డ్వాక్రా రుణ లక్ష్యం రూ. 1,313 కోట్లు | Dwarka loan target of Rs. 1,313 crore | Sakshi
Sakshi News home page

డ్వాక్రా రుణ లక్ష్యం రూ. 1,313 కోట్లు

Published Sat, Jun 20 2015 3:23 AM | Last Updated on Tue, Aug 14 2018 3:47 PM

Dwarka loan target of Rs. 1,313 crore

 స్త్రీనిధి, బ్యాంకు లింకేజీ  రుణాల రికవరీపై దృష్టి  సారించాలి
సిబ్బందికి డీఆర్‌డీఏ పీడీ వెంకటేశ్వర్లు ఆదేశం
 
 అనంతపురం సెంట్రల్ :  డ్వాక్రా సంఘాలకు లక్ష్యం మేరకు రుణాలు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలని డీఆర్‌డీఏ పీడీ వెంకటేశ్వర్లు ఆదేశించారు. శుక్రవారం ప్రశాంతి జిల్లా సమాఖ్య కార్యాల యంలో వెలుగు ప్రాజెక్టు ఏరియా కో ఆర్డినేటర్లు, డీపీఎం, ఏపీఎంలతో స మీక్షా సమావేశం నిర్వహించారు.  పీడీ  మాట్లాడుతూ  2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ. 1313 కోట్ల రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఇప్పటి నుంచే సంఘాలకు రుణాలు మంజూరు చేయడంపై దృష్టి సారించాలని సూచిం చారు.   స్త్రీ నిధి, బ్యాంకు లింకేజి, సీఐఎఫ్ రుణాలు తీసుకున్న సంఘాలు తిరిగి కంతులు చెల్లించడం లేదని, దీనిపై దృష్టి సారించాలని ఆదేశించారు. ఇందులో ఏమైనా తేడాలొస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. 

గతేడాది గ్రా మైక్య, మండల సమాఖ్యల లావాదేవీ లకు సంబంధించి ఆడిట్ వేగవంతంగా నిర్వహించాలన్నారు. అభయహస్తం, ఆ మ్ ఆద్మీ ఇన్సూరెన్స్ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. వెలుగు ప్రాజెక్టు ఆధ్వర్యంలో పనిచేస్తున్న బా లబడులను కుదిస్తున్నట్లు ప్రకటిం చారు. ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ కింద పనిచేస్తున్న 8 మండలాల్లోని 80 సెంటర్లు మాత్రమే పనిచేస్తాయని, ఇతర ప్రాం తాల్లో ఐదు మండలాల్లో ఉన్న 11ం సెంటర్లను మూత వేస్తున్నట్లు తెలి పారు.  ఏపీడీ మల్లీశ్వరిదేవి, ఇన్‌చార్జ్ డీపీఎం గంగాధర్   పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement