పోలీసులు, గ్రామస్తుల మధ్య ఘర్షణ, పరిస్థితి ఉద్రిక్తం | police and villagers quarrelled themselves | Sakshi
Sakshi News home page

పోలీసులు, గ్రామస్తుల మధ్య ఘర్షణ, పరిస్థితి ఉద్రిక్తం

Published Sun, Jun 28 2015 9:04 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

police and villagers quarrelled themselves

చెన్నై:  వేలూరు జిల్లా ఆంబూరులో పోలీసులకు, గ్రామస్తులకు మధ్య ఘర్షణ కలకలం రేపింది. తమ వాడిని లాకప్ డేత్ చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పోలీసులపై ఆగ్రహంతో పోలీస్ స్టేషన్పై ఆందోళనకారులు దాడిచేసి విధ్వంసం సృష్టించారు. ఈ దాడిలో ఎస్పీతోపాటు 15మందికి తీవ్రగాయాలు అయ్యాయి.

అంతేకాక 4 బస్సులను కూడా ఆందోళనకారులు దగ్ధం చేసినట్టు తెలిసింది. ఆందోళనకారులకు పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణతో ఉద్రిక్తంగా మారింది. దాంతో పోలీసులు 2 వేల మంది వరకు పహారా కాసినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement