బాహుబలి సినిమా తరువాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో భారీ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు హీరోలుగా నటిస్తున్న ఈసినిమా పీరియాడిక్ జానర్‌లో తెరకెక్కుతోంది. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా కోసం హీరోలిద్దరు చమటోడుస్తున్నారు.
ముఖ్యంగా కొమరం భీం పాత్రలో ధృడంగా కనిపించేందుకు ఎన్టీఆర్ మరోసారి లాయిడ్ స్టీవెన్స్ పర్యవేక్షణలో కసరత్తులు చేస్తున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోను లాయిడ్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో షేర్ చేశాడు. ఎంతో త్యాగం చేశాక ఇది సాధించాం. అనే కామెంట్‌తో పాటు ఎన్టీఆర్ లెగ్ ఎక్సర్‌సైజ్‌లకు సంబంధించిన ఫోటోను షేర్ చేశాడు. ఫోటోతో పాటు కొమరం భీం, ఆర్‌ఆర్‌ఆర్ హ్యాష్ ట్యాగ్‌లతో ఎన్టీఆర్, రాజమౌళిలను ట్యాగ్ చేశాడు లాయిడ్.
Comments
Please login to add a commentAdd a comment