LLB course
-
లా కోర్సుల్లో 5,747 మందికి ప్రవేశం
సాక్షి, హైదరాబాద్: లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన తొలివిడత కౌన్సెలింగ్ ముగిసింది. ఎల్ఎల్బీ మూడేళ్ల కోర్సు, ఎల్ఎల్బీ ఐదేళ్ల కోర్సు, ఎల్ఎల్ఎం కోర్సుల్లో కన్వీనర్ కోటాలో 6,724 సీట్లు ఉన్నాయి. ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహించగా తొలివిడతలో 5,747 సీట్లు భర్తీ అయినట్లు టీఎస్‌సెట్ అడ్మిషన్స్–2022 కన్వీనర్ పి.రమేశ్‌బాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కౌన్సెలింగ్‌లో 12,301 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇవ్వగా.. అందులో 5,747 సీట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈనెల 28 నుంచి డిసెంబర్ 3వ తేదీలోపు నిర్దేశించిన కాలేజీల్లో రిపోర్టు చేయాలన్నారు. ఈ నెల 30 నుంచే సంబంధిత కోర్సులకు తరగతులు ప్రారంభం కానున్నట్లు వివరించారు. -
యంగ్ టాలెంట్ విభిన్న ఆకాశం
కాసేపు కేఫ్‌లో పాప్ మ్యూజిక్‌తో కచేరీ ఇస్తుంది. ఇంకాసేపు ఓ ప్రసిద్ధ బ్రాండ్ కోసం మోడలింగ్ చేస్తుంది. ఆ తర్వాత కిక్ బాక్సింగ్‌తో దడదడలాడిస్తుంది. థియేటర్ ఆర్టిస్టుగా వేదికపై అదరగొడుతుంది. గుర్రపు స్వారీలో గాలితో పోటీపడుతుంది. తాను కన్న కలలను కళాత్మకంగా మలచుకుని పంతొమ్మిదేళ్ల వయసులో విభిన్న రంగాల్లో రాణిస్తున్న సంజన ఆకాశం హైదరాబాద్‌లో ఎల్ఎల్బి చేస్తోంది. ఒకేరంగంలో ప్రతిభ చూపితేనే సరైన అవకాశాలు వస్తాయనుకునేవారి ఆలోచనలకు సంజన కళ్లెం వేస్తోంది. విభిన్నరంగాల్లో ప్రతిభను చూపుతూ తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకుంటున్న సంజన ఇన్ని కళలను ఎలా సుసాధ్యం చేసుకుంటున్నదో వివరించింది. ‘‘జీవితం ‘కళ’వంతంగా గడవాలంటే ఎక్కడా బోర్ అనిపించకూడదు. మెదడు చురుగ్గా ఉండాలంటే నచ్చిన వాటిని ఇష్టంగా ఎంచుకుంటూనే, నచ్చని వాటితోనూ పోటీ పడాలి. అప్పుడే విజయతీరాలను చేరుకోవచ్చు. నాలో నటి ఉందనే విషయం మూడేళ్ల క్రితం వరకు తెలియదు. ‘మూడేళ్ల క్రితం సమాహార థియేటర్ వర్క్‌షాప్ చూసినప్పుడు నేనూ వారితో కలిసి పని చేయాలనుకున్నాను. సమాహార థియేటర్ వర్క్‌షాప్‌లో పాల్గొని, నటన నేర్చుకున్నాను. ‘పంచ్లైడ్’ అనే బిహారీ హిందీ నాటకంలో చేశాను. ఛాలెంజింగ్‌గా అనిపించే అందులోని స్త్రీ పాత్ర నన్ను మరిన్ని నాటకరంగ పాత్రల్లో ఒదిగిపోయేలా చేసింది. అప్పటికప్పుడు లైవ్‌లో ప్రదర్శన ఉంటుంది. ఎంతో నేర్చుకోవచ్చు. ప్రజెంటేషన్, పంక్చువాలిటీ.. అన్నీ థియేటర్ నేర్పిస్తుంది. హుషారు నింపిన పాప్ అండ్ రాక్ ఆరవ తరగతి నుంచి పాప్ అండ్ రాక్ సాంగ్స్ పాడుతూ వచ్చాను. లండన్ ట్రినిటీ మ్యూజిక్ కాలేజీ టీమ్ మెంబర్స్‌తోనూ కలిసి వర్క్ చేశాను. ఇప్పుడు సొంత యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఆల్బమ్స్ విడుదల చేస్తున్నాను. లాక్డౌన్ ముందు వరకు రాక్ అండ్ పాప్ బ్యాండ్స్‌తో కలిసి షోలు చేసేదాన్ని. లాక్డౌన్ సమయం నా కళల సాధనకు మరింత ఉపయోగపడింది. ప్రొఫెషనల్ వీడియోలు చేయడం, ఆ¯Œ లై¯Œ లో పోస్ట్ చేయడం ద్వారా సోషల్‌మీడియా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నాను. భయం పోగొట్టిన ర్యాంప్‌వాక్ ‘వేదవస్త్రం’ అనే బ్రాండ్ ఫ్యాబ్రిక్‌కు మోడలింగ్ చేస్తున్నాను. అమ్మ ఫ్యాషన్ డిజైనర్. తను బొటిక్ నడుపుతుంది. తను డిజైన్ చేసిన డ్రెస్సులు అమ్మ నా మీద ప్రయోగించేది. అలా మోడలింగ్ వైపు వచ్చాను. ర్యాంప్‌వ్యాక్ బాగా ఇష్టం. మొదట్లో నలుగురిలోకి వెళ్లాలంటే కొంచెం బెరుకుగా ఉండేది. మోడలింగ్‌తో ఇప్పుడా భయం పోయింది. సాహసాల స్వారీ కళల నుండి అడ్వంచర్స్ వైపు దృష్టి మొదట్లో టీవీ ప్రోగ్రాముల్లో చూసినప్పుడు మళ్లింది. అమ్మానాన్న అనుమతితో హార్స్‌రైడింగ్ నేర్చుకున్నాను. అక్కడి ట్రెయినర్ మంచి లాయర్ కూడా. ఆమెలా నేనూ అడ్వకేట్‌గా రాణించాలనుకున్నాను. అందుకే, లా చదువుతున్నాను. అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్య అవసరమనుకున్నాను. అంతేకాదు, ఆత్మవిశ్వాసానికీ కిక్‌బాక్సింగ్ బాగా పనిచేస్తుంది. అందుకే, కిక్‌బాక్సింగ్‌లో శిక్షణ తీసుకున్నాను. నా వయసువారికి కిక్‌బాక్సింగ్‌లో శిక్షణ ఇస్తున్నాను. అటు కళలు .. ఇటు చదువూ థియేటర్ రిహార్సల్స్ ఉన్నప్పుడల్లా, బ్రేక్ టైమ్‌లో చదువుకోవడానికి స్కూల్ బుక్స్ తీసుకువెళ్లేదాన్ని. అలా ఇటు చదువు, అటు కళలను రెండింటినీ బ్యాలెన్స్ చేయగలిగాను. 14 ఏళ్ల వయసు నుంచి నా గొంతును కాపాడుకోవాలనే ధ్యాస పెరిగింది. దీంతో ఐస్‌క్రీమ్‌లు తినడం, కూల్ డ్రింక్స్ తాగడం మానేశాను. స్కూల్ చదువులో అంతగా రాణించేదాన్ని కాదు. కళలపై ఇంట్రస్ట్ చూపేదాన్ని. దీంతో మా నాన్న రఘునాథ్ నన్ను ఆ దిశగా ప్రోత్సహించారు. అమ్మ భార్గవి నాకు మేకప్ నేర్పించింది. మేకప్ క్లాసులకు కూడా తీసుకెళ్లేది. దీంతో సహనం అబ్బింది’ అని వివరించింది సంజన. మిగతావన్నీ ప్యాషన్. ‘లా’ నా ప్రొఫెషన్ అని వివరించిన సంజన ఇప్పుడు ఎంబీబిఎస్ రెండవ సంవత్సరం చదువుతోంది. చార్టర్డ్ అకౌంటెంట్ అయిన తండ్రి రఘునాథ్ ఆకాశం, తల్లి భార్గవి లు తాను కళల్లో రాణించడానికి ఎంతో సహకారం అందించారని తెలిపిన సంజన తాను పఠించే మంత్రాల గురించి తెలిపింది. మొదటిది చొరవ. రెండవది కఠోర శ్రమ. మూడవది స్థిరత్వం. నాల్గవది సహనం. ఎవరైనా సరే కోరుకున్నది సాధించాలనుకునే వారందరికీ ఇవి మంత్రాల్లా పనిచేస్తాయి. – నిర్మలారెడ్డి -
వృత్తి విద్యా కోర్సులకు ఏదీ గుర్తింపు!?
ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో నిర్వహించే వృత్తి విద్యా కోర్సులకు సంబంధిత అధీకృత యూనివర్సిటీల నుంచి గుర్తింపు తప్పనిసరిగా ఉండాలి. ఇందుకు విరుద్ధంగా ప్రభుత్వ కళాశాలలు కూడా గుర్తింపు లేకుండా కొన్ని కోర్సులను నిర్వహిస్తున్నారు. కోర్సులు నిర్వహిస్తున్నది ప్రభుత్వ కళాశాలలే కావడం వల్ల విద్యార్థులకు కూడా ఎటువంటి అనుమానాలు రావడం లేదు. వాస్తవానికి గుర్తింపు తీసుకు వచ్చేందుకు కూడా అధికారులు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపించడం లేదు. ఎచ్చెర్ల: వృత్తి విద్యా కోర్సులు నిర్వహించాలంటే సంబంధిత అధీకృత సంస్థల గుర్తింపు అవసరం. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో ఈ గుర్తింపులు ప్రస్తుతం కొన్ని కోర్సులకు సమస్యలుగా మారుతున్నాయి. కోర్సుల నిర్వహణ, విద్యార్థుల ప్రవేశాలపై ప్రభావం చూపుతోంది. అధీకృత సంస్థలు నిబంధనల ప్రకారం గుర్తింపు రావాలంటే ఆ మేరకు వసతులు, బోధకులు, ల్యాబ్స్, లైబ్రరీలు అవసరం. అప్పుడే కోర్సులు బలోపేతం అవుతాయి. మరో పక్క అధీకృత సంస్థల నుంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. ఎల్ఎల్బీ: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో ఎల్ఎల్బీ కోర్సుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు లేదు. అయితే ప్రభుత్వ సంస్థ కావడంలో కోర్సును కొనసాగిస్తున్నారు. వర్సిటీ ఏర్పడిన తరువాత బీసీఐ బృందం వచ్చినా ఇక్కడ అమలు చేస్తున్న నిబంధనలు నేపథ్యంలో గుర్తింపు ఇవ్వలేదు. 60 సీట్లు ఉన్న ఈ కోర్సు బలోపేతం చేయడంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టవ లసి ఉంది. ఎల్ఎల్బీ కోర్సును పక్కాగా నిర్వహిస్తేనే బీసీఐ గుర్తింపు ఇస్తుంది. ప్రత్యేక కళాశాల, తరగతి గదులు, మూట్ కోర్టు, గ్రంథాలయం, అర్హతగల బోధకులు ప్రిన్సిపాల్ ఇలా అనేక వసతులు ఉండాలి. వర్సిటీ ఏర్పడక ముందు నుంచి ఏయూ పీజీ సెంటర్‌గా ఉన్నప్పటి నుంచే బీసీఐ గుర్తింపు లేదు. ప్రస్తుతం ఈ గుర్తింపు కోసం వర్సిటీ అధికారులు దరఖాస్తు చేసుకున్నారు. నిబంధనల మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. బీసీఐ బృందం త్వరలో వర్సిటీకి రానుంది. ఈ సారి గుర్తింపు వస్తుందో? లేదో? వేచి చూడాల్సిందే... ఎంఎడ్: ఎంఎడ్ కోర్సుకు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ సంస్థ గుర్తింపు ఇవ్వాలి. ఈ కోర్సుకు గుర్తింపు ఉంది. పక్కాగా భవనాలు, బోధకులు, ప్రత్యేక గ్రంథాలయం ఉంది. బృందం సభ్యులు వచ్చినపుడు కామన్ లైబ్రరీ, ల్యాబ్స్ చూపిస్తున్నారు తప్ప, ఎన్సీటీఈ సంస్థ నిబంధనల మేరకు కోర్సు నిర్వహణకు డిజైన్ మాత్రం చేయడం లేదు. బీఎడ్ (మెంటల్లీ రిటార్డెడ్): ఈ కోర్సుకు గత ఏడాది మౌలిక వసతుల కొరత, అర్హులైన బోధకులు లేకపోవడం వల్ల రీహేబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అడ్మిషన్లు రద్దు చేసింది. 2009లో ప్రారంభమైన కోర్సును 2015లో నిర్వహించలేదు. ఇటీవల మళ్లీ ఈ కమిటీ సభ్యులు పరిశీలించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కొత్త భవనాలతో పాటు కొత్తగా అవసరమైన మానసిక శాస్త్రవేత్తలతో పాటు ఇతర పోస్టులను అవసరం మేరకు నియమించారు. గతంలో ఈ కోర్సును ముగ్గురు బోధకులతో నెట్టుకువచ్చేవారు. కోర్సు రద్దయిన నేపథ్యంలో బోధకునిగా కొన సాగుతున్న విశ్రాంత ఉద్యోగి డాక్టర్ యండ్ల రవికుమార్‌ను తొలగించారు. మరో ఇద్దరు సూ ర్యకళ, లలిత కుమారిలను మాత్రం కొనసాగించారు. ప్రస్తుతం ఈ కమిటీ సభ్యులు అనుమతి ఇస్తేనే ఈ ఏడాది రెండేళ్ల కోర్సు మళ్లీ పునర్‌ప్రారంభం అవుతుంది. మరో పక్క బీసీఐ, ఆర్సీఐ రెండూ ఢిల్లీకి చెందిన సంస్థలు కావడంతో పక్కాగా నిబంధనలు పరిశీలిస్తున్నారు. దక్షణాది సంస్థలు మాత్రం ప్రభుత్వ యూనివర్సిటీలు కావడంతో అంతగా అభ్యంతరాలు వ్యక్తం చేయడం లేదు. ప్రస్తుతం గుర్తుంపులకు ప్రధాన సమస్య రెగ్యులర్ బోధకులు లేక పోవడంగా నిష్ణాతులు చెబుతున్నారు. అర్హులైన బోధకులు కావాలంటే రెగ్యులర్ నియామకాలు కీలకం అన్నది చాలా మంది అభిప్రాయం. ఎల్ఎల్బీ కోర్సు గుర్తింపునకు కృషి ప్రస్తుతం ఎల్ఎల్బీ కోర్సుకు గుర్తింపు కోసం కృషిచేస్తున్నాం. బీసీఐ నిబంధనల మేరకు మౌలిక వసతు లు సమకూర్చడం, బోధకుల నియామకాన్ని అధికారులు చేపట్టారు. ప్రభుత్వ యూనివర్సిటీ కావడం వల్ల చదువుతున్న విద్యార్థులకు ఎటువంటి సమస్య ఉండదు. త్వర లో బీసీఐ బృందం పర్యవేక్షణ చేయనుంది. - డాక్టర్ కె.కృష్ణమూర్తి, సమన్వయకర్త, ఎల్ఎల్బీ కోర్సుల బలోపేతానికి గుర్తింపు అవసరం వర్సిటీలో నిర్వహిస్తున్న కోర్సులకు సంబంధిత అధీకృత సంస్థల నుంచి రావలసిన గుర్తింపుల కోసం కృషిచేస్తున్నాం. కోర్సులు బలోపేతం కావాలంటే గుర్తింపులు అవసరం. ప్రస్తుతం పక్కా భవనాలు నిర్మాణం జరుగుతోంది. భవిష్యత్తులో వసతి కొరత ఉండదు. మరో పక్క రెగ్యులర్ బోధకుల నియామకం జరిగితే శాశ్వితంగా అన్ని సమస్యలు తొలగిపోతాయి. - ప్రొఫెసర్ వడ్డాది కృష్ణమోహన్, రిజిస్ట్రార్ కోర్సు : గుర్తింపు ఇవ్వవలసిన సంస్థ ఎల్ఎల్బీ : బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎంఎడ్ : నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ బీఎడ్ : రీహేబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (మెంటల్లీ రిటార్డెడ్)