loan waive
-
ఉచితాలని ప్రజలను అవమానించొద్దు.. మోదీకి కేజ్రీవాల్ కౌంటర్
సాక్షి,న్యూఢిల్లీ: ఉచితాల నుంచి విముక్తి కల్పించాలని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై వివర్శలు గుప్పించారు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్. రాజకీయ నాయకులకు కూడా ఎన్నో ఉచితాలు అందుతున్నాయని గుర్తు చేశారు. కోటీశ్వరుల బ్యాంకు రుణాల మాటేమిటని ప్రశ్నించారు. పదే పదే ఉచితాలు రద్దు చేయాలంటు సామాన్యులను అవమానించవద్దని మండిపడ్డారు. ధరల పెరుగుదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉచిత విద్య, వైద్యం, ఔషధాలు ఇస్తే తప్పేంటని కేజ్రీవాల్ మోదీని ప్రశ్నించారు. ఈమేరకు ఆయన ఆదివారం హిందీలో ట్వీట్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని సాత్నాలో పీఎం ఆవాస్ యోజన కింద మంజూరైన ఇళ్ల గృహప్రవేశాలను శనివారం వర్చువల్‌గా ప్రారంభించారు మోదీ. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశానికి ఉచితాల నుంచి విముక్తి కల్పించాలన్నారు. ఎంతో మంది పన్నుచెల్లింపుదారులు తనకు ఈవిషయంపై చాలా లేఖలు పంపారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోనూ షేర్ చేస్తూ.. మోదీపై విమర్శలకు ఎక్కుపెట్టారు కేజ్రీవాల్. लोग महंगाई से बहुत ज़्यादा परेशान हैं। जनता को मुफ़्त शिक्षा, मुफ़्त इलाज, मुफ़्त दवाइयाँ, बिजली क्यों नहीं मिलनी चाहिए? नेताओं को भी तो इतनी फ्री सुविधायें मिलती हैं। कितने अमीरों के बैंकों के क़र्ज़े माफ़ कर दिये। बार बार मुफ़्त रेवड़ी बोलकर जनता का अपमान मत कीजिए https://t.co/oWMa5p9KjF — Arvind Kejriwal (@ArvindKejriwal) October 23, 2022 చదవండి: ‘ఉచితాల’ నుంచి దేశానికి విముక్తి కావాలి -
ఐసీఐసీఐకి కొచర్ రాజీనామా!!
న్యూఢిల్లీ: వీడియోకాన్ గ్రూప్‌నకు లంచం తీసుకుని రుణం మంజూరు చేశారన్న వివాదం ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచర్ పదవికి ఎసరు పెట్టింది. క్విడ్‌ప్రోకో ఆరోపణలపై విచారణ నేపథ్యంలో బ్యాంక్ ఎండీ, సీఈవో పదవులకు కొచర్ రాజీనామా చేశారు. 2019 మార్చి 31 దాకా ఆమె పదవీ కాలం ఉన్నప్పటికీ ముందుగానే వైదొలిగినట్లయింది. వీటితో పాటు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ సహా ఇతర అనుబంధ సంస్థల నుంచి కూడా ఆమె తప్పుకున్నారు. తాజా పరిణామాలతో కొత్త ఎండీ, సీఈవోగా ప్రస్తుత చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) సందీప్ బక్షి నియమితులయ్యారు. 2023 అక్టోబర్ 3 దాకా అయిదేళ్ల పాటు ఆయన ఈ హోదాల్లో కొనసాగుతారని ఐసీఐసీఐ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. చందా కొచర్‌పై బోర్డు మే నెలలో ఆదేశించిన విచారణ యథాప్రకారం కొనసాగుతుందని, దర్యాప్తు ఫలితాలు బట్టి బ్యాంకు నుంచి ఆమెకు అందాల్సిన ప్రయోజనాలు అందటమనేది ఆధారపడి ఉంటుందని పేర్కొంది. రుణ వివాదంపై సుప్రీం కోర్టు మాజీ జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ సారథ్యంలో బ్యాంకు బోర్డు విచారణ కమిటీ ఏర్పాటు చేసినప్పట్నుంచి చందా కొచర్ సెలవులో ఉన్నారు. మరోవైపు, స్వతంత్ర డైరెక్టర్ ఎండీ మాల్యా కూడా ఆరోగ్య కారణాల రీత్యా రాజీనామా చేసినట్లు బ్యాంక్ వెల్లడించింది. గురువారం బీఎస్ఈలో ఐసీఐసీఐ బ్యాంకు షేరు సుమారు 4 శాతం పెరిగి దాదాపు రూ. 316 వద్ద ముగిసింది రుణం తెచ్చిన తంటా.. వీడియోకాన్ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంక్ రూ.3,250 కోట్ల రుణాలివ్వడం వెనుక చందా కొచర్, ఆమె కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని, ఈ డీల్‌కు ప్రతిఫలంగా వారు భారీ లంచం తీసుకున్నారనే (క్విడ్‌ప్రోకో) ఆరోపణలున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రుణం పొందినందుకు ప్రతిగా.. చందా కొచర్ భర్త దీపక్ కొచర్‌కు చెందిన న్యూపవర్ రెన్యూవబుల్స్ సంస్థలో వీడియోకాన్ గ్రూప్ అధినేత వేణుగోపాల్ ధూత్ పెట్టుబడులు పెట్టారనేది ప్రధాన అభియోగం. అంతే కాకుండా ఎస్సార్ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు రవి రూయా అల్లుడు నిషాంత్ కనోడియాకు చెందిన మారిషస్ సంస్థ ఫస్ట్‌ల్యాండ్ హోల్డింగ్స్ నుంచీ న్యూపవర్‌లోకి పెట్టుబడులు వచ్చాయి. సరిగ్గా 2010లో ఎస్సార్ స్టీల్‌కు ఐసీఐసీఐ బ్యాంక్ సారథ్యంలోని కన్సార్షియం 530 మిలియన్ డాలర్ల రుణం ఇచ్చిన నెలలోనే.. న్యూపవర్‌లోకి ఫస్ట్‌ల్యాండ్ నుంచి పెట్టుబడులు రావడం అనుమానాలకు తావిచ్చింది. ఈ రుణాన్ని బ్యాంకు ఆ తర్వాత మొండిబాకీగా వర్గీకరించింది. బక్షి.. మూడు దశాబ్దాల బ్యాంకింగ్ అనుభవం.. ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త సీఈవోగా నియమితులైన సందీప్ బక్షి(58)కి బ్యాంకింగ్ రంగంలో సుమారు మూడు దశాబ్దాల పైగా అనుభవం ఉంది. గతంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవోగా వ్యవహరించారు. ఆరోపణలతో కొచర్ జూన్ నుంచి నిరవధిక సెలవుపై వెళ్లిన నేపథ్యంలో బ్యాంకు తొలుత ఆయన్ను అయిదేళ్ల పాటు హోల్‌టైమ్ డైరెక్టర్, సీవోవోగా నియమించింది. 1986 డిసెంబర్ 1న బక్షి ఐసీఐసీఐ గ్రూప్‌లోని ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్ విభాగంలో చేరారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి 2002 ఏప్రిల్‌లో ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎండీ, సీఈవోగా నియమితులయ్యారు. 2009 నుంచి 2010 దాకా ఐసీఐసీఐ బ్యాంక్ డిప్యుటీ ఎండీగా కూడా వ్యవహరించారు. 2010 ఆగస్టు 1న ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవోగా నియమితులయ్యారు. పద్మభూషణ్ నుంచి పతనం దాకా... పురుషాధిపత్యం ఉండే ఆర్థిక రంగంలో శక్తిమంతమైన మహిళగా ఎదిగిన చందా కొచర్... అంతలోనే అవమానకర రీతిలో ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ హోదా నుంచి నిష్క్ర మించాల్సి రావడం గమనార్హం. ప్రతిష్టాత్మక పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్న కొచర్ ప్రస్తుతం అవినీతి ఆరోపణలపై విచారణలను ఎదుర్కొంటున్నారు. 1984లో ఐసీఐసీఐ లిమిటెడ్‌లో మేనేజ్మెంట్ ట్రైనీగా చేరాక... చురుకైన పనితీరుతో గ్రూప్‌లో అంచెలంచెలుగా ఎదిగారు. ఇన్ఫ్రా రంగానికి రుణాలిచ్చే సంస్థ స్థాయి నుంచి 1990లలో ఐసీఐసీఐ కమర్షియల్ బ్యాంకుగా పరిణామం చెందడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. గ్రూప్ చైర్మన్ కేవీ కామత్ నిష్క్రమణ అనంతరం.. 2009లో ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈవో పదవిని దక్కించుకున్నారు. ఇది శిఖా శర్మ (యాక్సిస్ బ్యాంక్ చీఫ్) వంటి ఇతరత్రా సీనియర్ల నిష్క్రమణకు దారి తీసింది. చందా కొచర్ తన సారథ్యంలో బ్యాంక్‌ను పటిష్ట స్థానానికి చేర్చారు. ఐసీఐసీఐ బ్యాంక్, చందా కొచర్ పర్యాయపదాలుగా మారేంతగా ఆమె ప్రభావం చూపారు. వీడియోకాన్‌కు రుణాలపై ఆరోపణలు వచ్చిన తొలినాళ్లలో బ్యాంకు బోర్డు ఆమెకు పూర్తి మద్దతుగా నిల్చినా .. ఆ తర్వాత విచారణకు ఆదేశించాల్సి వచ్చింది. పనితీరుపరంగా చూస్తే.. ఆమె సీఈవో పగ్గాలు చేపట్టినప్పుడు ఐసీఐసీఐ బ్యాంక్.. దేశీ బ్యాంకింగ్ వ్యవస్థలో రెండో స్థానంలోనూ, ప్రైవేట్ రంగంలో అగ్రస్థానంలో ఉండేది. కానీ కొచర్ వైదొలిగే నాటికి బ్యాంకింగ్ వ్యవస్థలో ఐసీఐసీఐ మూడో స్థానానికి పడిపోయింది. -
చీరలు కట్టుకుని నిరసన తెలిపారు..
ఢిల్లీ: కరువు సాయం కోరుతూ నెల రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్న తమిళ రైతులు శుక్రవారం మళ్లీ వినూత్నంగా ఆందోళనకు దిగారు. చీరలు కట్టుకుని రహదారులపై నడుస్తూ ‘కరువు సాయం మంజూరు చేయండి’ అంటూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తీవ్ర కరవు పరిస్థితుల వల్ల ఆత్మహత్యలు చేసుకున్న రైతుల పుర్రెలు ఇవేనంటూ వాటిని పట్టుకుని ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. తామంతా కావేరి నదీమాత బిడ్డలమని, అందుకే చీరలు కట్టుకున్నామని వారు తెలిపారు. కరువు ఉపశమన ప్యాకేజీ మంజూరు చేయాలని, తమ రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద తమిళనాడు రైతులు ఆందోళన చేస్తున్న నిరసన 32వ రోజుకు చేరింది. కేంద్ర ప్రభుత్వానికి తమ ఆక్రందనను వినిపించేందుకు వినూత్నరీతిలో అన్నదాతలు ఇక్కడ నిరసనలు చేపడుతున్నారు. గతంలో పుర్రెలు, ఎముకలతో ఆందోళన నిర్వహించి మీడియా దృష్టి ఆకర్షించిన రైతులు.. తమ డిమాండ్లు నెరవేర్చకుంటే గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని ఇప్పటికే హెచ్చరికలు చేశారు. రైతుల ఆందోళన నేపథ్యంలోనే కరువు, తుపాను సాయం కింద తమిళనాడుకు కేంద్రం రూ.2,014.45 కోట్ల సాయాన్ని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. -
తమిళనాడు ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
-
తమిళనాడు ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: రైతుల ఆందోళనకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై పూర్తి స్థాయిలో నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. రైతుల దుస్థితిపై సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేస్తూ ఇటువంటి సమయాల్లో రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహించడం సరికాదని వ్యాఖ్యానించింది. మానవతా దృక్పథంతో స్పందించాలని సుప్రీంకోర్టు సూచించింది. రైతుల ఆందోళనలను ఎందుకు పట్టించుకోవడం లేదని సూటిగా ప్రశ్నించింది. కాగా దాదాపు నెల రోజులుగా కరువు ఉపశమన ప్యాకేజీ మంజూరు చేయాలని, తమ రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు రైతులు చేస్తున్న ఆందోళన ఉధృతమైంది. తమ డిమాండ్ల కోసం ఆందోళన జరుపుతున్న అన్నదాతలు కేంద్ర ప్రభుత్వానికి తమ ఆక్రందనను వినిపించేందుకు ప్రతిరోజూ వినూత్నరీతిలో ఇక్కడ నిరసనలు చేపడుతున్నారు. రుణమాఫీపై కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ రైతులు గురువారం అరగుండ్లుతో నిరసన తెలిపారు. గతంలో పుర్రెలు, ఎముకలతో ఆందోళన నిర్వహించి మీడియా దృష్టి ఆకర్షించిన రైతులు.. తమ డిమాండ్లు నెరవేర్చకుంటే గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. రైతుల ఆందోళన నేపథ్యంలోనే కరువు, తుపాను సాయం కింద తమిళనాడుకు కేంద్రం రూ.2,014.45 కోట్ల సాయాన్ని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ఎదుట రైతులంతా నగ్నంగా గుమిగూడి నిరసన ప్రదర్శన నిర్వహించిన రైతులు నిన్న ఒంటిపై రాతలతో తమ నిరసన తెలిపారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకూ ఆందోళన కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేస్తున్నారు. -
ప్రధాని కార్యాలయం ఎదుట నగ్నంగా ఆందోళన!
వినూత్న ఆందోళనలతో హోరెత్తిస్తున్న తమిళ రైతులు న్యూఢిల్లీ: తమ గోడును కేంద్రానికి వినిపించేందుకు దేశ రాజధాని ఢిల్లీలో తమిళనాడు రైతులు చేపట్టిన ఆందోళన కొనసాగుతూనే ఉంది. తాజాగా రైతులు సోమవారం ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ఎదుట వినూత్నరీతిలో ఆందోళన చేపట్టారు. పీఎంవో సహా కీలక కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉండే సౌత్‌బ్లాక్ ఎదుట రైతులంతా నగ్నంగా గుమిగూడి నిరసన ప్రదర్శన నిర్వహించారు. కరువు ఉపశమన ప్యాకేజీ మంజూరు చేయాలని, తమ రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద దాదాపు నెలరోజులుగా తమిళనాడు రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వానికి తమ ఆక్రందనను వినిపించేందుకు వినూత్నరీతిలో అన్నదాతలు ఇక్కడ నిరసనలు చేపడుతున్నారు. గతంలో పుర్రెలు, ఎముకలతో ఆందోళన నిర్వహించి మీడియా దృష్టి ఆకర్షించిన రైతులు.. తమ డిమాండ్లు నెరవేర్చకుంటే గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. రైతుల ఆందోళన నేపథ్యంలోనే కరువు, తుపాను సాయం కింద తమిళనాడుకు కేంద్రం రూ.2,014.45 కోట్ల సాయాన్ని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. -
నిరీక్షణ!
► మూడో విడత రుణమాఫీ కోసం తప్పని ఎదురుచూపులు ► మార్చి ప్రారంభమైనా ఇంకా ఖాతాల్లో పడని సొమ్ము ► ఎప్పుడు అందుతుందోనని రైతన్నల ఆందోళన ► ముందే అరకొర...ఆపై కొనసాగుతున్న ఆలస్యం ► సాధికారత సంస్థ నుంచి ఎప్పుడు విడుదల చేస్తారో తెలియని పరిస్థితి సాక్షి, కడప : రుణమాఫీ మూడో విడత సొమ్ము కోసం రైతన్నలు ఎదురుచూస్తున్నారు. 2017కి సంబంధించి మార్చి నెల సగంరోజులు గడిచినా ఇంకా మాఫీ సొమ్ముపై ప్రకటన లేదు. అసలు సొమ్ము ఎప్పుడు ఖాతాల్లో పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే.. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో రైతన్నలకు పూర్తిస్థాయిలోరుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చింది. ఆధార్, రేషన్‌కార్డులు, పాస్బుక్కుల పేరుతో వేలాదిమంది రైతులకు మాఫీ సొమ్ము అందకుండా చేశారు. మిగిలిన వారికి కూడా రుణమాఫీ సొమ్మును ఒకేసారి కాకుండా ఐదు విడతల్లో అందించేలా బాండ్లను అందజేసిన ప్రభుత్వం ఇంకా మూడో విడత సొమ్మును జత చేయలేదు. ఇప్పటికి రెండు విడతల్లో అంతంత మాత్రంగా రుణమాఫీ సొమ్ము అందించారు. తప్పని ఎదురుచూపులు: జిల్లాలోని 33 బ్యాంకులకు చెందిన బ్రాంచ్‌లలో సుమారు 4.20 లక్షలకుపైగా ఖాతాలు ఉన్నాయి. ఇందులో క్రాప్ లోన్లతోపాటు బంగారు, వ్యవసాయ అనుబంధ రుణాలు తీసుకున్న వారు ఉన్నారు. మొదటగా ప్రభుత్వం రూ.1.50 లక్షల వరకు ఒక్కొక్క రైతుకు రుణమాఫీ ప్రకటించింది. అయితే కొందరి ఇళ్లలో ప్రత్యేకంగా రెండు, మూడు ఖాతాలున్నా ఒక ఖాతాకే మాఫీ సొమ్ము అందింది. 2014లో మొదటి పరిశీలనలో 2,78,070 మందికి, రెండవ పరిశీలనలో 1,33,048 మందికి, మూడవ పరిశీలనలో 9,232 మందికి రుణమాఫీని వర్తింపజేశారు. వారికి మొదటి విడత రూ.462 కోట్లను 4,20,350 ఖాతాలకు జమ చేసినట్లు బ్యాంకు అధికారుల రికార్డులు తెలుపుతున్నాయి. రెండో విడతగా రూ.205 కోట్లను విడుదల చేశారు. ప్రస్తుతం 2016–17 మూడవ విడతకు సంబంధించి రైతులు ఎదురుచూస్తున్నారు. 17 వేలమంది దరఖాస్తు చేస్తే, సగంమందికే మాఫీ: 2015లో రుణమాఫీకి సంబంధించి ఏదో ఒక కారణంతో మాఫీ కానీ రైతులను కలెక్టరేట్లో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో కలెక్టరేట్లో ఒక కేంద్రాన్ని 2015 ఏప్రిల్ 27 నుంచి 2015 జూన్ 7వ తేది వరకు కొనసాగించారు. అప్పట్లో 17,277 మంది రుణమాఫీకి అర్హులమని దరఖాస్తు చేసుకోగా, ప్రభుత్వం 9,232 మందిని మాత్రమే అర్హులుగా ప్రకటించింది. ఆధార్ అనుసంధానం కాలేదనో, రేషన్‌కార్డు సరిపోవడం లేదనో, భూముల్లో తేడాలు ఉన్నాయని, కారణం ఏదైనా తిరస్కరించడంతో మిగతా వారికి రుణమాఫీ సొమ్ము అందలేదు. మూడో విడత కోసం..: 2016-17కి సంబంధించి రుణమాఫీకి అర్హులుగా ఉన్న రైతులు సొమ్ము కోసం ఎదురుచూస్తున్నారు. ఖరీఫ్ కోసం మార్చి నుంచి రైతులు ఏర్పాట్లు చేసుకుంటారు. అందులోభాగంగా బ్యాంకుల్లో అన్నదాతలు క్రాప్ రుణాలు రెన్యూవల్ చేసుకుంటారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మూడో విడత రుణమాఫీ సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే రెన్యూవల్ చేయడానికి అప్పులు తెచ్చుకోకుండా మూడోకంతుగా ప్రభుత్వం అందించే రూ. 20,30 వేలు అన్నదాతకు వడ్డీ చెల్లించడానికి ఆసరాగా ఉంటుంది. జిల్లాలో 2.25 లక్షల మందికి సుమారు రూ.205 కోట్లు ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. రెండవ విడతలో పై మొత్తాన్నే రైతుల అకౌంట్లలో అందజేశారు. బడ్జెట్ కేటాయింపులు అయిన తర్వాతనే..: రుణమాఫీ సొమ్ము అందడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. బడ్జెట్లో రుణమాఫీకి రాష్ట్రవ్యాప్తంగా కేటాయింపులు చేసిన తర్వాతనే విడుదల చేసే అవకాశం ఉంది. దీనిపై మరో నాలుగైదు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏదీ ఏమైనా బడ్జెట్ కేటాయింపులనంతరం ఏప్రిల్‌లో రుణమాఫీ సొమ్ము అందే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. -
హామీలు విస్మరించిన ప్రభుత్వం
కర్నూలు(ఓల్డ్‌సిటీ): రెండేళ్లయినా ఎన్నికల హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసగిస్తున్న ప్రభుత్వంపై ఈనెల 8న జిల్లాలోని అన్ని పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ప్రజలను కోరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ మోసపూరిత వాగ్దానాలపై కర్నూలులో మూడవ పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేస్తామన్నారు. రైతు, డ్వాక్రా రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం మాట తప్పిందన్నారు. అదేవిధంగా ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి తదితర ఎన్నో హామీలను నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ ఫిర్యాదుల కార్యక్రమం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. -
డ్వాక్రా రుణమాఫీ తూచ్..
-
డ్వాక్రా మహిళపై.. ఒత్తిళ్ల కత్తి
ఎచ్చెర్ల క్యాంపస్:ఎన్నికల హామీగా టీడీపీ తెరపైకి తెచ్చిన డ్వాక్రా రుణాల మాఫీపై అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో స్వయంశక్తి సంఘాల మహిళల పరిస్థితి ఇరకాటంలో పడింది. టీడీపీ ఇచ్చిన హామీ మేరకు గత మార్చి నుంచి సుమారు నాలుగు నెలలుగా స్వయంశక్తి సంఘాలు రుణ వాయిదాల చెల్లింపు నిలిపివేశాయి. బకాయిలు చెల్లిస్తేనే కొత్త రుణాలు ఇస్తామని బ్యాంకర్లు స్పష్టం చేస్తుండగా, కమ్యూనిటీ ఫెసిలిటేటర్లు సైతం డ్వాక్రా మహిళల ఇళ్లకు వెళ్లి మరీ రుణ వాయిదాలు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారు. జిల్లాలో సుమారు 45 వేల స్వయం సహాయక సంఘాలు ఉండగా సుమారు 35,683 సంఘాలు రూ.713 కోట్ల మేరకు రుణాలు తీసుకున్నాయి. సీనియారిటీని బట్టి ఒక్కో సంఘం రూ. 50 వేల నుంచి రూ. 6 లక్షల వరకు తీసుకున్నాయి. గత నాలుగు నెలలుగా ఈ సంఘాలు వాయిదాలు చెల్లించకపోవడంతో బకాయిలు భారీగా పేరుకుపోయాయి. డ్వాక్రా సంఘాలు రెండు రకాల బ్యాంకు ఖాతాలు నిర్వహిస్తుంటాయి. సభ్యుల పొదుపు రూపంలో నెలనెలా చెల్లించే రూ.30 నుంచి రూ.50 మొత్తాల జమకు ఒక ఖాతా, తీసుకున్న రుణ వాయిదాలు నెలనెలా జమ చేసేందుకు మరో ఖాతా నిర్వహిస్తుంటాయి. నెలవారీ పొదుపు సొమ్ము చెల్లించకపోతే సంఘం రద్దయ్యే ప్రమాదమున్నందున వాటిని మాత్రం అన్ని సంఘాలు ఠంచనుగా చెల్లిస్తున్నాయి. రుణ వాయిదాల చెల్లింపులు మాత్రం పూర్తిగా నిలిచిపోయాయి. పెరుగుతున్న ఒత్తిళ్లు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన లేకపోవడం.. బకాయిలు పెద్ద ఎత్తున పేరుకుపోవడంతో బ్యాంకర్లు రుణాలు చెల్లించాలని సంఘాలపై ఒత్తిడి తెస్తున్నారు. దీనికితోడు పథకాన్ని పర్యవేక్షిస్తున్న ఇందిర క్రాంతి పథం కమ్యూనిటీ ఫెసిలిటేటర్లు గ్రామాలకు వెళ్లి రుణ బకాయిలు చెల్లించాలని సంఘాల లీడర్లను కోరుతున్నారు. పనిలో పనిగా ఇంకో సూచన కూడా చేస్తున్నారు. రుణ వాయిదాలను వాయిదాల పాస్ పుస్తకంలో కాకుండా పొదుపు పుస్తకంలో జమ చేయించమంటున్నారు. రుణాలు మాఫీ కాకపోతే పొదుపు ఖాతాలోని ఈ సొమ్మును బ్యాంకులు తీసుకుంటాయని, అలా కాకుండా మాఫీ అమలైతే పొదుపు సంఘాలకే ఆ మొత్తాలు ఉండిపోతాయని బ్యాంకర్ల సూచనగా చెబుతున్నారు. ఎక్కువ కాలం వాయిదాలు చెల్లించకపోతే ఆర్థిక భారం తప్పదని హెచ్చరిస్తున్నారు. జిల్లాలో జిల్లా మహిళా సమాఖ్యతోపాటు 38 మండల సమాఖ్యలు, 1101 గ్రామ సమాఖ్యలు ఉన్నాయి. ఈ సంఘాలన్నీ రుణ వాయిదాలు చెల్లించకూడదని నిర్ణయించుకున్నాయి. ఐకేపీ సీఎఫ్‌లు కూడా మొదట వాయిదాలు కట్టొద్దని చెప్పినా.. ఇప్పుడు చెల్లించమంటుండటం చర్చనీయాంశంగా మారింది. ఎచ్చెర్ల మండలంలోని ఫరీదుపేట, కేశవరావుపేట, చిలకపాలెం, ఇబ్రహీంబాద్ తదితర గ్రామాల్లో సీఎఫ్‌లు పొదుపు ఖాతాలో రుణ వాయిదాలు జమ చేయాలని సంఘాల సభ్యులపై ఒత్తిడి తెస్తున్నారు. జిల్లా అంతటా దాదాపు ఇదే పరిస్థితి ఉంది. వాయిదాలు చెల్లించ మంటున్నారు వాయిదాలు కట్టమని సీఎఫ్ ఒత్తిడి తెస్తున్నారు. పొదుపు పుస్తకంలో జమ చేయమని సూచిస్తున్నారు. లేదంటే మొత్తం ఒక్కసారి చెల్లించాల్సి వస్తుందని.. భారం అవుతుందని భయపెడుతున్నారు. భవిష్యత్తులో రుణం కూడా మంజూరు కాదని హెచ్చరిస్తున్నారు. ఏం చేయాలో తేల్చుకోలేకపోతున్నాం. ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలి. -ఉర్లాపు పున్నమ్మ, ఫరీదుపేట