Loans and grants
-
పండగకు ‘పావలా’!
నేలకొండపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు స్వయం సహాయక సంఘాలపై దయతలిచింది. మూడేళ్లుగా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసి న సభ్యులపై పండగ పూట కరుణ చూపింది. జిల్లాలోని 24,780 స్వయం సహాయక సంఘాలకు రూ.56.27కోట్ల పావలా వడ్డీ రుణాలను విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఐకేపీ సిబ్బంది నగదును పొదుపు ఖాతాల్లో జమచేసే పనిలో నిమగ్నమయ్యాయి. అయితే రుణాలను పొదుపు ఖాతాలో జమ చేస్తుండ డంపై కొందరు సభ్యుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గ్రూపులో అప్పులు ఉన్న వారి కి బ్యాంకు నిర్వాహకులు ఆ మొత్తంలో కోత విధించి.. మిగతాది చెల్లించే అవకాశం ఉంటుంది. దీంతో తమకు రుణం పూర్తిస్థాయిలో అందదని ఆ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆనందం.. ఆవేదన.. వాస్తవానికి ప్రతి ఏడాది పావలా వడ్డీ రుణాలను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. కానీ.. 2015 నుంచి ఇప్పటివరకు వాటిని మంజూరు చేయలేదు. ప్రస్తుతం మూడేళ్ల రుణాలను ఒకేసారి విడుదల చేసింది. అది కూడా దసరా సమయంలో మంజూరు చేయడంతో సంఘాల సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పండగను ఘనంగా జరుపుకోవచ్చని ఆనందపడుతున్నారు. అయితే ఐకేపీ యంత్రాంగం తీసుకున్న నిర్ణయంతో కొందరు సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన రుణాలను ఐకేపీ సిబ్బంది సంఘాల ఖాతాల్లో జమ చేస్తున్నారు. దీంతో ఇప్పటికే అప్పు తీసుకొని ఉన్న సభ్యులకు బ్యాంకు నిర్వాహకులు ఆ మొత్తాన్ని చెల్లించే అవకాశం ఉండదు. బ్యాంకుకు చెల్లించాల్సిన అప్పు పోను మిగిలిన మొత్తాన్ని సభ్యులకు అందజేస్తారు. దీంతో రుణాలను ఖాతాల్లో జమ చేయడం వల్ల తమకు ఎలాంటి లాభం ఉండబోదని, చెక్కు రూపంలో గానీ, నగదు రూపంలో గానీ అందజేయాలని అప్పు తీసుకున్న సంఘాల సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.లక్ష్యానికి మించి.. స్వయం సహాయక సంఘాలకు లింకేజీ రుణాల మంజూరులో జిల్లా ఐకేపీ యంత్రాంగం ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది 8,267 సంఘాలకు గాను.. రూ.169.40కోట్ల రుణాలు లక్ష్యం కాగా.. అధికారులు దానికి మించి మంజూరు చేశారు. సెప్టెంబర్ నాటికే రూ.179.07కోట్లను సంఘాలకు అందజేశారు. లింకేజీ రుణాల మంజూరుతోపాటు.. వసూళ్లలో కూడా జిల్లా యంత్రాంగం ప్రథమ స్థానంలో ఉండటం గమనార్హం. ఖాతాల్లో జమ అవుతున్నాయి.. జిల్లాలోని స్వయం సహాయక సంఘాల్లో అర్హత సాధించిన సంఘాలకు మంజూరైన రుణాలు వారి ఖాతాలో జమ అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లకు సంబంధించిన పావలా వడ్డీ రుణాలను మంజూరు చేసింది. దసరా పండగ ముందు విడుదల కావడంతో సభ్యులు చాలా సంతోషంగా ఉన్నారు. – ఆంజనేయులు, ఐకేపీ, డీపీఎం నగదు ఇస్తే బాగుండేది.. పావలా వడ్డీ రుణాలను బ్యాంకు ఖాతాల్లో కాకుండా నేరుగా నగదు రూపంలో గానీ, చెక్కు రూపంలో గానీ ఇస్తే బాగుండేది. ఖాతాల్లో జమ చేయడం వల్ల బ్యాంకు వారు ఇదివరకు తీసుకున్న అప్పు కింద ఆ మొత్తాన్ని తీసుకుంటారు. అందుకే సభ్యులకు నగదు రూపంలో అందించే ఏర్పాట్లు చేయాలి. – బెల్లం లక్ష్మి, సంఘం సభ్యురాలు సభ్యులు డ్రా చేసుకుంటున్నారు.. పావలా వడ్డీ రుణాలు సంఘాల వారి ఖాతాలో జమ అయ్యాయి. సభ్యులు సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఒక్క నేలకొండపల్లిలోనే 150 సంఘాలకు పావలా వడ్డీ రుణాలు జమ అయ్యాయి. దసరా సమయంలో రుణాలు రావడం ఆనందంగా ఉంది. – ఆర్.పార్వతీబాయి, గ్రామ దీపిక, నేలకొండపల్లి -
వ్యవసాయ రుణాల లక్ష్యం పూర్తిచేయాలి
మంచిర్యాలసిటీ : మంచిర్యాల జిల్లాకు కేటాయించిన రైతుల రుణాల లక్ష్యాన్ని పూర్తి చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. గురువారం ఆయన తన కార్యాలయంలో లీడ్‌బ్యాంక్ మేనేజర్లు, స్వయం సహాయక బృందాలు, ఎంపీడీవో, ఏపీఎంలు, డీఆర్డీఏ, సంక్షేమ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని చేరుకునేందుకు బ్యాంక్, వ్యవసాయశాఖ, సంక్షేమ శాఖ, అధికారులు సమన్వయంతో కేటాయించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. బ్యాంకు ఖాతాదారులకు ఆధార్ అనుసంధానం జిల్లాలో 87.84 శాతం పూర్తయ్యిందన్నారు. బ్యాంకుల వారీగా అనుసంధానం వందశాతం పూర్తి చేయాలన్నారు. ప్రధానమంత్రి యోజన పథకం, సురక్ష భీమా యోజన పథకాలను ప్రజల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. మండల స్థాయిలో ఫీల్డ్, టెక్నికల్ అసిస్టెంట్, ఆశ, ఏఎన్ఎంలు ప్రధానమంత్రి యోజన పథకం లక్ష్యాన్ని పూర్తి చేయాలి. బ్యాంకు అధికారులు ఉపాధిహామీ పథకం కూలీలకు జీరో అకౌంట్‌తోనే వారి వేతనాలను చెల్లించాలని కోరారు. జిల్లాలోని 23 బ్యాంక్‌లతో 105 శాఖల ద్వారా 2017–18లో 88.12 ఆతం సిడీఓ రుణాలు అందించడం జరిగిందన్నారు. పంట రుణాల లక్ష్యం రూ:1,22,719.38 లక్షలకుగాను రూ: 75,595,44 పంపిణీ చేశామన్నారు. అదే విధంగా వ్యవసాయ రుణాలు 53.82 శాతం, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 46.32 శాతం రుణాలు ఇచ్చామని కలెక్టర్ వివరించారు. నాబార్డు ద్వారా డైరీ, కూరగాయల పంట అభివృద్ధికి రుణాలు ఇవ్వడానికి ప్రణాళికలు రూపొందించామన్నారు. సమావేశంలో ఆర్బీఐ ఎల్డీఓ అనిల్‌కుమార్, లీడ్ బ్యాంక్ మేనేజర్ హెచ్ రాజు, ఆంధ్రాబ్యాంక్ ఏజీఎం జయచంద్రన్, ఆర్ఎం వెంకటకుమార్ పాల్గొన్నారు. -
డ్వాక్రా రుణ లక్ష్యం రూ. 1,313 కోట్లు
స్త్రీనిధి, బ్యాంకు లింకేజీ రుణాల రికవరీపై దృష్టి సారించాలి సిబ్బందికి డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్లు ఆదేశం అనంతపురం సెంట్రల్ : డ్వాక్రా సంఘాలకు లక్ష్యం మేరకు రుణాలు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలని డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్లు ఆదేశించారు. శుక్రవారం ప్రశాంతి జిల్లా సమాఖ్య కార్యాల యంలో వెలుగు ప్రాజెక్టు ఏరియా కో ఆర్డినేటర్లు, డీపీఎం, ఏపీఎంలతో స మీక్షా సమావేశం నిర్వహించారు. పీడీ మాట్లాడుతూ 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ. 1313 కోట్ల రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఇప్పటి నుంచే సంఘాలకు రుణాలు మంజూరు చేయడంపై దృష్టి సారించాలని సూచిం చారు. స్త్రీ నిధి, బ్యాంకు లింకేజి, సీఐఎఫ్ రుణాలు తీసుకున్న సంఘాలు తిరిగి కంతులు చెల్లించడం లేదని, దీనిపై దృష్టి సారించాలని ఆదేశించారు. ఇందులో ఏమైనా తేడాలొస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. గతేడాది గ్రా మైక్య, మండల సమాఖ్యల లావాదేవీ లకు సంబంధించి ఆడిట్ వేగవంతంగా నిర్వహించాలన్నారు. అభయహస్తం, ఆ మ్ ఆద్మీ ఇన్సూరెన్స్ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. వెలుగు ప్రాజెక్టు ఆధ్వర్యంలో పనిచేస్తున్న బా లబడులను కుదిస్తున్నట్లు ప్రకటిం చారు. ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ కింద పనిచేస్తున్న 8 మండలాల్లోని 80 సెంటర్లు మాత్రమే పనిచేస్తాయని, ఇతర ప్రాం తాల్లో ఐదు మండలాల్లో ఉన్న 11ం సెంటర్లను మూత వేస్తున్నట్లు తెలి పారు. ఏపీడీ మల్లీశ్వరిదేవి, ఇన్చార్జ్ డీపీఎం గంగాధర్ పాల్గొన్నారు.