నయీం అనుచరులతో ప్రాణభయం
రక్షణ కల్పించాలని బాధితుల వేడుకోలు
ముకరంపుర : నరరూప రాక్షసుడైన నయీం అనుచరులతో తమకు ప్రాణభయం ఉందని బాధితులు తెలిపారు. కరీంనగర్‌లోని ప్రెస్‌భవన్‌లో బుధవారం నÄæూం బాధితులు గూడూరి వీరలక్ష్మికాంతరావు, ఆయన సోదరులు వీరకిషన్రావు, వీర రంగారావు, రియల్టర్ ఏవీ.రమేశ్‌కుమార్ విలేకరులతో మాట్లాడారు. జిల్లాకేంద్రం సమీపంలోని నగునూరు శివారులో 22.23 ఎకరాల భూమిని నÄæూం అనుచరులు ఆక్రమించుకున్నారని, ఇందులో నÄæూం ప్రత్యక్షంగా పాల్గొని ఆరు ప్లాట్లను తన సంబంధీకుల పేరున రిజిస్ట్రేషన్ చేయించాడని పేర్కొన్నారు. వారసత్వంగా వచ్చిన భూమిని నలుగురం అన్నదమ్ములం పంపకాలు చేసుకోగా.. పెద్దన్న వీరసాంబశివరావుకు వచ్చిన వాటాను తమకు విక్రయించారని, ఆ భూమిని కొనుగోలు చేసిన తాము రియల్టర్ రమేశ్‌కుమార్‌కు 2005లో అమ్ముకున్నామని, ఆయన శ్రీలక్ష్మినర్సింహాస్వామినగర్గా ప్లాట్లు చేసి విక్రయించుకున్నారని తెలిపారు. ప్లాట్ల విక్రయం తర్వాత పెద్దన్న తన కూతురు ద్వారా వాటా కోసం కోర్టును ఆశ్రయించారని, ఆ కేసును కోర్టు కొట్టివేసిందని, వీరసాంబశివరావు తోడల్లుడు, న్యాయవాది రమేశ్సాగర్రావు సొంత అల్లుడు విప్లవ్‌కుమార్ పేరిట జీపీఏ చేయించి అతడి ద్వారా మరో కేసు వేయించారని తెలిపారు. నయీం పేరు చెప్పి బెదిరింపులకు దిగారని, అతని అనుచరులు నగునూరుకు చెందిన నర్సింగోజు గోవర్దనాచారి అలియాస్ గోపి, మంథని ప్రాంతానికి చెందిన కొరవేణి రమేశ్ అలియాస్ రాంబాబు ద్వారా భూ ఆక్రమణకు పాల్పడ్డారని తెలిపారు. నయీం ఎన్కౌంటర్ తర్వాత ఆయన ఇంట్లో నగునూరు భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు లభించడంతో నయీం పర్యవేక్షణలోనే తమ భూమి ఆక్రమణకు గురైనట్లు తెలుసుకుని కరీంనగర్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. 14 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే గోపి, రమేశ్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపారని, మిగతా వారితో తమకు ప్రాణభయం ఉందన్నారు. వెంటనే వారందరినీ అరెస్ట్ చేసి తమకు రక్షణ కల్పించడంతో పాటు ఆక్రమణకు గురైన భూమిని తమకే చెందేలా చూడాలని కోరారు.