5కే, 10కే రన్ లోగో ఆవిష్కరణ
5కే, 10కే రన్ లోగో ఆవిష్కరణ
Published Sat, Nov 12 2016 2:17 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 PM
నెల్లూరు(బృందావనం): నెల్లూరు రన్నర్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 20న నగరంలో నిర్వహించనున్న నెల్లూరు 5కే, 10 కే రన్ లోగోను ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మినర్వా గ్రాండ్ హోటల్లో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నెల్లూరు రన్నర్స్ ట్రస్ట్ ఫౌండర్ డాక్టర్ శిల్పారెడ్డి మాట్లాడారు. నెల్లూరులో రెండోసారి కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వివరించారు. గతేడాది నిర్వహించిన 5కే రన్‌లో సుమారు మూడు వేల మంది పాల్గొన్నారని తెలిపారు. కృష్ణపట్నం పోర్టు, దొడ్ల డెయిరీ, వీపీఆర్ మైనింగ్ సౌజన్యంతో చేపడుతున్నట్లు వివరించారు. నవంబరు 20వ తేదీన ఉదయం 6.30 గంటలకు కస్తూరిదేవి గార్డెన్స్ నుంచి అయ్యప్సస్వామి ఆలయం వరకు 10 కే రన్, ఉదయం ఏడు గంటలకు కస్తూరిదేవి గార్డెన్స్ నుంచి కరెంటాఫీస్ సమీపంలోని వైఎస్సార్ విగ్రహం వరకు 5కే రన్ చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. ఏసీ స్టేడియం, ప్రెస్‌క్లబ్, ఎంజీబీ మాల్, తదితర ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నామన్నారు. ఆయా విభాగాల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి ప్రోత్సాహకంగా రూ.10 వేలు, రూ.ఏడు వేలు, రూ.నాలుగు వేలను అందజేయనున్నామని చెప్పారు. అపోలో హాస్పిటల్ డాక్టర్ శ్రీనివాస్, దొడ్ల డెయిరీ ప్రతినిధి బాలకృష్ణారెడ్డి, హోటల్ మినర్వా గ్రాండ్ నిర్వాహకుడు గోపీనాథ్, ఎంజీబీ మాల్ అధినేత గోపాలకృష్ణ , దయాకర్‌రెడ్డి, నెల్లూరు రన్నర్స్ ట్రస్ట్ నిర్వాహకులు, ట్రస్టీ సభ్యులు సుధాకేశవ్‌రాజ్, శివ, సునీల్ లింగారెడ్డి, గణేష్, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement