Lingaa movie
-
Rajinikanth- KS Ravikumar: 'ఆ సినిమా డిజాస్టర్‌కు రజనీనే కారణం'
రజినీకాంత్, దర్శకుడు కేఎస్ రవికుమార్ కాంబినేషన్ అంటే సక్సెస్‌కు చిరునామా అనే పేరు ఉండేది. వీరి కాంబినేషన్లో ముత్తు, పడయప్ప సెన్సేషనల్ హిట్ చిత్రాలుగా రూపొందాయి. అలాంటిది 2014లో వీరి కాంబినేషన్లో వచ్చిన లింగ చిత్రం నిరాశపరచింది. ఆ తరువాత వీరి కాంబినేషన్లో ఇప్పటి వరకు చిత్రం రాలేదు. ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. కానీ లింగ చిత్రం డిజాస్టర్‌గా నిలవడంతో రజినీకాంత్ అభిమానులు దర్శకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన సరిగా తెరకెక్కించలేదంటూ విమర్శలు గుప్పించారు. వాటిపై దర్శకుడు అప్పట్లో స్పందించలేదు. అలాంటిది సుమారు 8 ఏళ్ల తరువాత స్పందిస్తూ.. లింగ చిత్ర పరాజయానికి రజినీకాంత్ కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈయన ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంటూ లింగ చిత్రంలో క్లైమాక్స్ లో వచ్చే బెలూన్ ఫైట్‌ను తాము ముందుగా అనుకోలేదన్నారు. ఒకసారి హైదరాబాదులో షూటింగ్ జరుగుతుండగా రజినీ అప్పటి వరకు చిత్రీకరించిన సన్నివేశాలను చూడాలని కోరారన్నారు. దీంతో ఆయనకు చూపించగా చిత్రంలో తాను కోరుకున్న సన్నివేశాలను పొందుపరచాలని ఆయన కోరారన్నారు. అయితే ఆయన చెప్పిన సూచనలు తన సహాయ దర్శకులకు కూడా నచ్చలేదన్నారు. అయినా లింగ చిత్రాన్ని రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాల్సిన పరిస్థితి నెలకొనడంతో తగిన సమయం లేకపోవడంతో ఆయన చెప్పినట్టుగానే చిత్రాన్ని హడావుడిగా పూర్తి చేసినట్లు తెలిపారు. ఆ విధంగా లింగ చిత్రం ప్లాప్‌కు రజినీకాంత్ కారణమని కేఎస్ రవికుమార్ పేర్కొన్నారు. -
కోర్టుకు రజనీ గైర్హాజరు
చెన్నై: లింగా చిత్ర వ్యవహారంలో కోర్టు విచారణకు మంగళవారం దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌స్టార్ రజనీ కాంత్ గైర్హాజరయ్యారు. ఆయన గైర్హాజరుపై న్యాయవాదులు వివరణ ఇచ్చుకున్నారు. రజనీకాంత్ నటించిన లింగా చిత్రం బాక్సాఫీసులో బోల్తాపడడంతో వ్యవహారం కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. అలాగే ఆ చిత్ర కథ వ్యవహారంపై మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనంలో విచారణ జరుగుతూ వస్తుంది. ఈ విచారణ నిమిత్తం స్వయంగా కోర్టుకు రావాలని రజనీకాంత్, చిత్ర నిర్మాతకు, దర్శకులకు సమన్లు జారీ అయ్యాయి. మంగళవారం రజనీకాంత్‌తోపాటు ముగ్గురు గైర్హాజరయ్యారు. అయితే రజనీ తరపు న్యాయవాది హాజ రై గైర్హాజరుకు అయిన కారణాలను కోర్టుకు వివరించారు. -
రజనీకాంత్‌కు డిస్ట్రిబ్యూటర్ల అభినందనలు
చెన్నై: లింగా చిత్ర నష్టపరిహారం వ్యవహారంలో రూ. 10 కోట్లు తిరిగి చెల్లించడానికి సహకరించిన ఆ చిత్ర కథా నాయకుడు రజనీకాంత్‌కు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కృతజ్ఞతలతో కూడిన అభినందనలు తెలిపారు. లింగా చిత్రం తీవ్ర నష్టాన్ని కలిగించిందంటూ ఆ చిత్ర డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు నెత్తి నోరు బాదుకుంటూ ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. రూ.33 కోట్ల నష్టానికి పది శాతం అంటే మూడు కోట్లు పరిహారం చెల్లిస్తానన్న లింగా చిత్ర నిర్మాత రాక్‌లైన్ వెంకటేశ్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు థాను దక్షిణ భారతచలన చిత్ర నటీనటుల సంఘం అధ్యక్షుడు శరత్‌కుమార్, రజనీకాంత్ సుదీర్ఘ చర్చలు జరిపి చివరికి రూ.10 కోట్లు నష్టపరిహారం చెల్లించే విధంగా తీర్మానం చేశారు. ఇందుకు కృషి చేసిన రజనీకాంత్‌కు, కలైపులి ఎస్.థానుకు, శరత్‌కుమార్‌కు డిస్ట్రిబ్యూటర్లు అభినందనలు తెలిపారు. -
లింగా ఫజిల్
లింగా చిత్రం చూడండి. దాని నిర్మాణ వ్యయం గణాంకాలతో చెప్పండి. బహుమతి పట్టండి. ఏమిటి అర్థం కాలేదా? లింగా చిత్ర డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు పాత్రికేయ మిత్రులకు ఇచ్చిన ఫజిల్. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం లింగా. గత ఏడాది డిసెంబర్ 12న తెరపైకి వచ్చిన ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని పొందలేదు. బయ్యర్లు, థియేటర్ల యా జమాన్యం తీవ్ర నష్టాలకు గురయినట్లు ఆందోళనలు చేస్తున్నారు. నష్టపరిహారం చెల్లించాలంటూ నిరాహార దీక్షలు చేశారు. కోర్టులను కూడా ఆశ్రయించారు. లింగా చిత్రం వసూళ్లు, బయ్యర్లు థియేటర్ల యాజమాన్యానికి ఏర్పడే నష్టం ఏపాటిది? అన్న విషయాలపై చిత్ర హీరో రజనీకాంత్ తన కు బాగా నమ్మకస్తుడైన డిస్ట్రిబ్యూటర్ తో విచారణ జరిపించారు. ఆ వివరాలను చిత్ర నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ కు పంపారు. ఆయన బయ్యర్లుకు, థి యేటర్ల యాజమాన్యం శుక్రవారం చెన్నైలో ఒక ప్రకటనవిడుదల చేస్తూ అందులో పాత్రికేయులకు ఒక ఫ జిల్‌ను పేర్కొన్నారు. అదే లింగా చి త్రం చూడండి. దాని నిర్మాణ వ్యయ గణాంకాలను కచ్చితంగా చెప్పండి. బ హుమతి పొందండి అంటూ ప్రకటించారు. లింగా చిత్రం రజనీకాంత్ పారి తోషికంతో సహా రూ.45 కోట్ల బడ్జెట్‌తో రూపొందించి 157 కోట్లకు చి త్రాన్ని ఇరోస్ సంస్థకు విక్రయించిన రాక్‌లైన్ వెంకటేశ్ ఎంత లాభం పొం ది ఉంటారు. ఇందులో ర జనీకాంత్‌కు ఎంత పారితోషికం ఇచ్చి ఉంటారు అన్న విషయాలను కచ్చితంగా అంచనా వేసి చెప్పిన వారికి రూ.25 వేల బహుమతి అందించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. విలేకరుల కోసం లింగా చిత్రా న్ని శనివారం సాయంత్రం 3.30 గం టలకు స్థానిక వడపళనిలో గల ఆర్ కెవి స్టూడియోలో ప్రదర్శించనున్నట్లు తెలిపారు. కాగా లింగా నిర్మాత చెల్లిస్తానన్న 10 శాతం నష్టపరిహారం విష యం తమకు సమ్మతం కాదని, కాబట్టి ఈ విషయమై మళ్లీ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు డిస్ట్రిబ్యూటర్ల్లు పేర్కొన్నారు. -
రోడ్డెక్కిన బయ్యర్లు...
‘లింగ’ చిత్రం నష్టం వ్యవహారంలో కథా నాయకుడు రజనీకాంత్ జోక్యం చేసుకోవాలని బయ్యర్లు డిమాండ్ చేశారు. తమిళనాడులోని వివిధ ప్రాంతాలకు చెందిన బయ్యర్లు శనివారం చెన్నైలో ఒక రోజు నిరాహారదీక్ష చేశారు. ఈ చిత్రానికి నిర్మాతను, దర్శకుణ్ణి నిర్ణయించింది రజనీకాంతే కాబట్టి, ఆయన జోక్యం చేసుకోవాలని వారు కోరారు. -
రజనీకాంత్ జోక్యం చేసుకోవాలి
-
లింగాలో కాస్ట్లీ క్లెమ్యాక్స్