Life prison
-
డెబ్బై ఏళ్ల తర్వాత తొలిసారి అమెరికా..
దాదాపు డెబ్బై ఏళ్ల తర్వాత అమెరికా తొలిసారి ఒక మహిళకు మరణశిక్ష అమలు చేయబోతోంది. ఆ మహిళ.. లీసా మాంట్గోమెరి. ఆమెను ఉరి తియ్యరు. ఎలక్ట్రిక్ చెయిర్లో కూర్చోబెట్టరు. ఇంజెక్షన్‌తో శిక్ష విధిస్తారు! ఒక నిండు గర్భిణిని హత్య చేసినందుకు ఆమెకు పడిన ఈ శిక్షను రద్దు చేయాలని ‘మరణ దండన’ను వ్యతిరేకించే మానవతావాదులు కొత్త అధ్యక్షుడు జోబైడన్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే బైడెన్ ప్రమాణ స్వీకారానికి ముందే లీసా శిక్ష అమలవకుండా ఉండే అవకాశాలేమీ ఇప్పటికైతే కనిపించడం లేదు. వాషింగ్టన్: అమెరికా కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేసేలోపు, డొనాల్డ్ ట్రంప్ తను చేయదలచుకున్న పనులన్నిటికీ సంతకాలు పెట్టేస్తేన్నారు. చివరి నిముషపు సంతకాలు ఆయన ఎన్నైనా పెట్టి ఉండొచ్చు. వాటిల్లో ఆయన పెట్టిన ఒక సంతకాన్ని మాత్రం కొత్త అధ్యక్షుడు చెరిపేయాలని అమెరికన్ ప్రజల్లో ఎక్కువమంది కోరుకుంటున్నారు. ఒక నేరస్థురాలికి కోర్టు విధించిన మరణశిక్షకు ఆమోదం తెలియజేస్తూ ట్రంప్ పెట్టిన సంతకం అది! ఆ నేరస్థురాలు లీసా మాంట్గోమెరి. ఒకవేళ లీసాకు శిక్షను తప్పించుకునే మార్గమే లేకపోతే డెబ్భై ఏళ్ల తర్వాత అమెరికా తొలిసారి ఒక మహిళకు విధించిన మరణశిక్ష అవుతుందది. ఈ నెల 12 న లీసాకు శిక్ష అమలు చేయాలని కొత్త సంవత్సరం రోజు అమెరికన్ కోర్టు అంతిమతీర్పు చెప్పింది. లీసాను ఉరి తీయరు. ఎలక్ట్రిక్ చెయిర్లో కూర్చోబెట్టి స్విచ్ ఆన్ చెయ్యరు. ఇంజక్షన్ ఇచ్చి చంపేస్తారు. ‘‘అవును.. ‘చంపేస్తారు’ అనే అనాలి’’ అని అమెరికాలోని మానవతావాదులు లీసాకు క్షమాభిక్ష తిరస్కరించిన ట్రంప్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఒక నిండు ప్రాణాన్ని తీసే హక్కు ట్రంప్‌కి ఎవరిచ్చారు?’’ అని వారు ప్రశ్నిస్తున్నారు. ‘‘అలాగైతే నిండు గర్భిణిని చంపడం అమానుషం కాదా..’’ అని ఆమెకు మరణశిక్షను విధించడాన్ని సమర్థించేవారు అంటున్నారు. లీసానే ఆ హత్య చేసినట్లు సాక్ష్యాధారాలు కూడా రుజువు చేశాయి. ఇక ఆమె గానీ, ఆమె లాయర్లు గానీ మాట్లాడేందుకేమీ లేదు. ఆమె మరణశిక్షపై జిల్లా జడ్జి రుడాల్ఫ్ మాస్ జనవరి చివరివరకు స్టే ఇచ్చినప్పటికీ పై కోర్టు ఆ స్టేను కొట్టివేసి ఆమె మరణానికి ‘డేట్’ ఇచ్చింది. జనవరి చివరి వరకు రుడాల్ఫ్ స్టే ఇవ్వడం వెనుక ఉద్దేశం స్పష్టమైనదే. జనవరి 20న జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఆమె మరణశిక్ష రద్దయ్యే అవకాశాలు ఉంటాయి. జో బైడెన్ మరణశిక్షకు వ్యతిరేకం. ఆ ఆశతోనే జస్టిస్ రుడాల్ఫ్ ఆమెకు కొన్నాళ్లు ఆయుషు అందించారు. ఇప్పుడా ఆశా పోయింది. లీసా మానసిక స్థితి బాగోలేనందున ఆ హత్య చేసిందనే వాదనా గట్టిగా నిలబడలేకపోయింది. ఇప్పుడిక మనం రెండు విషయాలను మాట్లాడుకోవాలి. హత్యోదంతం గురించి ఒకటి. లీసాకు మానసిక స్థితి బాగోలేకపోవడం అన్నది ఇంకొకటి. మొదటి దాన్ని సమర్థించడానికి రెండోదాన్ని చెప్పుకోవడం కాదు. ఒక స్త్రీ జీవితంలో జరగకూడదనిదే లీసా జీవితంలో జరిగింది. అది.. లీసా చేసిన హత్య కన్నా కూడా ఘోరమైనది! మూడేళ్ల వయసులో తన పక్కన పడుకుని ఉన్న ఎనిమిదేళ్ల తన ప్రియమైన అక్కపై (మారుతండ్రి కూతురు) ఆమె సంరక్షకుడు (బేబీ సిటర్) పలుమార్లు అత్యాచారం జరపడం చూసింది లీసా. అలా చాలాకాలం పాటు చూస్తూనే ఉంది. ఆ తర్వాత లీసానే తన పదకొండో ఏట నుంచి మారుతండ్రి అత్యాచారానికి గురవడం మొదలైంది. ఆ చిరుప్రాయపు లైంగిక హింస, తల్లి కూడా చూసీచూడనట్లు ఉండిపోవడం, మారు తండ్రి అతడి స్నేహితులను తనపైకి ఉసిగొల్పడం.. అవన్నీ ఆమె బాల్యాన్ని, యవ్వనాన్ని హరించాయి. ఆమె మతిస్థిమితం కూడా తప్పింది. కెవిన్ అనే అతన్ని పెళ్లి చేసుకుంది కానీ, ఆమెతో పాటు పెరిగి పెద్దదైన చిన్ననాటి భయానక మనోస్థితిని ఆమె దాంపత్య జీవితం ఏమాత్రం మార్చలేకపోయింది. కొన్నిసార్లు కెవిన్ కూడా ఆమె భయం చూసి విసుక్కునేవాడు. పాత జీవితాన్ని ఎందుకు మర్చిపోవు అని అడిగేవాడు. ఆమె దగ్గర సమాధానం లేదు. లైంగిక హింస, దాడి వల్ల లీసా బ్రెయిన్ కూడా దెబ్బతినిందని వైద్యులు గుర్తించారు కూడా. లీసా యు.ఎస్.లోని కన్సాస్‌లో పుట్టింది. ప్రస్తుతం ఆమె వయసు 52 ఏళ్లు. గర్భిణిని హత్య చేసేటప్పటికి 36 ఏళ్లు. ఆమె చంపింది బాబీ జో స్టిన్నెట్ అనే 23 ఏళ్ల నిండు గర్భిణిని. స్టిన్నెట్ ఉండేది మిస్సోరీలో. లీసా ఉండేది కన్సాస్‌లో. మరి ఈ హత్య ఎలా జరిగింది? 2004 డిసెంబర్ 16. స్టిన్నెట్ తన గదిలో రక్తపు మడుగులో పడి ఉండటాన్ని మొదట చూసింది స్టిన్నెట్ తల్లి బెక్కీ హర్పర్. స్టిన్నెట్ కడుపు కోసి, బిడ్డను అపహరించుకెళ్లారెవరో! బెక్కీ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇరవై నాలుగ్గంటల లోపే దోషి పట్టుబడింది. లీసా మాంట్‌గోమరీ! స్టిన్నెట్ మెయిల్స్‌ని తెరిచి చూసిన పోలీసులకు లీసాకు, స్టిన్నెట్కు మధ్య ఉన్న స్నేహం గురించి తెలిసింది. వాళ్లిద్దరి చాటింగ్‌ని బట్టి ఇద్దరికీ కుక్కపిల్లల్ని పెంచడంలో ఆసక్తి ఉందని, వాటి ఫుడ్ గురించి ప్రత్యక్షంగా మాట్లాడుకోడానికి డిసెంబర్ పదహారున లీసా మిస్సోరీ వెళ్లి ఆమెను కలిసినప్పుడు ఈ హత్య జరిగిందనీ నిర్థారణ అయింది. లీసా నేరం ఒప్పుకుంది కానీ, తెలిసీ ఆ నేరాన్ని చేయలేదంది. అయితే స్టిన్నెట్ కడుపులోని బిడ్డను అపహరించుకుని వెళ్లడాన్ని బట్టి చూస్తే మాత్రం ఉద్దేశపూర్వకంగానే ఆమె ఆ హత్య చేసినట్లు స్పష్టం అవుతోంది. బిడ్డను స్టిన్నెట్ భర్తకు అప్పగించి, అదే రోజు లీసాను అరెస్ట్ చేశారు. పద్నాలుగేళ్లుగా కేసు నడిచి మొన్నటికి తీర్పువచ్చింది. అమెరికాలో ప్రస్తుతం మరణశి„ý పడి ఖైదీలుగా ఉన్న 55 మంది మహిళల్లో లీసా ఒకరు. ఒకవేళ లీసాను జనవరి 12న ఉరి తీసినా.. మిగతా యాభై నాలుగు మందికి జో బైడెన్ మరణాన్ని తప్పిస్తారనే భావిస్తున్నారు. -
హత్య కేసులో ముగ్గురికి యావజ్జీవం
తూప్రాన్ : యువకుడిని హత్య చేసిన ముగ్గురు నిందితులకు సిద్దిపేట జిల్లా కోర్టు న్యాయమూర్తి బి.ప్రతిమ శుక్రవారం యావజ్జీవ కారాగార శిక్షతోపాటు రూ. 6 వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించినట్లు తూప్రాన్ ఎస్ఐ నాగార్జునగౌడ్ శుక్రవారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. 2015 మార్చి 24న కామారెడ్డి జిల్లా బిక్నూరు మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన తుడుం స్వామి, క్యాస్థి ప్రశాంత్, నెమలిగారి నవీన్ అనే ముగ్గురు వ్యక్తులు అదే గ్రామానికి చెందిన కిరణ్ అనే యువకుడిని కిడ్నాప్ చేశారు. అనంతరం ఆ కిరణ్‌ను తూప్రాన్‌లోని పెద్ద చెరువు వద్దకు తీసుకువచ్చి హత్య చేసి దాంట్లో పడవేశారు. అప్పట్లో ముగ్గురు నిందితులను గుర్తించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ క్రమంలో శుక్రవారం కేసుకు సంబంధించి ప్రభుత్వ న్యాయవాది కేసును వాదించగా న్యాయమూర్తి బి.ప్రతిమ యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.6వేల చొప్పున జరిమానా విధించినట్లు ఎస్ఐ తెలిపారు. -
‘సైతాన్ ఆవహించింది.. అందుకే హత్య చేశా’
న్యూయార్క్ : బ్రూక్లీన్‌కు చెందిన ఇద్దరు చిన్నారులను అతి కిరాతంగా పొడిచి.. ఓ చిన్నారి చావుకు కారణమైన కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష విధిస్తూ స్థానిక కోర్టు తీర్పు నిచ్చింది. చిన్నారులను కత్తితో విచక్షణా రహితంగా పొడవడాన్ని అత్యంత హేయమైన చర్యగా కోర్టు అభివర్ణించింది. నిందితుడు డేనియల్ సేయింట్ హాబర్ట్ మాట్లాడుతూ.. తనను సైతాను ఆవహించిందని, ఆ సమయంలో ఏం చేస్తున్నానో తెలియక చేశానని కోర్టు విచారణలో తెలిపాడు. వివరాల్లోకి వెళితే.. 2014 సంవత్సరంలో బ్రూక్లీన్‌కు చెందిన ప్రిన్స్ జోషువా అవిట్టో (6), మికైలా (7) ఇంటి సమీపంలోని ఆట స్థలంలో ఆడుకున్న తర్వాత ఇంటికి బయలు దేరారు. అదే ప్రాంతానికి చెందిన సెయింట్ హాబర్ట్ వారిని వెంబడించాడు. మెట్ల మీదుగా భవంతి పైఅంతస్థులో ఉన్న తమ ఇంటికి వెళుతుండగా.. లిఫ్టులో వెళితే బాగుంటుందని చెప్పి లోపలికి ఎక్కించాడు హాబర్ట్. లిఫ్టు లోపల మాట్లాడుకుంటున్న చిన్నారులను అల్లరి చేయవద్దని హాబర్ట్ వారించాడు. అయినా వాళ్లు వినకపోవడంతో వెంట తెచ్చుకున్న కత్తితో ప్రిన్స్‌ను 16 సార్లు పొడిచాడు. ఆ తర్వాత మికైలాను కూడా 12 సార్లు పొడిచాడు. పిల్లల అరుపులు విని చుట్టుపక్కల వారు అక్కడికి రావడంతో కత్తి అక్కడే పడేసి పరారయ్యాడు. కత్తిపోట్లతో రక్తమోడుతున్న చిన్నారులిద్దరినీ స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో ఉన్న ప్రిన్స్ ప్రాణాలతో పారాడుతూ తొమ్మిది రోజుల తర్వాత ప్రాణాలు విడిచాడు. మికైలా మాత్రం ప్రాణాలతో బయట పడింది. నాలుగు రోజుల తర్వాత నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కత్తి మీద ఉన్న రక్తపు మరకల్లోని డీఎన్ఏ సహాయంతో అతడే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని పోలీసులు నిర్ధారించారు. కోర్టు శిక్ష విధించిన అనంతరం ప్రిన్స్ తల్లిదండ్రులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. హాబర్ట్కు జీవితఖైదు విధించడంతో తమ కుమారుడి ఆత్మకు శాంతి కలుగుతుందన్నారు. -
చింటూ జీవితం ఓ గుణపాఠం
పదిహేనేళ్ల క్రితం మెరైన్ ఇంజినీరింగ్ చదువుకున్న వ్యక్తి జీవితం ఇప్పుడెలా ఉంటుందని అడిగితే విదేశీ కంపెనీల్లో ఉద్యోగం. గగనంలో విహారాలు.. ఆరంకెల జీతం. అని ఠక్కున చెప్పేస్తారు. అదే వ్యక్తి గొడవల్లోకి దిగి ఎవరి కోసమో జీవితం పణంగా పెడితే ఎలా ఉంటుందోనని అడిగితే చిత్తూరుకు చెందిన చింటూను చూపించే పరిస్థితి. హత్య కేసులో జీవిత ఖైదు పడ్డ చింటూ అలియాస్ చంద్రశేఖర్ జీవితం నేటి యువతకు తప్పకుండా ఓ పాఠం నేర్పుతోంది. విదేశీ ఓడల నుంచి జైలుగోడల వరకు.. చిత్తూరు అర్బన్: చిత్తూరుకు చెందిన చింటూ పదిహేనేళ్ల కిత్రమే మెరైన్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యావంతుడు. అప్పటికే షిప్‌యార్డులో ఉద్యోగం రావడంతో ఓడల్లో ఏటా 20కు పైగా దేశాలు తిరుగుతూ చేతినిండా డబ్బులు సంపాదిస్తున్నాడు. 2005లో సొంత మేనమామ కటారి మోహన్‌పై జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుని... చివరకు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు పై హత్యాయత్నానికి పాల్పడి జైలు పాలయ్యాడు. 2007లో సీకే బాబుపై జరిగిన మందుపాతర దాడి కేసులో రెండో నిందితుడిగా మారిన అత డు.. దాని తరువాత అరెస్టయి బెయిల్‌పై వచ్చి విద్యాసంస్థలు స్థాపించి, యువతకు ఉచిత శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ... సమాజంలో తనకు ప్రత్యేక గుర్తింపు కావాలనే క్రమంలో రక్త సంబంధీకులతో ఏర్పడ్డ గొడవలు.. అదే రక్తాన్ని కళ్లారా చూడటానికి సైతం వెనుకాడని స్థాయికి చేరుకున్నాయి. ఏ మామ కోసమైతే చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నాడో ...అదే మామను మట్టుపెట్టాడనే ఆరోపణలపై ఇంకా జైలు జీవితం గడుపతున్నాడు. నేటితరం మారాలి.. ‘రూలింగ్‌లో ఉన్నది మన పార్టీనే. నువ్వు నా వెనుక ఉండు చాలు. నీకేం కావాలో నేను చూసుకుంటా..’ అంటూ పలువురు నాయకులు జిల్లాలోని యువతను పెడదారి పట్టిస్తున్నారు. పొద్దున్నుంచి పొద్దుపోయే వరకు నిరుద్యోగ యువతను వెంట తిప్పుకుని చేతిలో రూ.500 నోటు, ఓ క్వార్టర్ బాటిల్ మందు పెడుతున్నారు. ‘ రేయ్ నువ్వు అన్న దగ్గరకు వచ్చేయ్, అన్న బండిలో పోతుంటే మనం వెనుక స్కూటర్లో ఫాలో అవ్వాలి. అన్న కారు దిగితే వెనకే బాడీగార్డుగా ఉండాలి. అన్న చెప్పిన వాడిని తన్నాలి. పోలీసోళ్లే అన్న కాడికి వచ్చి సలాం కొడతారు. మనల్ని ఏమీ చేయరు..’ అనే అధికార పార్టీ నాయకుల మాటలకు నేటితరం యువతలో చాలా మంది బలవుతున్నారు. చింటూ విషయంలో కూడా ఇదే జరిగింది. మాజీ మేయర్ అనురాధ, కటారి దంపతుల హత్య కేసులో చింటూ ఓ పావు మాత్రమే. ఇతన్ని రెచ్చగొట్టి.. పక్కకు తప్పుకున్న టీడీపీ నాయకులు ఎవరనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. తల్లితండ్రుల మాట వినకుండా.. రాజకీయ నాయకుల వద్ద గులాంగిరి చేసి తీరా కేసుల్లో ఇరుక్కున్న తరువాత ఏం జరుగుతుందో చింటూ పయనం నేటితరానికి ఓ గుణపాఠంగా మిగిలింది. చేసిన తప్పుల నుంచి తాత్కాలికంగా నేతలు కాపాడొచ్చు. కానీ అధికారంలోంచి తప్పుకున్న తరువాత నాయకుల వద్ద పనిచేసిన అనుచరులు ఏదో ఒక రోజు ఊచలు లెక్కించక తప్పదు. రాజకీయం అంటే ఫ్యాక్షనూ కాదు.. ఫ్యాషనూ కాదు నేటి యువతకు ప్రధానంగా చదువు అవసరం. యువత రాజకీయాల్లోకి కచ్చితంగా రావాల్సిందే. కానీ నాయకుల్ని నమ్ముకుని చట్టవ్యతిరేక పనులు చేయొద్దు. మిమ్మల్ని నిన్న గలీజు పనులకు వాడుకున్నవాడే రేపు నడిరోడ్డులో వదిలేస్తాడని గుర్తుపెట్టుకోండి. రాజకీయం అంటే ఫ్యాక్షన్ కాదు..ఫ్యాషనూ కాదు..తల్లితండ్రులు ఎన్ని కష్టాలుపడి మిమ్మల్ని చదివిస్తున్నారో మరచిపోవద్దు. – సుబ్బారావు, డీఎస్పీ, చిత్తూరు. -
కట్న పిశాచులకు జీవిత ఖైదు
-భార్యను చంపిన భర్తకు శిక్ష -సహకరించిన తల్లికి కూడా... విశాఖ లీగల్/అచ్యుతాపురం: అదనపు కట్నం కోసం కోడల్ని అతి కిరాతకంగా హత్య చేసిన అత్త, భర్తలకు యావజ్జీవ జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ నగరంలోని 12వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎ.సత్యానంద్ తీర్పు వెల్లడించారు. జరిమానా చెల్లించకపోతే మరో ఆరు నెలల సాధారణ జైలుశిక్ష అనుభవించాలని ఆ తీర్పులో వెల్లడించారు. జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.వేణుగోపాలరావు అందించిన వివరాల ప్రకారం.. నిందితులు ఎలమంచిలి రాంబాబు (35), గోవిందమ్మతో 2008లో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ.లక్షా 50 వేల కట్నం, తులంన్నర బంగారం, రూ.50వేల ఆడపడుచు లాంఛనాలు ఇచ్చారు. కొంతకాలానికి అదనపు కట్నం కావాలంటూ అత్త అప్పలనరసమ్మ, భర్త రాంబాబు నిత్యం గోవిందమ్మను శారీరకంగా, మానసికంగా వేధించేవారు. అన్నం కూడా పెట్టేవారు కాదు. కట్నం తేలేదన్న అక్కసుతో 2013 మార్చి 14వ తేదీన రాత్రి 9.30గంటల సమయంలో గోవిందమ్మ పై కిరోసిన్ పోసి నిప్పంటించారు. తీవ్రగాయాలతో బాధపడుతున్న గోవిందమ్మ నుంచి ఆ మరుసటి రోజు (మార్చి 15)న స్థానిక న్యాయమూర్తి వాంగ్మూలం తీసుకున్నారు. అనంతరం ఆమె చికిత్స పొందుతూ మార్చి 19న మృతి చెందింది. ఈ మేరకు నిందితులపై సెక్షన్ 498, 304బి, 302 సెక్షన్లతో అచ్యుతాపురం పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితుడిపై అప్పటి ఎస్పీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. నేరాభియోగ పత్రంలో పేర్కొన్న 13 మంది సాక్షులను విచారించిన న్యాయమూర్తి నిందితులపై నేరం రుజువు కావటంతో బుధవారం తీర్పునిచ్చారు. -
యావజ్జీవ తీర్పు..నేరస్తులకు కనువిప్పు
– జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ కర్నూలు: బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన మానవమృగం పఠాన్‌ఖాజాఖాన్‌కు జీవించినంతకాలం యావాజ్జీవ కారాగార జైలు శిక్ష విధిస్తూ కర్నూలు జిల్లా మొదటి అదనపు జడ్జీ ప్రేమావతి ఇచ్చిన తీర్పు నేరస్తులకు కనువిప్పులాంటిదని ఎస్పీ ఆకె రవికృష్ణ అన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేంద్రప్రసాద్, దర్యాప్తు అధికారి, కర్నూలు డీఎస్పీ రమణమూర్తితో కలిసి బుధవారం సాయంత్రం కమాండ్ కంట్రోల్ సెంటర్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. లైంగిక వేధింపులు, అత్యాచారాలకు పాల్పడే వారిపై పోక్షో (పీఓసీఎస్‌ఎస్‌ఓ) చట్టం బ్రహ్మస్త్రం లాంటిదన్నారు. బాలికలపై అత్యాచారానికి పాల్పడే వారికి ఈ తీర్పు గుణపాఠమన్నారు. కర్నూలు నగరం కడక్‌పుర వీధిలో ఉండే పఠాన్‌ఖాజాఖాన్ ఆటో డ్రై వర్గా పని చేస్తూ జీవనం సాగించే వాడని, 2015, జూలై 18వ తేదీన అదే కాలనీలో నివాసం ఉంటున్న మైనర్ బాలికను బలవంతంగా ఇంట్లోకి తీసుకెళ్లి బంధించి అత్యాచారం చేసినట్లు రుజువు కావడంతో జడ్జి సంచలన తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశపెట్టిన డీఎస్పీ రమణమూర్తిని అభినందించారు. అప్పటి ఒకటో పట్టణ సీఐ రామకృష్ణ, కోర్టు మానిటరింగ్ సిబ్బందిని కూడా ఎస్పీ అభినందించారు. కర్నూలు డీఎస్పీ రమణమూర్తి మాట్లాడుతూ.. మహిళా నేరాలకు పాల్పడిన మట్టి రవి, నాగేంద్ర, దేవ, కాశీం తదితరులపై కూడా కఠినమైన చట్టాలు ప్రయోగించి శిక్షలు పడేలా పోలీసు శాఖ కృషి చేసిందన్నారు. సీఐలు వీఆర్ కృష్ణయ్య, పీ.రామకృష్ణ తదితరులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.