lock up death
-
అమ్మను చిత్రహింసలు పెట్టారు.. ఒళ్లంతా వాచిపోయింది’
-
అమ్మో.. పోలీస్!
పోలీస్ అంటే ఒక ధైర్యం.. ఒక భరోసా.. అండగా ఉంటారు.. ఆపదలో కాపాడతారనేది అందరి నమ్మకం. అయితే కొందరి చర్యల వల్ల ఆ నమ్మకం సన్నగిల్లుతోంది. చిన్నపాటి ఘటనల్లో పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చినప్పుడు సామాన్యులు వణికి పోతున్నారు. ఎక్కడైనా ఒంటరిగా వెళ్తున్నప్పుడు పోలీస్ కనిపిస్తే వేధిస్తారేమోననే భయంతో తప్పుకుని వెళ్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. సాక్షి, అమరావతి :ఫ్రెండ్లీ పోలీసింగ్, హైటెక్ పోలీసింగ్.. ఇవి ముఖ్యమంత్రి చంద్రబాబు నోట తరచూ విన్పించే మాటలు. అయితే రాష్ట్రంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందనేందుకు లాకప్ మరణాలే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. చిన్నపాటి తప్పులకే పోలీసు విచారణలో ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తోంది. ఇలా ఒకటి, రెండు కాదు. గడిచిన ఏడాదిలో ఏకంగా తొమ్మిది మంది పోలీసుల దెబ్బకు విగతజీవులుగా మారిపోయారు. ‘లాకప్ డెత్’లను నివారించడంలో రాష్ట్ర సర్కారు ఘోర వైఫల్యాన్ని ఇటీవల మానవ హక్కుల వేదిక (హెచ్ఆర్ఎఫ్) ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసిన బహిరంగ లేఖ బట్టబయలు చేసింది. విచారణకు తీసుకొచ్చి రోజుల తరబడి పోలీస్ ఠాణాలో పెట్టి నేరం అంగీకరించేలా చేస్తున్న పోలీస్ మార్క్ థర్డ్ డిగ్రీ ప్రయోగం నిందితుల ప్రాణాల మీదకు వస్తోంది. చిన్నపాటి నేరాలు చేసిన వారిపై సైతం పోలీసు ప్రతాపం చూపించడంతో ప్రాణాలు కోల్పోతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ఇలా రాష్ట్రంలో గతేడాది తొమ్మిది మంది దుర్మరణం చెందారు. వారిలో ఐదుగురు పోలీస్ స్టేషన్లలోనే ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు బయటకు వచ్చి ఆత్మహత్యలు చేసుకున్నారు. మరొకరు గుండె ఆగి మృతి చెందారు. ఇంకా అనేక మంది పోలీసుల వేధింపుల బారిన పడి ఎవరికీ చెప్పుకోలేక బాధ పడుతున్నారు. పోలీసు ఠాణాల్లో మరణ మృదంగం రాష్ట్రంలోని పోలీస్ ఠాణాల్లో మరణ మృదంగం మోగుతోందంటూ మానవ హక్కుల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో గడిచిన ఏడాది జరిగిన లాకప్ డెత్‌ల తీరును గమనిస్తే ప్రభుత్వ వైఫల్యం తేట తెల్లమవుతోంది. వాటిని ఒకసారి పరిశీలిస్తే ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ అనే మాట నీటి మూట అని చెప్పక తçప్పదు. ప్రకాశం జిల్లా ఉలవపాడు పోలీసుల దెబ్బలకు తాళలేక బాబర్ బాషా(28) అక్టోబర్ 9న మృతి చెందాడు. ఇన్నోవా దొంగతనం కేసులో అతన్ని మూడు రోజులపాటు పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలు పెట్టడంతో చనిపోయినట్టు బంధువులు ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన జాషువా నాగదాసు(19) అక్టోబర్ 6న ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ వ్యవహారమై పోలీసులు తనను తీసుకెళ్లి కొట్టారని అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ తన తండ్రికి రాసిన 12 పేజీల సూసైడ్ నోట్(లేఖ)లో మృతుడు పేర్కొనడం గమనార్హం. ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్న విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం మండలం చీమలాపురం గ్రామానికి చెందిన పారిపల్లి రామునాయుడు ఏప్రిల్ 24న పోలీసులకు లొంగిపోయాడు. ఆ మరునాడే ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు చెప్పడం అనుమానాలకు తావిచ్చింది. కర్నూలు జిల్లా కల్లూరుకు చెందిన సయ్యద్ షబ్బీర్(25)ను దొంగతనం కేసులో కర్నూలు త్రీటౌన్ పోలీసులు ఆగస్టు 21న అదుపులోకి తీసుకున్నారు. ఆ మర్నాడే కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో శవమై కన్పించాడు. విశాఖపట్నం సీసీఎస్ పోలీసులు ప్రయోగించిన థర్డ్ డిగ్రీతో విజయనగరానికి చెందిన గొర్లె పైడిరాజు(26) సెప్టెంబర్ 10న దుర్మరణం పాలయ్యాడు. కర్నూలు జిల్లా డోన్ పోలీసుల వేధింపులతో తోపుడు బండి వ్యాపారి వరదరాజులు గతేడాది ఆత్మహత్య చేసుకున్నాడని అతని భార్య అప్పట్లో ఆరోపించింది. గుంటూరు జిల్లా మంగళగిరి శివారు రత్నాలచెరువు ప్రాంతానికి చెందిన బూసిరాజు గోపిరాజు(22) అక్టోబర్ 30న ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక దొంగతనం కేసులో పోలీసులు చిత్రహింసలు పెట్టారని, అందుకే చనిపోతున్నానంటూ తన ఆత్మహత్యను సెల్ఫీ వీడియో తీసుకోవడం అప్పట్లో కలకలం రేపింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన ఈశ్వరరావును సెల్‌ఫోన్ చోరీ కేసులో నవంబర్ 15న రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను 16న సామర్లకోట రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్‌పై శవమై కన్పించడంతో పోలీసుల తీరుపై అనుమానాలు రేగాయి. లాకప్ డెత్‌లను నివారించాలి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం లాకప్ డెత్‌ల నిరోధానికి చర్యలు తీసుకున్నప్పుడే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే ఆర్బాటపు ప్రకటనలకు అర్థం ఉంటుంది. నిందితులను విచారించే పద్దతుల్లో పోలీసుల్లో మార్పు రావాలి. లాకప్ మరణాలను సీరియస్‌గా తీసుకుని వాటికి కారణమైన పోలీసులపై శాఖాపరమైన దర్యాప్తులతో సరిపెట్టకుండా సంబంధిత సెక్షన్ల కింద కేసులు పెట్టి శిక్ష పడేలా చేయాలి. ఎవరినైనా అదుపులోకి తీసుకున్నప్పుడు పోలీసులు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యల గురించి సుప్రీం కోర్టు (1997) మార్గదర్శకాలను పాటించాలి. – యూజీ శ్రీనివాసులు, మానవ హక్కుల వేదిక అధ్యక్షుడు -
నిజంగా విషాదకరం
ఎవరూ మాట్లాడలేని, ఎవరూ స్వేచ్ఛగా సంచరించలేని ఒక ‘విషాదకర దశ’ను దేశం చూస్తున్న దని బొంబాయి హైకోర్టు గురువారం చేసిన వ్యాఖ్యానాన్ని ధర్మాగ్రహ ప్రకటనగా భావించాలి. అయిదేళ్లక్రితం మహారాష్ట్రలోని పుణేలో హేతువాది నరేంద్ర దభోల్కర్‌నూ, మూడేళ్లక్రితం అదే రాష్ట్రంలోని కొల్హాపూర్‌లో మరో హేతువాది గోవింద్ పన్సారేనూ కాల్చిచంపిన ఉదంతాలపై దర్యాప్తుల్లో పురోగతి లేకపోవడాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లను విచారిస్తూ హైకోర్టు ఈ ఘాటు వ్యాఖ్య చేసింది. ఈ కేసుల దర్యాప్తును ఎడతెగకుండా సాగదీస్తున్న సీబీఐ, ఆ రాష్ట్ర సీఐడీ సంస్థలు ఉన్నత న్యాయస్థానానికి ఈ పరిస్థితిని కల్పించాయి. ఇవి దర్యాప్తును పూర్తి చేసి, నేరగాళ్లను బంధించే ఉద్దేశంలో లేవని, న్యాయస్థానం స్వీయ పర్యవేక్షణలో దర్యాప్తు చేయిస్తే తప్ప తమకు న్యాయం దక్కదని ఆ పిటిషనర్లు విన్నవించుకున్నారు. వారికి మణిపూర్ ఎన్కౌంటర్ల కేసులకు పడుతున్న గతి తెలియదనుకోవాలి. అక్కడ జరిగిన 1,500కుపైగా ఎన్కౌంటర్లపై దర్యాప్తు కోరుతూ ఏడేళ్లక్రితం దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సుదీర్ఘ విచారణ జరిపి నిరుడు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేసింది. దీనికి సీబీఐ డైరెక్టర్‌ను ఇన్చార్జిగా నియమించింది. ఇప్పటికి కేవలం నాలుగు కేసుల్లో రెండు చార్జిషీట్లు మాత్రమే సిట్ దాఖలు చేయగలిగింది. ఆ కేసు ల్లోని నిందితులనైనా ఇంతవరకూ ఎందుకు అరెస్టు చేయలేకపోయారన్న ధర్మాసనం ప్రశ్నకు సీబీఐ దగ్గర జవాబు లేదు. సర్వోన్నత న్యాయస్థానం నిలదీసినందుకు కాబోలు మేజర్ విజయ్ సింగ్ బల్హారా అనే సైనిక అధికారిపై సీబీఐ కేసు దాఖలు చేసింది. 2009లో పన్నెండేళ్ల కుర్రవాడిని అతని తల్లిదండ్రుల కళ్లముందే ఎన్కౌంటర్ పేరుతో కాల్చిచంపిన ఉదంతమిది. దేశంలో అడపా దడపా సాగే ఎన్కౌంటర్లు, లాకప్ డెత్‌లు మన దేశ ప్రతిష్టను మసక బారుస్తున్నాయి. మణిపూర్ ఎన్కౌంటర్ల గురించి సుప్రీంకోర్టు మాత్రమే కాదు... ఐక్యరాజ్యసమితి సైతం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మొన్న జూన్‌లో సమితి మానవ హక్కుల మండలి ‘కావాలని, అనుచితంగా, అకారణంగా’ ఈ కేసుల దర్యాప్తును సాగదీస్తున్నారని కటువుగా విమర్శించింది. దేశంలో ఎన్కౌంటర్లు, లాకప్‌డెత్‌లు లేని రాష్ట్రాలు దాదాపు ఉండవు. కానీ 2008–09లో మణిపూర్ అన్ని రాష్ట్రాలనూ తలదన్నిందని జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) గణాంకాలు వెల్లడించాయి. ఆ తర్వాత స్థానం ఉత్తరప్రదేశ్‌ది. 89 ఎన్కౌంటర్ కేసులపై నిరుడు డిసెంబర్ ఆఖరికి దర్యాప్తు పూర్తికావాలని సుప్రీంకోర్టు గడువునిస్తే ఆ సమయానికి దర్యాప్తు సంగతలా ఉంచి, కేవలం 12 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఆ తర్వాత ఆ గడువు మొన్న ఫిబ్రవరికి మారింది. కానీ మార్చి 12 నాటికి 42 కేసుల నమోదు మాత్రమే పూర్తయింది. కనీసం జూన్ నెలాఖరుకు 50 కేసుల్లో అయినా దర్యాప్తు పూర్తికావాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తే జూలై 2న హాజరైన సీబీఐ అధికా రులు కేవలం నాలుగు కేసుల్లో దర్యాప్తు పూర్తిచేశామని విన్నవించారు. ఆ కేసుల్లో ఏ ఒక్కరూ అరెస్టు కాలేదని తాజాగా వెల్లడైంది. లాకప్ డెత్‌ల పరిస్థితి కూడా దీనికి భిన్నంగా లేదు. నిరుడు ఏప్రిల్ నుంచి మొన్న ఫిబ్రవరి వరకూ దేశంలో మొత్తం 1,674 లాకప్ మరణాలు సంభవించాయని ఆసియన్ సెంటర్ ఫర్ హ్యూమన్ రైట్స్(ఏసీహెచ్ఆర్) గత నెలలో విడుదల చేసిన నివేదికలో తెలిపింది. భారత్‌లో రోజుకు సగటున అయిదు లాకప్ డెత్‌లు జరుగుతున్నాయని సంస్థ లెక్కే సింది. చిత్రమేమంటే మన జాతీయ క్రైం రికార్డుల బ్యూరో(ఎన్సీఆర్బీ) విడుదల చేసే గణాం కాల్లో ఈమధ్యవరకూ లాకప్ మరణాల ప్రస్తావన ఉండేది కాదు. అవి సర్వసాధారణంగా అనా రోగ్యం, ఆత్మహత్య, కస్టడీనుంచి అదృశ్యం కావటం, నిందితుణ్ణి తరలిస్తుండగా చనిపోవటం వంటి ఖాతాల్లో పడటం ఆనవాయితీ. ఎన్కౌంటర్ మరణాలైతే హక్కుల సంఘాల దృష్టికొస్తాయి. చివరకు ఏమవుతాయన్న సంగతలా ఉంచి కనీసం న్యాయస్థానాల్లో ఆ మరణాలపై విచారణ కోరుతూ పిటిషన్లు దాఖ లవుతాయి. కానీ లాకప్ డెత్‌లు అలా కాదు. మరీ ప్రాముఖ్యత సంతరించుకున్న కేసులైతే చెప్పలేంగానీ చాలా కేసుల్లో చివరివరకూ పట్టుదలగా పోరాడేవారుండరు. ఎందుకంటే వీటిల్లో ప్రాణాలు కోల్పోతున్నవారు పూటకు గతి లేని, రెక్కాడితేగానీ డొక్కాడని అట్టడుగు కులాలకు చెందినవారే. వారి తల్లిదండ్రులైనా, బంధువులైనా కూలి పనులు మానుకుని న్యాయస్థానాల చుట్టూ తిరిగే పరిస్థితిలో ఉండరు. ఉన్నా వారికి బెదిరింపులు, ఒత్తిళ్లు వస్తుంటాయి. కేరళలో ప్రభావతి అనే ఒక తల్లి తన కుమారుడి లాకప్ మరణంపై పట్టుదలగా పోరాడి నిందితులకు సీబీఐ కోర్టులో ఈమధ్యే ఉరిశిక్ష పడేలా చూసిన ఉదంతం మీడియాలో ప్రముఖంగా వచ్చింది. ఆ తల్లి పట్టుదలగా పోరాడిన వైనం గమనిస్తే అదే రాష్ట్రంలో 1976లో ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో పోలీసుల చేతుల్లో అదృశ్యమైన ఇంజనీరింగ్ విద్యార్థి రాజన్, అతని ఆచూకీ చెప్పాలంటూ 2006లో తుది శ్వాస విడిచేవరకూ పోరాడిన అతని తండ్రి ప్రొఫెసర్ ఎచెరా వారియర్ గుర్తుకొస్తారు. అంతం తమాత్రం చదువుకొని ఆయాగా పనిచేస్తున్న ఒంటరి మహిళ ప్రభావతి 2005లో తన ఒక్కగానొక్క బిడ్డను పోలీసులు కొట్టి చంపారని తెలిసినప్పటినుంచీ మొండిగా పోరాడింది. గూండాల నుంచి బెదిరింపులొచ్చినా, రోడ్డు ప్రమాదంలో హతమార్చే ప్రయత్నం జరిగినా, డబ్బు ముట్టజెబుతా మని ఆశ చూపినా తన సంకల్పం వీడలేదు. కానీ ఇంత సాహసికంగా, ఇంత నిర్భీతితో పోరాడటం అందరికీ సాధ్యమయ్యే పనేనా? ఈ ఎన్కౌంటర్లు, లాకప్ మరణాలు అంతర్జాతీయంగా మనల్ని నగుబాటుపాలు చేస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్నాయి. ఈ ఉదంతాలను పాలకులు నివారించలేకపోతే పోయారు... ఇప్పటికైనా మేల్కొని కనీసం త్వరితగతిన దర్యాప్తు పూర్తయ్యేలా, నిందితులకు శిక్షలు పడేలా చూడకపోతే ఈ ఘటనలకు వారి పరోక్ష ఆమోద మున్నదనే అభి ప్రాయం బలపడుతుంది. -
సీబీఐ కోర్టు సంచలన తీర్పు: పోలీసులకు మరణ శిక్ష
సాక్షి, తిరువనంతపురం: సీబీఐ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఒక యువకుడి లాకప్ డెత్ కేసులో కేరళ సీబీఐ ప్రత్యేక కోర్టు ఇద్దరు కానిస్టేబుళ్లకు మరణ శిక్షను విధించింది. ఈ కేసులో మొత్తం అయిదుగురి పోలీసులను దోషులుగా తేల్చిన కోర్టు ఇద్దరికి మరణశిక్షను విధిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. దీంతోపాటు రెండు లక్షల రూపాయల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. అంతేకాదు ఈ కేసులో ఎస్ఐ, సీఐలకు అసిస్టెంట్ కమిషనర్లకు మూడేళ్ల జైలు శిక్షను ఖరారు చేయడం గమనార్హం. 2005లో ఉదయ్ కుమార్ అనే యువకుడు లాకప్ హత్యకు గురయ్యాడు. అప్పట్లో తీవ్ర సంచనలం రేపిన ఈ హత్య కేసులో పోలీసు కానిస్టేబుళ్లు జితు కుమార్, శ్రీ కుమార్‌లను ప్రధాన నిందితులుగా తేల్చింది. అలాగే ఈ కేసులో కుట్ర నేరారోపణలు, సాక్ష్యాలను నాశనం చేయడం తదితర ఆరోపణల కింద సబ్ ఇన్స్పెక్టర్ అజిత్ కుమార్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇ.కె. సాబుతోపాటు అప్పటి అసిస్టెంట్ కమిషనర్ ఫోర్ట్ కే హరిదాస్‌కు కూడా మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. కాగా ఒక దొంగతనం కేసులో అదుపులోకి తీసుకున్న ఉదయకుమార్‌ను పోలీసులు తీవ్రంగా హింసించి, హత్య చేశారని ఉదయకుమార్ తల్లి దాఖలు చేసిన పిటిషన్‌పై, హైకోర్టు ఆదేశాల మేరకు 2007లో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేపట్టింది. మరోవైపు ఈ తీర్పుపై బాధితుడి తల్లి ప్రభావతి అమ్మ సంతృప్తిని వ్యక్తం చేశారు. తన పదమూడేళ్ల పోరాటం ఫలించిందనీ, తన కొడుకు కోల్పోయినప్పటినుంచి తనకు కంటిమీద కునుకులేకుండా పోరాటం చేశానంటూ గుర్తు చేసుకున్నారు. అలాగే ఇలాంటి అనుభవం ఎదుర్కొన్న తల్లులు , ఈ తరహా క్రూరత్వానికి వ్యతిరేకంగా నిర్భయంగా పోరాడాలని పిలుపునిచ్చారు. -
మిర్యాలగూడలో లాకప్‌డెత్!
మిర్యాలగూడ టౌన్: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లోని బాత్రూమ్లో ఓ వ్యక్తి మంగళవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన అశోక్‌వెంకట్(42) అనే వ్యక్తిని ఉదయం 8నుంచి 10 గంటల మధ్య పోలీసులు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చినట్లు తెలిసింది. కాగా, సాయంత్రం సమయంలో అశోక్‌వెంకట్ బాత్రూమ్లోకి వెళ్లి చొక్కాతో ఉరి వేసుకున్నాడు. కాగా చాలా బరువుగా ఉన్న అశోక్‌వెంకట్ షర్టుతోనే చనిపోయాడా..? లేక విచారణలో పోలీసులు ఏమైన తీవ్రంగా కొట్టిచంపారా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతన్ని ఏదైనా కేసు నిమిత్తం తీసుకువచ్చారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. అయితే పోలీసులు మాత్రం అతనికి మతిస్థిమితం లేదని, ఎలాంటి కేసులు కూడా లేవని చెబుతున్నారు. సంఘటన స్థలాన్ని ఎస్పీ విక్రమ్‌జీత్ దుగ్గల్, డీఎస్పీ సందీప్ గోనే సందర్శించారు. అనంతరం సంఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంపై ఎస్పీ మాట్లాడుతూ ఇది కస్టోడియల్ డెత్‌గా భావిస్తున్నామని, సమగ్ర విచారణ జరిపిస్తామన్నారు. కాగా, గతంలో ఓ దొంగతనం కేసులో చక్రధర్‌రావు అనే వ్యక్తి ఇదే పోలీస్‌స్టేషన్‌లో మృతి చెందాడు. -
పోలీసులు, గ్రామస్తుల మధ్య ఘర్షణ, పరిస్థితి ఉద్రిక్తం
చెన్నై: వేలూరు జిల్లా ఆంబూరులో పోలీసులకు, గ్రామస్తులకు మధ్య ఘర్షణ కలకలం రేపింది. తమ వాడిని లాకప్ డేత్ చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పోలీసులపై ఆగ్రహంతో పోలీస్ స్టేషన్‌పై ఆందోళనకారులు దాడిచేసి విధ్వంసం సృష్టించారు. ఈ దాడిలో ఎస్పీతోపాటు 15మందికి తీవ్రగాయాలు అయ్యాయి. అంతేకాక 4 బస్సులను కూడా ఆందోళనకారులు దగ్ధం చేసినట్టు తెలిసింది. ఆందోళనకారులకు పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణతో ఉద్రిక్తంగా మారింది. దాంతో పోలీసులు 2 వేల మంది వరకు పహారా కాసినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
లాకప్‌డెత్ చేశారని పోలిస్స్టేషన్పై దాడి
-
లాకప్‌డెత్ ఘటన పై ఎస్పీ సీరియస్