
రజనీకాంత్‌కు డిస్ట్రిబ్యూటర్ల అభినందనలు
చెన్నై: లింగా చిత్ర నష్టపరిహారం వ్యవహారంలో రూ. 10 కోట్లు తిరిగి చెల్లించడానికి సహకరించిన ఆ చిత్ర కథా నాయకుడు రజనీకాంత్‌కు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కృతజ్ఞతలతో కూడిన అభినందనలు తెలిపారు. లింగా చిత్రం తీవ్ర నష్టాన్ని కలిగించిందంటూ ఆ చిత్ర డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు నెత్తి నోరు బాదుకుంటూ ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. రూ.33 కోట్ల నష్టానికి పది శాతం అంటే మూడు కోట్లు పరిహారం చెల్లిస్తానన్న లింగా చిత్ర నిర్మాత రాక్‌లైన్ వెంకటేశ్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.
దీంతో తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు థాను దక్షిణ భారతచలన చిత్ర నటీనటుల సంఘం అధ్యక్షుడు శరత్‌కుమార్, రజనీకాంత్ సుదీర్ఘ చర్చలు జరిపి చివరికి రూ.10 కోట్లు నష్టపరిహారం చెల్లించే విధంగా తీర్మానం చేశారు. ఇందుకు కృషి చేసిన రజనీకాంత్‌కు, కలైపులి ఎస్.థానుకు, శరత్‌కుమార్‌కు డిస్ట్రిబ్యూటర్లు అభినందనలు తెలిపారు.