యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్) చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎన్టీఆర్ బర్త్‌డే (మే20) సందర్భంగా ఈ చిత్రం నుంచి టీజర్ లేదా ఫస్ట్ లుక్ విడుదలవుతుందని అందరూ ఆశించారు. అయితే అభిమానుల ఆశలను అడియాశలు చేస్తూ ఎలాంటి సర్‌ప్రైజ్ ఉండదని ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర బృందం తెలియజేసింది. దీంతో నిరుత్సాహంగా ఉన్న ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ ఫిట్‌నెస్ ట్రైనర్ స్టీవెన్స్ లాయిడ్ కాస్త ఊరట కలిగించే వార్త తెలిపాడు.
‘ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20. ఆయన అభిమానులందరికి నేను ప్రత్యేకంగా ఒకటి తయారు చేశాను. అప్పటి వరకు వేచి ఉండండి’ అంటూ స్టీవెన్స్ లాయిడ్ ట్వీట్ చేశాడు. దీంతో ‘ఆర్‌ఆర్‌ఆర్’ నుంచి కాకపోయినా లాయిడ్ నుంచి ఏదో ఒక సర్‌ప్రైజ్ వస్తుండటంతో ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక గతంలో కూడా ఎన్టీఆర్ జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న వీడియోలను, ఫోటోలను స్టీవెన్ లాయిడ్ ఇన్‌స్టాలో షేర్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఒకరోజు ముందు నుంచే ఎన్టీఆర్‌కు సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సెలబ్రెటీలు బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు.
So tomorrow being @tarak9999 ‘s Birthday, I have something special lined up for all his fans today... stay tuned and watch this space!! 😉@smkoneru
— Lloyd Stevens (@lloydstevenspt) May 19, 2020
చదవండి:
తెరపై ‘గోదావరి’ : అందరి మనసుల్లో పదిలంగా
అప్పుడు పెద్ద పండగలా ఉంటుంది
Comments
Please login to add a commentAdd a comment