List of Universities
-
ఆసియా టాప్–50 వర్సిటీల్లో మూడు భారత్‌వే
న్యూఢిల్లీ: ఆసియాలోని అత్యుత్తమ 50 యూనివర్సిటీల జాబితాలో మూడు భారత విద్యాసంస్థలకు స్థానం దక్కింది. క్వాక్‌క్వాడ్రిల్లీ సైమండ్స్ (క్యూఎస్) సంస్థ విడుదల చేసిన ఈ జాబితాలో సింగపూర్‌కు చెందిన నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ మొదటి స్థానంలో (నిరుడు 3వ స్థానం) నిలవగా.. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ రెండో స్థానం (గతేడాది మొదటి స్థానం) దక్కించుకుంది.టాప్–10 జాబితాలో భారత యూనివర్సిటీలకు చోటు దక్కలేదు. ఐఐటీ–బాంబే 34వ స్థానంలో నిలవగా.. ఐఐటీ–ఢిల్లీ 41వ, ఐఐటీ–మద్రాస్ 48వ స్థానాలను దక్కించుకున్నాయి. టాప్ టెన్‌లో రెండు సింగపూర్ వర్సిటీలు, నాలుగు హాంకాంగ్ (హాంకాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ–3, యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్–5, సిటీ యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్–8, ద చైనీస్ యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్–10) వర్సిటీలు, ఒక దక్షిణ కొరియా వర్సిటీ (కొరియా అడ్వాన్స్డ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ–4), మూడు చైనా వర్సిటీలు (సింఘువా వర్సిటీ–6, ఫుడాన్ యూనివర్సిటీ–7, పెకింగ్ వర్సిటీ–9) చోటు దక్కించుకున్నాయి. టాప్–100 జాబితాలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు (51), ఐఐటీ కాన్పూర్ (59), ఢిల్లీ యూనివర్సిటీ (72), ఐఐటీ రూర్కీ (93), ఐఐటీ గువాహటి (98)లు ఉన్నాయి. ఆసియాలోని 400కు పైగా వర్సిటీలను పరిశీలించిన ఈ సంస్థ.. యూనివర్సిటీల్లో అధ్యాపకుల అర్హత (పీహెచ్డీ), దేశ, విదేశీ విద్యార్థుల సంఖ్య, అకడమిక్ ఫలితాలు, విద్యార్థులు–అధ్యాపకుల నిష్పత్తి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ర్యాకింగ్ నిర్ణయించింది. -
భారత్‌లో 10 ప్రపంచస్థాయి యూనివర్సిటీలు
టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ మ్యాగజైన్ టాప్ 100 ర్యాంకుల ప్రకటన లండన్: అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీల జాబితాలో భారత్‌లోని పది యూనివర్సిటీలకు చోటు లభించింది. జాబితాలో పంజాబ్ యూనివర్సిటీ 13వ స్థానంలో, ఐఐటీ ఖరగ్‌పూర్ (30), ఐఐటీ కాన్పూర్(34)వ స్థానాల్లో నిలవగా ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ రూర్కీలు సంయుక్తంగా 37వ స్థానంలో నిలిచాయి. ఐఐటీ గువాహటి 46, ఐఐటీ మద్రాస్, జాదవ్‌పూర్ యూనివర్సిటీలు 47, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ 50, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ 57 స్థానాలను దక్కించుకున్నాయి. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా (బ్రిక్స్), మరో 17 అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని ప్రపంచస్థాయి యూనివర్సిటీలపై తొలిసారి సర్వే చేసిన టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ మ్యాగజైన్ ఈ మేరకు ర్యాంకులను ప్రకటించింది. ఈ టాప్ 100 వర్సిటీల జాబితాలో చైనా అగ్రస్థానంలో నిలిచింది. చైనాలోని పెకింగ్, త్సింగ్వా యూనివర్సిటీలు మొదటి, రెండో స్థానంలో నిలవగా.. ఆ దేశంలోని 44 యూనివర్సిటీలు టాప్ 100లో చోటు దక్కించుకున్నాయి. బోధన, పరిశోధన, నాలెడ్జి ట్రాన్స్ఫర్, అంతర్జాతీయ దృక్పథం వంటి 13 అంశాల ఆధారంగా ర్యాంకులు కేటాయించారు. భారత్‌లో 20 యూనివర్సిటీలు మాత్రమే తమ సమాచారాన్ని అందజేయడంతో ఐఐఎంల వంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలను పరిశీలించలేదు. పాకిస్థాన్, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్‌లోని ఒక్క యూనివర్సిటీకి కూడా ఈ జాబితాలో చోటు దక్కలేదు.