Lloyd Stevens
-
స్పెషల్ ట్రీట్
‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాలో తన సిక్స్ ప్యాక్ బాడీ చూపించి అభిమానులను ఉత్సాహపరిచారు ఎన్టీఆర్. హాలీవుడ్ ట్రైనర్ స్టీవెన్స్ లాయిడ్ శిక్షణతో ఈ శరీరాకృతిని సాధించారు. ఇవాళ ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అప్పట్లో సిక్స్ ప్యాక్‌తో చేసిన ఫోటోషూట్‌లో రిలీజ్ చేయని ఓ స్టిల్‌ను బర్త్ డే స్పెషల్‌గా షేర్ చేశారు స్టీవెన్ -
ఎన్టీఆర్ బర్త్‌డే: చిన్న సర్ప్రైజ్ ఉంది
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్ఆర్ఆర్) చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎన్టీఆర్ బర్త్‌డే (మే20) సందర్భంగా ఈ చిత్రం నుంచి టీజర్ లేదా ఫస్ట్ లుక్ విడుదలవుతుందని అందరూ ఆశించారు. అయితే అభిమానుల ఆశలను అడియాశలు చేస్తూ ఎలాంటి సర్ప్రైజ్ ఉండదని ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం తెలియజేసింది. దీంతో నిరుత్సాహంగా ఉన్న ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ ఫిట్నెస్ ట్రైనర్ స్టీవెన్స్ లాయిడ్ కాస్త ఊరట కలిగించే వార్త తెలిపాడు. ‘ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20. ఆయన అభిమానులందరికి నేను ప్రత్యేకంగా ఒకటి తయారు చేశాను. అప్పటి వరకు వేచి ఉండండి’ అంటూ స్టీవెన్స్ లాయిడ్ ట్వీట్ చేశాడు. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ నుంచి కాకపోయినా లాయిడ్ నుంచి ఏదో ఒక సర్ప్రైజ్ వస్తుండటంతో ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక గతంలో కూడా ఎన్టీఆర్ జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న వీడియోలను, ఫోటోలను స్టీవెన్ లాయిడ్ ఇన్‌స్టాలో షేర్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఒకరోజు ముందు నుంచే ఎన్టీఆర్‌కు సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సెలబ్రెటీలు బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. So tomorrow being @tarak9999 ‘s Birthday, I have something special lined up for all his fans today... stay tuned and watch this space!! 😉@smkoneru — Lloyd Stevens (@lloydstevenspt) May 19, 2020 చదవండి: తెరపై ‘గోదావరి’ : అందరి మనసుల్లో పదిలంగా అప్పుడు పెద్ద పండగలా ఉంటుంది View this post on Instagram #flashbackfriday with @jrntr 💪🏼💀🐅 #intensitymatters - You see ... it’s in that final set and those final reps a person shows you who they really are ☠️💥☠️ #mentalstrength - Here’s a sample of the daily intensity we applied during Jr NTRs workouts ... every workout we did was as intense and nothing was left behind, pure example of sheer determination, hard work, consistency and perseverance 💪🏼💀 #teamwork - #jrntr #ntr28 #tollywood #Telugu #fitnessinspiration #leadingbyexample #motivation #fit #transformation #menshealth #womenshealth #trainsmart #trainhard #nutrition #exercise #consistency #perserverance #noexcuses #beast #positivevibes #positiveenergy A post shared by Lloyd Stevens (@lloydstevenspt) on Feb 6, 2020 at 8:09pm PST -
రాజీ లేదు
యాక్టింగ్ విషయంలోనే కాదు వర్కౌట్స్ పరంగానూ రాజీ పడేలా లేరు ఎన్టీఆర్. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం ఫిట్‌గా ఉండడానికి జిమ్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్నారు. రామ్‌చరణ్ సరసన ఆలియా భట్ కథానాయికగా నటిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన హీరోయిన్ ఇంకా ఫైనలైజ్ కాలేదు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు 40 శాతం పూర్తయిందని సమాచారం. నెక్ట్స్ షెడ్యూల్ పుణే, అహ్మదాబాద్ ప్రాంతాల్లో ప్రారంభం కానుంది. ఈలోపు జిమ్‌లో తీవ్రమైన కసరత్తులు చేస్తున్నారు ఎన్టీఆర్. ఈ విషయాన్ని ఎన్టీఆర్ జిమ్ ట్రైనర్ స్టీవెన్ లాయిడ్స్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ‘అరవిందసమేత వీర రాఘవ’ సినిమా సమయంలోనూ ఎన్టీఆర్‌కి ట్రైనర్‌గా స్టీవెన్ వ్యవహరించిన విషయం గుర్తుండే ఉంటుంది. -
‘కొమరం భీం’ పాత్ర కోసం ఎన్టీఆర్!
బాహుబలి సినిమా తరువాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో భారీ చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు హీరోలుగా నటిస్తున్న ఈసినిమా పీరియాడిక్ జానర్లో తెరకెక్కుతోంది. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా కోసం హీరోలిద్దరు చమటోడుస్తున్నారు. ముఖ్యంగా కొమరం భీం పాత్రలో ధృడంగా కనిపించేందుకు ఎన్టీఆర్ మరోసారి లాయిడ్ స్టీవెన్స్ పర్యవేక్షణలో కసరత్తులు చేస్తున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోను లాయిడ్ తన ఇన్స్టాగ్రామ్ పేజ్‌లో షేర్ చేశాడు. ఎంతో త్యాగం చేశాక ఇది సాధించాం. అనే కామెంట్‌తో పాటు ఎన్టీఆర్ లెగ్ ఎక్సర్సైజ్లకు సంబంధించిన ఫోటోను షేర్ చేశాడు. ఫోటోతో పాటు కొమరం భీం, ఆర్ఆర్ఆర్ హ్యాష్ ట్యాగ్‌లతో ఎన్టీఆర్, రాజమౌళిలను ట్యాగ్ చేశాడు లాయిడ్. View this post on Instagram Giving it everything we’ve got 💪🏼💥 #KomaramBheem #RRR #wedontskiplegday @jrntr @ssrajamouli A post shared by Lloyd Stevens (@lloydstevenspt) on Jul 8, 2019 at 11:42pm PDT