local people
-
పచ్చని గ్రామాలపై పరిశ్రమల పంజా అత్యంత ప్రమాదకరంగా గడ్డపోతారం
-
ఏపీలో ఓటేసుకునే స్వేచ్ఛ కూడా లేదా?
సాక్షి, నరసరావుపేట: ‘స్వతంత్రంగా ఓటేసుకునే హక్కు ఉండకూడదా... టీడీపీకి ఓటేయకుంటే గ్రామాలు విడిచిపెట్టి వెళ్లిపోవాలా... వైఎస్సార్సీపీకి మద్దతు తెలిపడం నేరమా... మమ్మల్ని పోలీసులు ఎందుకు కాపాడటం లేదు...’ ఇదీ ఇప్పుడు గురజాల నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన ప్రజల ఆవేదన. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటేయలేదన్న అక్కసుతో మాచవరం మండలం కొత్త గణేశునిపాడులో టీడీపీ గూండాలు సోమవారం అరాచకం సృష్టించిన విషయం తెలిసిందే.ప్రాణాలను కాపాడుకునే క్రమంలో ఊరొదిలి వేరేచోట బిక్కుబిక్కుమంటూ బతుకుతూ ‘సాక్షి’తో తమ గోడును వెళ్లబోసుకున్నారు. వైఎస్సార్సీపీకి ఓటేశామన్న కక్షతో సోమవారం రాత్రి 7 గంటల నుంచి సుమారు ఐదు గంటల పాటు గ్రామంలో అరాచకం సృష్టించారనీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలే లక్ష్యంగా వారు దాడిచేశారని తెలిపారు. ఇంత జరుగుతున్నా పోలీసులు తమకు రక్షణ కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాం..ఎస్టీ వాడివి మాకు వ్యతిరేకంగా ఓటు వేస్తావా ఎంత ధైర్యంరా అంటూ మాపై టీడీపీ వాళ్లు దాడి చేశారు. భయంతో పొలాల్లోకి పరుగులు తీశాం. ఇళ్లల్లోకి చొరబడి వస్తువులు, ఆటోని ధ్వంసం చేశారు. ఆడవాళ్లు, పిల్లలు అనే కనికరం లేకుండా బూతులు తిడుతూ మావాళ్లను కొట్టారు. దిక్కుతోచని స్థితిలో బందువుల వద్ద తలదాచుకున్నాం.– కాండ్రకుంట హనుమంతుఊళ్లో ఉంటే చంపేస్తామంటున్నారు!జగనన్న పాలనలో మాకు మంచి జరిగింది కాబట్టే వైఎస్సార్సీపీకి ఓటేశాం. అందుకే మాపై కక్ష పెంచుకున్నారు. ఊళ్లో ఉంటే చంపుతామని బెదిరించారు. పోలీసులే రక్షణ కల్పించాలి.– దేవరపు రత్తయ్య బీసీ రజకటీడీపీకి ఓటేయకపోతే బతకనివ్వరా?పొలం పనులు చేసుకుంటూ బతికేవాళ్లం. మా జీవితాలు మారుస్తున్నాడన్న అభిమానంతో జగనన్నకి ఓటేశాం. దానికే మాపై దాడిచేసి, కులం పేరుతో దూషించారు. మా జేసీబీ, ట్రాక్టర్, బైకులు ధ్వంసం చేశారు. ఊళ్లో ఉంటే చంపుతారని భయమేసి భార్యా, పిల్లలతో పక్క ఊళ్లో ఉంటున్నాం. టీడీపీకి ఓటేయకపోతే ఊరొదిలి పోవాలా...– మేకల హనుమంతు, కొత్తగణేశునిపాడు -
శ్రుతిమించిన ప్రేమికుల ప్రవర్తన.. వీడియోలు తీసి సోషల్ మీడియాలో
తుమకూరు (కర్ణాటక): నగరంలోని ఉద్యానవనంలోకి వచ్చే ప్రేమికుల ప్రవర్తనపై స్థానికులు మండిపడుతున్నారు. ఇక్కడి స్మార్ట్‌సిటీ ఉద్యానవనానికి అనేక మంది ఉదయం, సాయంత్రం వేళల్లో సేద తీరడానికి వస్తుంటారు. అదే సమయంలో కళాశాలల్లో చదువుకుంటున్న ప్రేమజంటలు ఇక్కడికి వచ్చి శ్రుతిమించి వ్యవహరిస్తున్నారు. ఈ దృశ్యాలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. చదవండి: (సామాజిక మాధ్యమాల్లో భార్య నగ్న దృశ్యాలు.. కస్టమర్లు ఒప్పుకుంటే..) -
‘కియా’లో స్థానికులకే ఉద్యోగాలు
సాక్షి, పెనుకొండ : అర్హులైన స్థానికులందరికీ ‘కియా’ పరిశ్రమలో ఉద్యోగాలు వచ్చేలా చూస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ స్పష్టం చేశారు. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలనే తలంపుతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవలే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు కూడా ఆమోదం పొందిందని ఆయన గుర్తు చేశారు. ఈ నెల 8న ‘కియా’ కారు ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రానున్న నేపథ్యంలో మంగళవారం మంత్రి శంకరనారాయణ జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ సత్యయేసుబాబుతో కలసి ‘కియా’ పరిశ్రమ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 8వ తేదీ(గురువారం) కియా పరిశ్రమలో మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించనున్న నూతన కారు ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాల్గొంటారన్నారు. అనంతరం ఆయన నేరుగా వైఎస్సార్ కడప జిల్లాకు వెళ్తారని వెల్లడించారు. పెనుకొండను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ధృడ నిశ్చయంతో ఉన్నారన్నారు. రాష్ట్రంలో రైతులు, చేనేత కార్మికుల సమస్యలన్నీ వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాదయాత్రలో స్వయంగా చూశారని, అందువల్లే ‘రైతు భరోసా’తో వారందరికీ ఆదుకునేందుకు సిద్ధమయ్యారన్నారు. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి, అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన నేపథ్యంలో మంగళవారం ఉదయం బీసీ సంక్షేమశాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ సత్యయేసుబాబు ‘కియా’ పరిశ్రమలో భద్రతా ఏర్పాట్లను, ‘కియా’ పరిశ్రమలోని ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం ‘కియా’ ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈనెల 8న మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘కియా’ పరిశ్రమలో ఉండే అవకాశం ఉందన్నారు. ‘కియా’ కారు ప్రారంభోత్సవానికి కూడా తక్కువ మందినే లోనికి అనుమతిస్తామని కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. అనంతరం స్పెషల్ పార్టీ పోలీసులు, డాగ్ స్క్వాడ్ సిబ్బంది ‘కియా’ పరిశ్రమ అణువణువూ తనిఖీలు చేపట్టారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ జాహ్నవి, ఇన్చార్జ్ జేసీ సుబ్బరాజు, ‘కియా’ లీగల్ హెడ్ జూడ్, పరిశ్రమ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ థామస్ కిమ్, కియా ప్రభుత్వ అనుసంధానకర్త సోమశేఖర్‌రెడ్డి, ఏఎస్పీ చౌడేశ్వరి, ఆర్డీఓ శ్రీనివాస్, డీఎస్పీ ఆర్ఎస్ కృష్ణ, డీఎంహెచ్ఓ అనిల్‌కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎల్ఎం మోహన్‌రెడ్డి, మండల కన్వీనర్ శ్రీకాంత్‌రెడ్డి, టౌన్ కన్వీనర్ తయూబ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
లోకల్ వాళ్లకు కాసినోల్లో నో ఎంట్రీ!
ఎక్కడైనా మంచి కాసినో గానీ, పబ్ గానీ ఉన్నాయంటే లోకల్ గా ఉన్నవాళ్లు పండగ చేసుకుంటారు. కాస్త సమయం చిక్కినప్పుడు, చేతిలో డబ్బులు ఉన్నపుడల్లా వాటిని దర్శించుకుని హేపీగా ఫీలవుతారు. కానీ గోవాలో మాత్రం అక్కడి ప్రభుత్వం స్థానికులకు తీవ్ర నిరాశ కలిగించే నిర్ణయం తీసుకుంటోంది. రాష్ట్రంలో కేసినో పరిశ్రమను నియంత్రించే చర్యల్లో భాగంగా.. స్థానికులకు అక్కడి కేసినోలలో ఎంట్రీని నిషేధిస్తోంది. కేవలం బయటి నుంచి వచ్చిన పర్యాటకులకు మాత్రమే అక్కడి కేసినోలను ఎంజాయ్ చేయడానికి చాన్సు ఉంటుందట. ఈ మేరకు ముందుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో నిబంధనలు రూపొందించి, తర్వాత ముఖ్యమంత్రి ఆమోదం తీసుకుంటారు. 20 రోజుల్లోగా దీనికి సంబంధించిన నిబంధనలను నోటిఫై చేస్తామని గోవా హోం శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ గడ్కర్ చెప్పారు. ఇవి నోటిఫై చేసిన తర్వాత రాష్ట్రంలో గేమింగ్ కమిషన్ ఒకదాన్ని ఏర్పాటుచేస్తారు. అప్పటి నుంచి స్థానికులకు ఎట్టి పరిస్థితుల్లోను కేసినోలలో ఎంట్రీ ఉండదు. ఒకవేళ ఎవరైనా వెళ్లాలనుకుంటే ముందుగా గేమింగ్ కమిషనర్ నుంచి ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాలి. గోవాలో మొత్తం 18 కేసినోలున్నాయి.