జమ్మలమడుగులో బాంబుల కలకలం
సాక్షి, కడప : వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో నాటు బాంబులు బయటపడ్డ ఘటన కలకలం రేపుతోంది. ముద్దనూరు రోడ్డులోని ఓ ఖాళీ స్థలంలో లే అవుట్ వేసేందుకు భూమిని చదును చేస్తుండగా బక్కెట్లో నాటు బాంబులు బయటపడటంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాంబులను జాగ్రత్తగా వెలికి తీస్తున్నారు. ఇప్పటివరకూ 54 నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మాట్లాడుతూ... జేసీబీతో భూమిని చదును చేస్తుండగా బక్కెట్లో నాటు బాంబులు బయటపడ్డాయి. వీటిని గతంలోనే భూమిలో పాతి పెట్టి ఉంటారని భావిస్తున్నామని, దీనిపై విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా వారం రోజుల క్రితం పొలం గట్లు కోసం తవ్వుతుండగా బాంబుల బయటపడిన విషయం తెలిసిందే.