వాదన సరికాదని వాషింగ్టన్‌లోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టుకు ట్రంప్ ప్రభుత్వం మే 5న వివరించింది. దానికి సంబంధించి ‘సేవ్ జాబ్స్ యూఎస్ఏ’చూపిన ఆధారాలు సరికావని వాదించింది. ఈ నిర్ణయం వేలాది భారతీయులకు శుభవార్తగా మారింది. హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వామి, 21 ఏళ్లు పైబడిన పిల్లలకు అమెరికా ప్రభుత్వం హెచ్4 వీసా జారీ చేస్తుంది. హెచ్4 వీసాదారుల్లో కొన్ని కేటగిరీల వారు ఉద్యోగాలు చేసుకునే అవకాశాన్ని 2015లో నాటి ఒబామా ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా కల్పించింది. 2017 డిసెంబర్ నాటికి 1,26,853 హెచ్4 వీసాదారుల ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ దరఖాస్తులను అమెరికా పౌర, వలస సేవల(యూఎస్సీఐఎస్) విభాగం ఆమోదించింది.ఒబామా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను అమెరికన్ టెక్నాలజీ వర్కర్ల తరఫున ‘సేవ్ జాబ్స్ యూఎస్ఏ’సంస్థ కోర్టులో సవాలు చేసింది. హెచ్4 వీసాదారులు యూఎస్‌లో ఉద్యోగాలు చేసుకునే వెసులుబాటును తొలగించే విషయమై ఆలోచిస్తున్నామని అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. కానీ, దానికి సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. -
హెచ్–4 వీసాల్ని కొనసాగించండి
వాషింగ్టన్: హెచ్1–బీ వీసాదారుల జీవిత భాగస్వాములు అమెరికాలో చట్టబద్ధంగా పనిచేసేందుకు వీలుకల్పించే హెచ్–4 వీసా నిబంధనను కొనసాగించాలని సిలికాన్ వ్యాలీకి చెందిన పలువురు డెమొక్రాట్ చట్టసభ్యులు డిమాండ్ చేశారు. 2015లో ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమల్లోకి తెచ్చిన ఈ నిబంధనతో భారతీయ–అమెరికన్లు ఎక్కువగా లబ్ధి పొందుతున్నారు. హెచ్–4 వీసా నిబంధన అమల్లోకి వచ్చిన తర్వాత 1,04,000 మందికి అమెరికాలో పనిచేసేందుకు అనుమతి లభించింది. ట్రంప్ సర్కారు హెచ్–4 వీసాల్ని రద్దు చేసే ప్రయత్నాల్లో ఉందన్న వార్తల నేపథ్యంలో డెమొక్రాట్ ఎంపీలు స్పందిస్తూ.. మార్చి 5న అమెరికా హోం ల్యాండ్ విభాగానికి లేఖ రాశారు. -
లైఫ్ పార్ట్నర్ ఆన్లైన్ యాక్టివిటీపై కన్నేశారా?
దుబాయ్ : దాంపత్యజీవితం సుఖసంతోషాలతో నడవాలంటే ప్రేమ అనురాగాలతో పాటు నమ్మకం చాలా అవసరం. ఒకరిపై ఒకరికి నమ్మకం లేకుండా నేటి స్మార్ట్ యుగంలో బతకడం కష్టం. చాలా మంది తమ రోజు మొత్తంలో ఎన్నో విషయాలు తమ ఫోన్ల ద్వారానే మాట్లాడుతుంటారు. తమ ప్రైవసీలో ఫోనుకు మొదటి భాగం ఇస్తుంటారు. వాటికి పాస్వర్డ్లు, పిన్లాక్లు పెట్టుకుంటారు. కానీ పెళ్లి తర్వాత తమ భార్య లేదా భర్త గురించి పూర్తిగా అన్ని విషయాలను తెలుసుకోవాలి అనుకుంటారు. ఈ విషయంపై కాస్పెర్స్కే ల్యాబ్ అనే రష్యా ఆధారిత సైబర్ యాంటి-వైరస్ ప్రొవైడర్ యుఎఇలో ఇంటర్నెట్ వినియోగదారులపై ఓ సర్వేని నిర్వహించింది. అందులో 36 శాతం మంది తమ భార్య లేదా భర్త ఆన్లైన్లో ఏం చేస్తున్నారో, ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో చాట్ చేస్తున్నారు అనే విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తేలింది. నిలకడ లేని సంబంధాలు కలిగి ఉన్న వారిలో 45 శాతం మంది ఉన్నారు. ప్రతి పది మందిలో ఆరుగురు తమ ఫోన్ పాస్‌వర్డ్‌లను తమ జీవితభాగస్వామితో పంచుకోవడానికి సుముఖత వ్యక్తం చేశారు. దాని వల్ల తమ మధ్య నమ్మకం బలపడుతుందని అభిప్రాయపడుతున్నారు. మరికొంత మంది మాత్రం జీవితంలో ఒకరి గురించి ఒకరు చాలా వరకు తెలుసుకున్న ఎంతకొంత ప్రైవేట్ లైఫ్ ఉండి కొంత ప్రైవసీ ఉండాలంటున్నారు. ఒక వ్యక్తి తన భార్య ఫేస్బుక్లో ఎవరితో చాట్ చేస్తుందో తెలుసుకోవాలని ఉంటుందని, ఎందుకంటే మహిళలకు ఫేస్బుక్లో ఎక్కువ మంది అపరిచితుల నుంచి ఫ్రెండ్ రిక్వెస్టులు వస్తాయని వాటి నుంచి తన భార్యను కాపాడుకోవడం కోసం తన ఫోన్ పాస్వర్డ్ తెలుసుకుని తన ఫోన్‌ను చెక్ చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. మరోకరు ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటే చాలని ప్రైవసీ కంటే రిలేషన్షిప్ చాలా ముఖ్యమని తెలిపారు. -
వాట్స్‌యాప్‌తో పెరుగుతున్న విడాకులు!
వాట్స్‌యాప్ కారణంగా విడాకులు తీసుకుంటున్న జంటల శాతం గణనీయంగా పెరుగుతోందట. వాట్స్‌యాప్‌లో కొత్తవారికి మెసేజీలు పంపడంలాంటి చర్యల వల్ల ఇటలీలో జీవిత భాగస్వాముల పట్ల అపనమ్మకం పెరిగి విడాకులకు దారి తీస్తోందట. విడిపోతున్న జంటల్లో సుమారు 40 శాతం మంది వాట్స్‌యాప్ కారణంగానే తెగదెంపులు చేసుకుంటున్నారని ‘ఇటాలియన్ అసోసియేషన్ ఆఫ్ మాట్రిమోనియల్ లాయర్స్’ను ఉటంకిస్తూ ‘టైమ్స్ ఆఫ్ లండన్’ వెల్లడించింది.