lion death
-
జూపార్క్‌లో మగ సింహం మృతి
బహదూర్‌పురా: నెహ్రూ జూపార్కులో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మరో సింహం మృతి చెందింది. క్రేజీ అనే మగ సింహాం(15) మే 19 నుంచి అనారోగ్యానికి గురైంది. రక్తహీనత, తలకు గాయాలు, మూత్రంలో రక్తం వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న క్రేజీకి జూ పార్కు వైద్యసిబ్బంది చికిత్స అందజేస్తున్నారు. గత నెల 28న ఆరోగ్య పరిస్థితి విషమించడంతో పాటు వైద్యానికి స్పందించకపోవడంతో అదే రోజు సాయంత్రం ఆరు గంటలకు మృతి చెందింది. జూ కన్సల్టెంట్ డాక్టర్ నవీన్‌కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్లు డాక్టర్ దేవేందర్‌రావు, డాక్టర్ జీ.సునీత, డాక్టర్ సుహ్రుద, సీసీఎంబీ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ సాంబశివరావు, డాక్టర్ ఎం.ఏ.హకీం తదితరులు గత 29న పోస్టుమార్టం నిర్వహించారు. క్రేజీ శరీరం నుంచి మరిన్ని నమూనాలను సేకరించి వీబీఆర్ఐ ల్యాబ్‌కు తరలించినట్లు జూపార్కు క్యూరేటర్ శివానీ డోగ్రా తెలిపారు. -
ఏఆర్‌సీలో ఆడ సింహం మృతి
ఆరిలోవ (విశాఖ తూర్పు): జంతు పునరావాస కేంద్రం (ఏఆర్సీ)లో శుక్రవారం ఆడ సింహం అనారోగ్యంతో మృతి చెందింది. ఇక్కడ 16 సంవత్సరాల 3 నెలల వయసు గల ‘లత’ అనే ఆడ సింహం కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీని గర్భాశయం పాడయినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైందని జూ ఇన్చార్జి క్యూరేటర్ బి.జానకిరావు తెలిపారు. దీనిని 2002 జూన్ 12న కోల్‌కతాలో ఫేమస్ సర్కస్ నుంచి ఇక్కడ తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. జూలో బేబీ బైసన్ మృతి ఆరిలోవ(విశాఖతూర్పు): జూ పార్కులో వారం రోజుల క్రితం పుట్టిన బైసన్(అడవిదున్న) పిల్ల శుక్రవారం మృతి చెందింది. ఇక్కడ అనుష్క అనే బైసన్‌కు ఈ నెల 6న పిల్ల పుట్టింది. ఇది పుట్టిన నుంచి నీరసంగా ఉండటంతో పాటు తల్లి వద్ద పాలు సరిగా తాగేది కాదు. దీంతో నీరసించిపోయింది. ఇదిలా ఉండగా గురువారం రాత్రి ఇది మృతి చెందింది. తల్లి బైసన్ కాళ్లతో తొక్కేయడంతో ఈ పిల్ల మృతి చెందినట్లు ఇక్కడ వైద్యులు గుర్తించారు. దీని పొట్టపై తల్లి బైసన్ కాళ్లతో తొక్కేసిన పెద్ద గాయాలున్నట్లు గుర్తించామని వైద్యుడు శ్రీనివాస్ తెలిపారు. -
యంపా, బలరామ్లు అనారోగ్యంతో మృతి చెందాయి
తిరుపతి మంగళం: తిరుపతి శ్రీవెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల (ఎస్వీ జూపార్క్)లో శుక్రవారం యంపా (22) అనే ఆడసింహం, బలరామ్ (4) అనే తెల్లపులి పిల్ల అకాల మరణానికి కారణం అనారోగ్యమేనని జూపార్క్ క్యూరేటర్ వై.శ్రీనివాసులురెడ్డి తెలిపారు. గతంలో సర్కస్ల నుంచి ఎస్వీ జూకు 24 సింహాలను తీసుకొచ్చారని, వాటిలో యంపా ఒకటని, మరో 23 సింహాలు కూడా వయసుడిగి పోయాయని వివరించారు. అందులోనూ మిగిలిన 20 సింహాలు వయసుడిగి మృత్యువుకు దగ్గరగా ఉన్నాయన్నారు. అటవీ ప్రాంతంలో అయితే సింహాలు 16నుంచి 18సంవత్సరాలు మాత్రమే జీవిస్తాయని, ఎస్వీ జూలో సరైన సమయానికి పౌష్టికాహారం, వైద్యసేవలు అందిస్తుండడంతో మరో నాలుగు సంవత్సరాలు ఎక్కువగా జీవించగలిగాయని పేర్కొన్నారు. ఎస్వీ జూలోనే రణధీర్, హసీనా అనే తెల్లపులులకు జన్మించిన బలరామ్(4) అనే తెల్ల పులిపిల్ల కూడా అనారోగ్యంతో మృతి చెందిందని క్యూరేటర్ తెలిపారు. పది రోజులుగా బలరామ్ లంగ్ క్యాన్సర్‌తో బాధపడుతూ శుక్రవారం మృతి చెందిందన్నారు. జూలో జంతువుల పరిరక్షణకు డాక్టర్ అరుణ్ వైద్య పరీక్షలు చేస్తున్నారని తెలిపారు. అనంతరం జూలోనే సింహం, తెల్ల పులి పిల్లకు పోస్టుమార్టం నిర్వహించి, ఖననం చేశారు.