life-threatening
-
ఆ టీఆర్ఎస్ నేత నుంచి ప్రాణాహాని ఉంది
సనత్‌నగర్: అధికార టీఆర్ఎస్ పార్టీ సనత్‌నగర్ డివిజన్ అధ్యక్షుడితో పాటు ఆయన అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఎన్టీపీసీ రిటైర్డ్ ఉద్యోగి అబ్దుల్‌హమీద్ ఆరోపించారు. తన రెండో భార్యతో కలిసి తన ఆస్తిని కాజేయాలని వారు కుట్ర పన్నారన్నారు. ఆదివారం సనత్‌నగర్‌లోని తన నివాసంలో బాధితుడు అబ్దుల్ హమీద్ విలేకరులతో మాట్లాడారు. 1995లో తన మొదటి భార్య నూర్జహాన్‌బేగం చనిపోగా 2001లో వరంగల్‌కు చెందిన మహిళను రెండో వివాహం చేసుకున్నానని తెలిపారు. తన రెండో భార్యకు టీఆర్ఎస్ పార్టీ నుంచి కార్పొరేటర్ టికెట్ ఇప్పిస్తానంటూ ఆ పార్టీ నాయకుడు ఖలీల్‌బేగ్ ఆమెతో సాన్నిహిత సంబంధం పెట్టుకున్నాడని తెలిపారు. ఆ తర్వాత రూ. ఐదు కోట్ల విలువ చేసే తన ఇంటిని తన పేరుపై మార్చుకుని కాజేయాలని ఖలీల్‌బేగ్ ప్రయత్నం చేశాడన్నారు. దీంతో ఆయన తన రెండో భార్యతో కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలతో సహా, వారి మోసంపై సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశానని హమీద్ చెప్పారు. ఆ తరువాత ఏప్రిల్ 29, 2015న రెండో భార్యతో విడాకులు తీసుకున్నానని తెలిపారు. అప్పటి నుంచి ఎక్కడ ఆస్తి చేజారిపోతుందోననే ఉద్దేశంతో ఖలీల్‌బేగ్ తనను చంపేస్తానని అల్లావుద్దీన్‌కోఠికి చెందిన ఖాజా, డీఎన్‌ఎంకాలనీకి చెందిన సాబేర్‌లతో కలిసి బెదిరిస్తున్నాడని తెలిపారు. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని హమీద్ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు టీఆర్ఎస్ పార్టీలో పెద్దల నుంచి ఒత్తిళ్లు రావడంతో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని, అందుకే తాను మీడియా ద్వారా న్యాయం చేయాలని కోరుతున్నానని బాధితుడు తెలిపారు. కాగా ఖలీల్‌బేగ్, అబ్దుల్ హమీద్ రెండో భార్య (ప్రస్తుతం విడాకులు తీసుకున్నారు) సాన్నిహిత్యంగా ఉన్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఆదివారం హల్చల్ చేయడం గమనార్హం. -
నాకు ప్రాణహాని ఉంది..
* వైఎస్సార్ సీపీ బీసీ విభాగం * రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గురవాచారి పిడుగురాళ్ళ : తనకు ప్రాణ హాని ఉందని.. దానికి కారణం ఎమ్మెల్యే యరపతినేని అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీ ప్రధాన కార్యదర్శి కుందుర్తి గురవాచారి తెలిపారు. పట్టణంలోని జానపాడు రోడ్డు నుంచి ఇంటికి వెళుతుంటే ఎవరో ఇద్దరు తనకు ద్విచక్రవాహనం అడ్డుపెట్టారని, వెంటనే అనుమానం వచ్చి పక్క నుంచి వెళ్లిపోతుంటే తనను వెంబడించి జానపాడు రోడ్డులోనే తీవ్రంగా కొట్టారని చెప్పారు. తాను ఎమ్మెల్యే యరపతినేనిపై అక్రమ మైనింగ్‌పై లోకాయుక్తకు ఫిర్యాదు చేశానని, అందుకే తనపై ఇటువంటి దాడులు జరుగుతున్నాయన్నారు. ఇటీవలే దాచేపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేయించారని ఆయన తెలిపారు. తిరిగి మళ్లీ ఈరోజు తననే కొట్టి తనపై పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని తెలిపారు. పిడుగురాళ్ల పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారని, పోలీస్‌స్టేషన్‌లో సోమవారం రాత్రి ఆయన తెలిపారు. ఈ విషయమై పట్టణ ఎస్ఐ జగదీష్‌ను ‘సాక్షి’ సోమవారం రాత్రి వివరణ కోరగా అనుపాలెం గ్రామానికి చెందిన దేవరశెట్టి బ్రహ్మం అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై జానపాడు రోడ్డుకు వెళుతుండగా నడుచుకుంటూ వెళుతున్న గురవాచారికి వాహనం తగిలింది. దీంతో గురవాచారి బ్రహ్మాన్ని తీవ్రంగా కొట్టి గాయపరిచారని, అదే విధంగా దుర్భాషలాడి కులం పేరుతో దూషించాడని పోలీస్‌స్టేషన్‌లో బ్రహ్మం ఫిర్యాదు చేయడంతో గురవాచారిని స్టేషన్‌కు తీసుకొచ్చినట్లు ఎస్ఐ చెప్పారు. -
తల్లిదండ్రుల నుంచే ప్రాణహాని
► రక్షణ కోరుతూ ‘సాక్షి’కి మొరపెట్టుకున్న యువతి ► కొత్తపేట మహిళమండలిలో ఆశ్రయం పొందుతున్న ► బాధితురాలు మాధవి సాక్షి, గుంటూరు : తన తల్లిదండ్రుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని తుళ్ళూరు మండలం దొండపాడు గ్రామానికి చెందిన కొలసాని మాధవి శుక్రవారం ‘సాక్షి’కి మొరపెట్టుకుంది. కొత్తపేట మహిళా మండలిలో ఆశ్రయం పొందుతున్న మాధవి కథనం ప్రకారం మైనర్‌గా ఉన్నపుడు 17 ఏళ్ల వయసులో మాధవికి ఇష్టం లేకుండా మేనమామ కొడుకుతో పెళ్లి చేశారు. పెళ్లి ఇష్టం లేక, ఇంటి నుంచి వెళ్లిపోయి చదువుకునేందుకు గుంటూరు వచ్చింది. ఈ విషయంలో తనకు సహకరించిన యువకుడి అమ్మా, నాన్న, అక్కా, బావలపై తన తల్లిదండ్రులు కిడ్నాప్ కేసు పెట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మైనార్టీ తీరడంతో మాధవి విడాకులు కోరుతూ కోర్టు ద్వారా నోటీసులు పంపింది. తన తల్లిదండ్రులకు తుళ్ళూరు, దొండపాడు గ్రామాల్లో 20 ఎకరాల పొలం ఉందని, దానికి తాను అడ్డుగా ఉన్నాననే చంపాలని చూస్తున్నారని మాధవి ఆరోపించింది. ఈ విషయమై ఈనెల 10వ తేదీన గుంటూరు వచ్చిన హోం మంత్రి చినరాజప్పను కలిసి ఫిర్యాదు చేయడంతో, ఆయన రూరల్ ఎస్పీ వద్దకు పంపారని, ఆయన తుళ్లూరు పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి తల్లిదండ్రుల వద్దకు వెళ్లాలంటూ ఒత్తిడి చేశారని మాధవి వాపోయింది. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని మాధవి వేడుకుంటోంది. -
ప్రియుడి నుంచి ప్రాణహాని
కాకినాడ రూరల్ : ప్రేమ, పెళ్లి పేరుతో శీలం సురేష్ తనను మోసం చేయడమే కాకుండా హత్యచేసేందుకు యత్నిస్తున్నాడని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవవడం లేదని కాకినాడ ఏటిమొగకు చెందిన యువతి ఓలేటి శివగాయత్రి ఆదివారం విలేకరుల వద్ద విలపించారు. తనకు అండగా ఉన్న టీడీపీ నాయకురాలిపైనా సురేష్ వర్గం వారు దాడి చేసి బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. శివగాయత్రి, టీడీపీ నాయకురాలు రాయవరపు సత్యభామ కథనం ప్రకారం.. శివగాయత్రి, శీలం సురేష్ ఇద్దరూ ఓకే సామాజిక వర్గం వారు. వీరు ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సురేష్‌కు దగ్గర బంధువు, ప్రముఖ మత్స్యకార నాయకుడు వేరే అమ్మాయితో సురేష్ పెళ్లి చేయడానికి యత్నించారు. మాయ మాటలతో అప్పటికే గర్భిణి అయిన శివగాయత్రికి అబార్షన్ చేయించి అడ్డు తప్పించే యత్నం చేయడంతో శివగాయత్రి 2013 మార్చి 6న నిర్భయచట్టం కేసుపెట్టారు. పోలీసులు సురేష్‌ను అరెస్టు చేసి జైలుకు పంపారు. అనంతరం సురేష్ బయటకు వచ్చి శివగాయత్రిని మాయమాటలతో నమ్మించాడు. మళ్లీ ఇటీవల వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధమై శివగాయత్రిని చంపేస్తానని, కేసు ఉపసంహరించుకోవాలని బెదిరించాడు. అదే సమయంలో రాయవరపు సత్యభామపైనా దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆమె వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో కేసుపెట్టింది. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే సోదరునికి వివరించామని, శివగాయత్రికి న్యాయం చేయాలని కోరామని సత్యభామ తెలిపారు. శివగాయత్రికి న్యాయం జరుగుతుందని హామీ రావడంతో తాను పెట్టిన కేసును ఉపసంహరించుకున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా శుక్రవారం ఉదయం 8గంటల సమయంలో సురేష్ శివగాయత్రిని కొట్టి, పీకనొక్కి చంపేందుకు యత్నించాడని, ఆమెను అతి కష్టం మీద కాకినాడ జీజీహెచ్‌కు 108లో తరలించామని సత్యభామ తెలిపారు. దీనిపై వన్టౌన్చ పోర్టు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేసినా చర్యల్లేవని విమర్శించారు. ఆస్పత్రిలోనూ మెడికో లీగల్ కేసు నమోదు చేయలేదన్నారు. తనను కూడా చంపేస్తానంటూ సురేష్, అతని బంధువులు బెదిరిస్తున్నారని సత్యభామ వివరించారు. మోసం చేసిన వ్యక్తులకు పోలీసులు కొమ్ముకాస్తున్నారని ఆమె విమర్శించారు. న్యాయం కోసం శివగాయత్రి నిరహారదీక్షకు కుర్చుంటుందని ఆమె పేర్కొన్నారు. శివగాయత్రికి న్యాయం జరిగే వరకు తాను ఆమెకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని జిల్లా పోలీసుల దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు సత్యభామ, శివగాయత్రి తెలిపారు. -
ఆపరేషన్ కొల్లం
సాక్షి ప్రతినిధి, కడప: కొల్లం గంగిరెడ్డి ఇంతకాలం హాట్ టాఫిక్. కొల్లం బ్రహ్మనందరెడ్డి ఇప్పుడు సరికొత్త టార్గెట్. డీసీసీబీ రుణాలు మంజూరులో అవకతవకలంటూ కేసు నమోదు, ఆ వెనువెంటనే డీఐజీ స్థాయి అధికారి విచారణ.. ఆగమేఘాలపై ఒకదాని వెంట ఒకటి చోటుచేసుకుంటున్నాయి. జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకూ పరుగులు పెట్టడం చూస్తే ఆపరేషన్ ‘కొల్లం’ ధ్యేయంగా ప్రభుత్వం నడుచుకుంటుందా.. అంటే అవుననే విశ్లేషకులు పేర్కొంటున్నారు. కొల్లం కుటుంబమే లక్ష్యంగా ప్రభుత్వం పావులు కదుపుతున్నట్లు భావిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టక మునుపే కొల్లం గంగిరెడ్డి వల్ల ప్రాణహాని ఉందని ప్రకటించారు. అప్పట్లో ఆ ప్రకటన సంచలనం రేపింది. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబోయే నాయకుడి ప్రకటనతో రాష్ట్ర యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. ఆ వెనువెంటనే ఒకదాని వెంట ఒకటి విచారణ,, ఆపై కేసులు నమోదు అవుతూ వచ్చాయి. చట్టానికి ఎవరూ అతీతులు కారు. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఏకకాలంలో ఒకే అంశంపై తీవ్రస్థాయిలో ఒత్తిడిగా వ్యవహరించడాన్ని రాజకీయ కక్షగా పలువురు వర్ణిస్తున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం మరుక్షణం నుంచి కొల్లం గంగిరెడ్డి లక్ష్యంగా విచారణ తీవ్రతరం అయినట్లు పలువురి భావన. సరికొత్త టార్గెట్ బ్రహ్మానందరెడ్డి.... రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ముందే పసిగట్టిన కొల్లం గంగిరెడ్డి విదేశాలకు పరారి అయ్యాడు. దీంతో ఆయన సోదరుడు కొల్లం బ్రహ్మానందరెడ్డి లక్ష్యంగా ప్రభుత్వ ప్రస్తుత చర్యలు ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ముందుగా పుల్లంపేట మండలంలోని అనంతయ్యగారిపల్లె, అనంతంపల్లె, అనంతసముద్రం సహకార సంఘాల్లో విచారణ చేపట్టారు. అనంతసముద్రంలో పట్టాదార్ పాసుపుస్తకాలు లేకుండా రుణాలు ఇచ్చారనే కారణంగా అప్పటి డీసీసీబీ చైర్మన్ కొల్లం బ్రహ్మానందరెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. వాస్తవానికి విచారణ అనంతరం చర్యలను నాలుగు వారాలకు వాయిదా వేయాలని, ఎలాంటి క్రిమినల్ చర్యలు చేపట్టరాదని హైకోర్టు ఉత్తర్వులు వెల్లడించినట్లు సమాచారం. అయినప్పటికీ కొల్లం బ్రహ్మానందరెడ్డిపై కడప ఒన్టౌన్లో కేసు నమోదైంది. సహకార శాఖ రాష్ట్ర కమిషనర్ నుంచి ఉన్న తీవ్రమైన ఒత్తిడే ఇందుకు కారణమని తెలుస్తోంది. ముఖ్యమంత్రిని కలిసేలోపు కేసు నమోదు చేయాలంటూ ఆదేశించడంతో ఆగమేఘాలపై ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేరు వెల్లడించేందుకు ఇష్టపడని జిల్లా స్థాయి అధికారి ఒకరు ధ్రువీకరించారు. ఆ వెనువెంటనే ఏకంగా సీబీసీఐడీ డీఐజీ రమణకుమార్ విచారణ కోసం రంగంలోకి దిగారు. కొల్లం గంగిరెడ్డిపై ఉన్న వ్యక్తిగత కక్షను కొల్లం బ్రహ్మానందరెడ్డి వైపు మళ్లించినట్లు విశ్లేషకులు అనుమానిస్తున్నారు. కమిషనర్ ఆదేశాల మేరకే.... కొల్లం బ్రహ్మనందరెడ్డి సహకార సంఘం అధ్యక్షుడుగా ఉన్న అనంతసముద్రం సొసైటీలో విచారణపై నాలుగు వారాలు స్టేటస్కో ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. అలాగే ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోరాదని వివరిస్తూ ఆదేశాలు అందాయి. అయినప్పటికీ క్రిమినల్ కేసు నమోదు వెనుక రాష్ట్ర కమిషనర్ ఆదేశాలే కారణమని స్పష్టం అవుతోంది. కేసు నమోదు నేపధ్యంలో సీబీసీఐడి రంగ ప్రవేశం చేసి విచారణ చేబడుతున్నట్లు సమాచారం. కమిషనర్ ఆదేశాల మేరకే కేసు నమోదు చేశామని డీసీఓ చంద్రశేఖర్ సాక్షి ప్రతినిధికి ధ్రువీకరించారు. పట్టాదార్ పాసుపుస్తకం లేకుండా రుణాలు ఇచ్చారంటే అందుకు అధికారులు కూడా బాధ్యులే. వారి ప్రమేయం లేకుండా రుణాలు ఇచ్చే అవకాశమే లేదు. ఇవేవీ పట్టించుకోకుండా ఏకంగా అధ్యక్షుడిని మాత్రమే టార్గెట్ చేయడం వెనుక రాజకీయ కక్షే ప్రధాన కారణమని తెలుస్తోంది.