
కోర్టుకు రజనీ గైర్హాజరు
చెన్నై: లింగా చిత్ర వ్యవహారంలో కోర్టు విచారణకు మంగళవారం దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌స్టార్ రజనీ కాంత్ గైర్హాజరయ్యారు. ఆయన గైర్హాజరుపై న్యాయవాదులు వివరణ ఇచ్చుకున్నారు. రజనీకాంత్ నటించిన లింగా చిత్రం బాక్సాఫీసులో బోల్తాపడడంతో వ్యవహారం కోర్టుకెక్కిన విషయం తెలిసిందే.
అలాగే ఆ చిత్ర కథ వ్యవహారంపై మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనంలో విచారణ జరుగుతూ వస్తుంది. ఈ విచారణ నిమిత్తం స్వయంగా కోర్టుకు రావాలని రజనీకాంత్, చిత్ర నిర్మాతకు, దర్శకులకు సమన్లు జారీ అయ్యాయి. మంగళవారం రజనీకాంత్‌తోపాటు ముగ్గురు గైర్హాజరయ్యారు. అయితే రజనీ తరపు న్యాయవాది హాజ రై గైర్హాజరుకు అయిన కారణాలను కోర్టుకు వివరించారు.