Life saving drugs
-
ఆ మందులు ఇక చౌక
సాక్షి,న్యూఢిల్లీ: గుండె జబ్బులు, హెపటైటిస్ సీ, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల చికిత్సకు ఉపయోగించే మందుల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. జాతీయ ఫార్మాస్యూటికల్ ధరల అథారిటీ(ఎన్పీపీఏ) 51 మందుల ధరలను 53 శాతం వరకూ తగ్గిస్తూ తాజా మార్గదర్శకాలను వెలువరించింది. ఫార్మా కంపెనీలు తాజా పరిమితికి మించి తమ ఉత్పత్తులను విక్రయిస్తుంటే వెంటనే వాటిని తగ్గించాలని ఎన్పీపీఏ ఆదేశించింది.నూతన పరిమితుల నేపథ్యంలో ఆయా మందుల ధరలు 6 నుంచి 53 శాతం వరకూ దిగివస్తాయని ఎన్పీపీఏ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఔషధ ధరలకు సంబంధించిన నూతన పరిమితులు, గరిష్ట చిల్లర ధరల(ఎంఆర్పీ)పై ఎన్పీపీఏ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రాణాంతక వ్యాధుల చికిత్సకు వాడే ఔషధాలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో వీటి ధరలపై నియంత్రణ విధించినట్టు అధికారులు తెలిపారు. -
ప్రాణాధార ఔషధ దిగుమతులపై కొరడా!
కస్టమ్స్ సుంకం మినహాయింపుల ఉపసంహరణ న్యూఢిల్లీ: లైఫ్ సేవింగ్స్ డ్రగ్స్ (ప్రాణాధార ఔషధాలు) దిగుమతులపై కేంద్రం కస్టమ్స్ సుంకాల మినహాయింపుల్ని ఉపసంహరించుకుంది. ఈ ఔషధాలపై 16 నుంచి 20 శాతం వరకూ కస్టమ్స్ సుంకాలను విధించనున్నట్లు కూడా సమాచారం. ‘మేక్ ఇన్ ఇండియా’కార్యక్రమంలో భాగంగా దేశంలోనే కీలక ఔషధాల ఉత్పత్తి వృద్ధి లక్ష్యంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆరోగ్య మంత్రిత్వశాఖలోని ఫార్మా శాఖ అధికారులతో సంప్రదింపులు జరిపి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఇంతక్రితం ప్రభుత్వం వైద్య పరికరాలపై సుంకాలను 5 శాతం నుంచి 7.5 శాతానికి పెంచింది.