హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీలో ఉన్న హైదరాబాద్ సంస్థ హెటిరో కొత్త లోగో, కార్పొరేట్ బ్రాండ్ గుర్తింపును ఆవిష్కరించింది. ప్రజలే తొలి ప్రాధాన్యతగా ఈ విలక్షణమైన గుర్తింపు హెటిరో వ్యాపార వృద్ధి, వికాసానికి మార్గనిర్దేశంతోపాటు వేగవంతం చేస్తుందని కంపెనీ బుధవారం ప్రకటించింది.
‘భౌగోళిక పరిస్థితులతో సంబంధం లేకుండా అసమానమైన పరిశోధన, తయారీ, మార్కెటింగ్ సామర్థ్యంతో ప్రజలకు సేవ చేయడానికి మేము మంచి స్థానంలో ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న ఆరోగ్య అవసరాలకు తగ్గట్టుగా కంపెనీ పరిధిని విస్తరించడానికి, సామర్థ్యం పెంపునకు చురుకుదనంతో ప్రతిస్పందించడాన్ని మా కొత్త గుర్తింపు ప్రతిబింబిస్తుంది’ అని హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ బి.పార్థ సారథి రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. అందరికీ ఆరోగ్యం అనే ఆలోచన ఆధారంగా నూతన లోగో రూపుదిద్దుకుందని సంస్థ ఎండీ వంశీ కృష్ణ బండి వివరించారు.
చదవండి: అలాంటి రూ. 500 నోట్లు చెల్లవా?.. ఇది తెలుసుకోండి
Comments
Please login to add a commentAdd a comment