logo unveiled
-
‘ఒకే భూమి.. ఒకే కుటుంబం.. ఒకే భవిష్యత్తు’
న్యూఢిల్లీ: భారత అధ్యక్షతన నిర్వహించనున్న 2023 జీ20 సదస్సు వెబ్సైట్, థీమ్, లోగోను ఆవిష్కరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. జీ20 ప్రెసిడెన్సీలో ఈ 2022, డిసెంబర్ 1 నుంచి 2023 నవంబర్ 30 వరకు భారత్ కొనసాగనుంది. ఈ సదస్సుకు ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ అనే మంత్రాన్ని భారత్ సూచిస్తున్నట్లు తెలిపారు మోదీ. ఈ మేరకు వివిధ కార్యక్రమాలకు భారత్ అనుసరించిన విధానాలను ట్విటర్లో పంచుకున్నారు. ‘ఒకే సూర్యుడు, ఒకే ప్రపంచం, ఒకే గ్రిడ్‌తో భారత్ పునరుత్పాదక ఇంధనం రెవల్యూషన్‌కు భారత్ నేతృత్వం వహించింది. ఒకే భూమి, ఒకే ఆరోగ్యంతో గ్లోబల్ హెల్త్ కార్యక్రమాన్ని భారత్ బలోపేతం చేసింది. అలాగే.. ఇప్పుడు జీ20కి భారత థీమ్ ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు. జీ20కి భారత్ అధ్యక్షత వహిస్తున్నందుకు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వసుధైక కుటుంబం ప్రాముఖ్యతను ప్రపంచానికి భారత్ చాటిచెబుతోంది. లోగోలోని కమలం ఈ సవాళ్ల సమయంలో భరోసాను కల్పిస్తుంది ’ అని పేర్కొన్నారు మోదీ. భారత్‌ను ముందుకు తీసుకెళ్లటంలో దేశ ప్రజలతో పాటు గత ప్రభుత్వాల పనితీరును కొనియాడారు మోదీ. జీ20 గ్రూప్‌లో 20 సభ్య దేశాలు ఉన్నాయి. అధ్యక్షత బాధ్యతలు ఒక్కో ఏడాది ఒక్కో సభ్య దేశం నిర్వర్తిస్తుంటుంది. ఈ సమయంలో అంతకు ముందు, ఆ తర్వాత బాధ్యతలు చేపట్టబోయే దేశాలతో కలిసి పని చేస్తుంది. దీనిని ట్రోయికా అఅంటారు. ప్రస్తుతం ఇటలీ, ఇండోనేసియా, భారత్‌లు ఈ ట్రోయికా దేశాలుగా ఉన్నాయి. వచ్చే ఏడాది 2023 సెప్టెంబర్‌లో ఈసదస్సు జరగనుంది. భారతదేశ చరిత్రలో ప్రతిష్టాత్మక సదస్సుగా నిలిచిపోనుంది. One Earth, One Family, One Future. pic.twitter.com/Gvg4R3dC0O — PMO India (@PMOIndia) November 8, 2022 ఇదీ చదవండి: ఒక్కసారిగా రంగు మారిన సియాంగ్ నది.. ఆందోళనలో ప్రజలు.. చైనానే కారణం? -
CM Jagan: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్- 2023 లోగో ఆవిష్కరణ
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రానికి పెట్టుబడులే ధ్యేయంగా ముందుకెళ్తున్న సంక్షేమ ప్రభుత్వం.. మరో అడుగేసింది. విశాఖపట్నంలో జరగబోయే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్- 2023 లోగోను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి గుడివాడ అమర్నాథ్, పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, మారిటైం బోర్డు సీఈఓ ఎస్ షన్మోహన్, ఏపీఎంఎస్ఎంఈ చైర్మన్ వంకా రవీంద్రనాథ్, ఏపీ మారిటైం బోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి, ఏపీటీపీసీ చైర్మన్ కె రవిచంద్రారెడ్డి, పరిశ్రమలుశాఖ సలహాదారు ఎల్ శ్రీధర్, ఏపీఐడీసీ చైర్పర్సన్ బండి పుణ్యశీల, సీఐఐ ఏపీ చైర్మన్ ఎస్ నీరజ్, ఏపీఐడీసీ డైరెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
కొత్త లోగో ఆవిష్కరించిన హెటిరో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీలో ఉన్న హైదరాబాద్ సంస్థ హెటిరో కొత్త లోగో, కార్పొరేట్ బ్రాండ్ గుర్తింపును ఆవిష్కరించింది. ప్రజలే తొలి ప్రాధాన్యతగా ఈ విలక్షణమైన గుర్తింపు హెటిరో వ్యాపార వృద్ధి, వికాసానికి మార్గనిర్దేశంతోపాటు వేగవంతం చేస్తుందని కంపెనీ బుధవారం ప్రకటించింది. ‘భౌగోళిక పరిస్థితులతో సంబంధం లేకుండా అసమానమైన పరిశోధన, తయారీ, మార్కెటింగ్ సామర్థ్యంతో ప్రజలకు సేవ చేయడానికి మేము మంచి స్థానంలో ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న ఆరోగ్య అవసరాలకు తగ్గట్టుగా కంపెనీ పరిధిని విస్తరించడానికి, సామర్థ్యం పెంపునకు చురుకుదనంతో ప్రతిస్పందించడాన్ని మా కొత్త గుర్తింపు ప్రతిబింబిస్తుంది’ అని హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ బి.పార్థ సారథి రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. అందరికీ ఆరోగ్యం అనే ఆలోచన ఆధారంగా నూతన లోగో రూపుదిద్దుకుందని సంస్థ ఎండీ వంశీ కృష్ణ బండి వివరించారు. చదవండి: అలాంటి రూ. 500 నోట్లు చెల్లవా?.. ఇది తెలుసుకోండి -
5కే, 10కే రన్ లోగో ఆవిష్కరణ
నెల్లూరు(బృందావనం): నెల్లూరు రన్నర్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 20న నగరంలో నిర్వహించనున్న నెల్లూరు 5కే, 10 కే రన్ లోగోను ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మినర్వా గ్రాండ్ హోటల్లో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నెల్లూరు రన్నర్స్ ట్రస్ట్ ఫౌండర్ డాక్టర్ శిల్పారెడ్డి మాట్లాడారు. నెల్లూరులో రెండోసారి కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వివరించారు. గతేడాది నిర్వహించిన 5కే రన్లో సుమారు మూడు వేల మంది పాల్గొన్నారని తెలిపారు. కృష్ణపట్నం పోర్టు, దొడ్ల డెయిరీ, వీపీఆర్ మైనింగ్ సౌజన్యంతో చేపడుతున్నట్లు వివరించారు. నవంబరు 20వ తేదీన ఉదయం 6.30 గంటలకు కస్తూరిదేవి గార్డెన్స్ నుంచి అయ్యప్సస్వామి ఆలయం వరకు 10 కే రన్, ఉదయం ఏడు గంటలకు కస్తూరిదేవి గార్డెన్స్ నుంచి కరెంటాఫీస్ సమీపంలోని వైఎస్సార్ విగ్రహం వరకు 5కే రన్ చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. ఏసీ స్టేడియం, ప్రెస్‌క్లబ్, ఎంజీబీ మాల్, తదితర ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నామన్నారు. ఆయా విభాగాల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి ప్రోత్సాహకంగా రూ.10 వేలు, రూ.ఏడు వేలు, రూ.నాలుగు వేలను అందజేయనున్నామని చెప్పారు. అపోలో హాస్పిటల్ డాక్టర్ శ్రీనివాస్, దొడ్ల డెయిరీ ప్రతినిధి బాలకృష్ణారెడ్డి, హోటల్ మినర్వా గ్రాండ్ నిర్వాహకుడు గోపీనాథ్, ఎంజీబీ మాల్ అధినేత గోపాలకృష్ణ , దయాకర్‌రెడ్డి, నెల్లూరు రన్నర్స్ ట్రస్ట్ నిర్వాహకులు, ట్రస్టీ సభ్యులు సుధాకేశవ్రాజ్, శివ, సునీల్ లింగారెడ్డి, గణేష్, తదితరులు పాల్గొన్నారు.