న్యూఢిల్లీ: భారత అధ్యక్షతన నిర్వహించనున్న 2023 జీ20 సదస్సు వెబ్‌సైట్, థీమ్, లోగోను ఆవిష్కరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. జీ20 ప్రెసిడెన్సీలో ఈ 2022, డిసెంబర్ 1 నుంచి 2023 నవంబర్ 30 వరకు భారత్ కొనసాగనుంది. ఈ సదస్సుకు ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ అనే మంత్రాన్ని భారత్ సూచిస్తున్నట్లు తెలిపారు మోదీ. ఈ మేరకు వివిధ కార్యక్రమాలకు భారత్ అనుసరించిన విధానాలను ట్విటర్‌లో పంచుకున్నారు.
‘ఒకే సూర్యుడు, ఒకే ప్రపంచం, ఒకే గ్రిడ్‌తో భారత్ పునరుత్పాదక ఇంధనం రెవల్యూషన్‌కు భారత్ నేతృత్వం వహించింది. ఒకే భూమి, ఒకే ఆరోగ్యంతో గ్లోబల్ హెల్త్ కార్యక్రమాన్ని భారత్ బలోపేతం చేసింది. అలాగే.. ఇప్పుడు జీ20కి భారత థీమ్ ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు. జీ20కి భారత్ అధ్యక్షత వహిస్తున్నందుకు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వసుధైక కుటుంబం ప్రాముఖ్యతను ప్రపంచానికి భారత్ చాటిచెబుతోంది. లోగోలోని కమలం ఈ సవాళ్ల సమయంలో భరోసాను కల్పిస్తుంది ’ అని పేర్కొన్నారు మోదీ. భారత్‌ను ముందుకు తీసుకెళ్లటంలో దేశ ప్రజలతో పాటు గత ప్రభుత్వాల పనితీరును కొనియాడారు మోదీ.
జీ20 గ్రూప్‌లో 20 సభ్య దేశాలు ఉన్నాయి. అధ్యక్షత బాధ్యతలు ఒక్కో ఏడాది ఒక్కో సభ్య దేశం నిర్వర్తిస్తుంటుంది. ఈ సమయంలో అంతకు ముందు, ఆ తర్వాత బాధ్యతలు చేపట్టబోయే దేశాలతో కలిసి పని చేస్తుంది. దీనిని ట్రోయికా అఅంటారు. ప్రస్తుతం ఇటలీ, ఇండోనేసియా, భారత్‌లు ఈ ట్రోయికా దేశాలుగా ఉన్నాయి. వచ్చే ఏడాది 2023 సెప్టెంబర్‌లో ఈసదస్సు జరగనుంది. భారతదేశ చరిత్రలో ప్రతిష్టాత్మక సదస్సుగా నిలిచిపోనుంది.
One Earth, One Family, One Future. pic.twitter.com/Gvg4R3dC0O
— PMO India (@PMOIndia) November 8, 2022
ఇదీ చదవండి: ఒక్కసారిగా రంగు మారిన సియాంగ్ నది.. ఆందోళనలో ప్రజలు.. చైనానే కారణం?
Comments
Please login to add a commentAdd a comment