List of web counseling
-
ప్రవేశాలు ఖరారు చేయొద్దు..
ఇంజనీరింగ్, ఫార్మసీ కౌన్సెలింగ్‌పై సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవరించిన హైకోర్టు లోపాలు సరిదిద్దుకోని కాలేజీలనూ కౌన్సెలింగ్ జాబితాలో చేర్చండి ప్రవేశాలు ఖరారు చేయొద్దు తుది తీర్పునకు లోబడి ఉంటాయని విద్యార్థులకు చెప్పండి ఇంజనీరింగ్, ఫార్మసీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఈ నెల 10 నుంచి ప్రారంభమయ్యే వెబ్ కౌన్సెలింగ్ జాబితాలో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన అన్ని కాలేజీలను చేర్చాలంటూ సింగిల్ జడ్జి గతవారం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం మంగళవారం సవరించింది. లోపాలను సరిదిద్దుకోలేదని చెబుతున్న 127 ఇంజనీరింగ్, 40 ఫార్మసీ కాలేజీలను సైతం ప్రాథమిక కౌన్సెలింగ్‌లో చేర్చాలని, అయితే వీటి విషయంలో సింగిల్ జడ్జి తిరిగి నిర్ణయం వెలువరించే వరకు ప్రవేశాలను మాత్రం ఖరారు చేయవద్దని హైదరాబాద్ జేఎన్టీయూ రిజిస్ట్రార్‌ను ధర్మాసనం ఆదేశించింది. హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభమయ్యే వెబ్ కౌన్సెలింగ్ జాబితాలో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన అన్ని కాలేజీలను చేర్చాలంటూ సింగిల్ జడ్జి గతవారం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన హైకోర్టు ధర్మాసనం మంగళవారం సవరించింది. లోపాలను సరిదిద్దుకోలేదని చెబుతున్న 127 ఇంజనీరింగ్, 40 ఫార్మసీ కాలేజీలను సైతం ప్రాథమిక కౌన్సెలింగ్‌లో చేర్చాలని, అయితే వీటి విషయంలో సింగిల్ జడ్జి తిరిగి నిర్ణయం వెలువరించే వరకు ప్రవేశాలను మాత్రం ఖరారు చేయవద్దని హైదరాబాద్ జేఎన్టీయూ రిజిస్ట్రార్‌ను ధర్మాసనం ఆదేశించింది. ఈ కాలేజీల్లో ప్రవేశాలన్నీ సింగిల్ జడ్జి ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటాయని కౌన్సెలింగ్ సమయంలోనే విద్యార్థులందరికీ తెలియచేయాలని స్పష్టం చేసింది. ఈ కాలేజీలకు రెండు రోజుల్లో నోటీసులు జారీ చేయాలని జేఎన్టీయూను ఆదేశించింది. కాలేజీల్లో కం ప్యూటర్లు, విద్యార్థులు, బోధనా సిబ్బంది సం ఖ్యతోపాటు విద్యార్థి, అధ్యాపకులు నిష్పత్తి తది తర అంశాలపై నిర్దిష్ట సమాచారాన్ని కోరుతూ నోటీసులు ఇవ్వాలని పేర్కొంది. కాలేజీలు దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం నుంచి తుది విచారణ చేపట్టి ఉత్తర్వులు జారీ చేయాలని సింగిల్ జడ్జికి స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు వెలువరించింది. అన్ని కాలేజీలను కౌన్సెలింగ్‌లో చేర్చాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులపై జేఎన్టీయూ అప్పీల్ దాఖలు చేయటం తెలిసిందే. -
బోధన సిబ్బంది ఉన్న కాలేజీలనే కౌన్సెలింగ్ జాబితాలో చేర్చండి
జేఎన్టీయూహెచ్కు హైకోర్టు ఆదేశం మిగిలిన లోపాలను నెలరోజుల్లో సవరించుకుంటామని హామీ ఇవ్వాలి ఆ తరువాత సమీక్షించి తగిన నిర్ణయం తీసుకోవాలి హైదరాబాద్: వెబ్ కౌన్సెలింగ్ జాబితా నుంచి తొలగించిన ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల విషయంలో జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(జేఎన్టీయూ) వాదనలవైపు హైకోర్టు మొగ్గు చూపింది. నిబంధనల మేరకు బోధన సిబ్బందిని నియమించుకున్న కాలేజీలను మాత్రమే వెబ్ కౌన్సెలింగ్ జాబితాలో చేరుస్తామంటూ జేఎన్టీయూహెచ్ తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) కె.రామకృష్ణారెడ్డి చేసిన వాదనలను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఆ వాదనల ప్రకారమే, ని బంధనలు నిర్దేశించిన మేరకు నిర్దిష్ట అర్హతలతో బోధనా సిబ్బం దిని కలిగి ఉన్న ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలను వెబ్ కౌన్సెలింగ్ జాబితాలో వెంటనే చేర్చాలంటూ హైకోర్టు సోమవారం జేఎన్‌టీయూహెచ్‌ని ఆదేశించింది. జేఎన్టీయూ చూపిన ఇతర లోపాలనూ ప్రవేశ ప్రక్రియ ముగిసే రోజు నుంచి నెల రోజు ల్లోపు సవరించుకుంటామని పిటిషనర్ కాలేజీలన్నీ కూడా హామీ ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది. లోపాలను సరిదిద్దుకుంటామంటూ దరఖాస్తు చేసుకున్న కాలేజీలు విఫలమైతే ఆ తరువాత నిర్ణయం తీసుకోవచ్చని జేఎన్టీయూకు స్పష్టం చేసింది. జేఎన్టీయూ తీరును తప్పుబట్టిన హైకోర్టు కాలేజీలను వెబ్ కౌన్సెలింగ్ జాబితా నుంచి తొలగించే వ్యవహారంలో జేఎన్టీయూ వ్యవహరించిన తీరును హైకోర్టు తప్పుపట్టింది. జేఎన్టీయూ స్వయంగా తాను రూపొందించిన నిబంధనలను తానే అమలు చేయలేదని ఆక్షేపించింది. తమ కాలేజీలను వెబ్ కౌన్సెలింగ్ జాబితా నుంచి తొలగించడంతో పాటు అఫిలియేషన్లను కూడా రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ దాదాపు 150కి పైగా ప్రైవేటు ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై సుదీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖరరెడ్డి సోమవారం తన నిర్ణయాన్ని వెలువరించారు. కాలేజీల లోపాలను గుర్తించినప్పుడు వాటిని సవరించుకునేందుకు వీలుగా 174 కాలేజీలకు ముందుగానే తెలియచేయాల్సి ఉండేదని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో అభిప్రాయపడ్డారు. నిబంధనలు నిర్దేశించిన మేరకు నిర్దిష్ట అర్హతలతో బోధన సిబ్బంది ఉన్న ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలను వెబ్ కౌన్సెలింగ్ జాబితాలో వెంటనే చేర్చాలని ఆయన జేఎన్టీయూ హైదరాబాద్‌ను ఆదేశించారు. అంతేగాక పలు కాలేజీల్లో సీట్ల సంఖ్య తగ్గింపు విషయంలో జేఎన్టీయూ ఏకపక్షంగా వ్యవహరించిందని జస్టిస్ రాజశేఖరరెడ్డి స్పష్టం చేశారు.