lokesh naidu
-
దళిత ద్రోహి లోకేశ్‌ను అరెస్ట్ చేయాలి
తిరుపతి సిటీ: దళిత ద్రోహి నారా లోకేశ్‌ను వెంటనే అరెస్ట్ చేసి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు. ‘సాక్షి’ విలేకరి కరుణాకర్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ శనివారం తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద అంబేడ్కర్ విగ్రహం ఎదుట దళిత సంఘాల నాయకులు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాగార్జున మాట్లాడుతూ వార్తల కవరేజ్ చేస్తున్న దళిత విలేకరిని అతి దారుణంగా లోకేశ్ గూండాలు తిట్టడం, కొట్టడం అమానుషమన్నారు. నాయకులు మల్లారపు మధు, నల్లారి బాబు, వెంకటస్వామి, యలమంచిలి ప్రవీణ్, తళారి రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
‘నీ తండ్రి, తాతల చరిత్ర ఏంటో తెలుసుకో లోకేష్’
సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌లపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థనరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లోకేష్ తలపై రుపాయి పెడితే పావలాకు పనికిరాడని విమర్శించారు. తన తండ్రి, తాతల చరిత్ర ఏంటో లోకేష్ తెలుసుకోవాలని హితవు పలికారు. బాబు తండ్రి ఖర్జూరనాయుడు రైతుల పొలాల్లో రాత్రిళ్లు వేరుశెనగ బస్తాలు ఎత్తెకెళ్లేవాడని మండిపడ్డారు. గతంలో చంద్రబాబు జేబులు కొట్టేవాడని అందరికీ తెలుసని అన్నారు. చంద్రబాబు, లోకేష్‌లు అఖిల భారత దరిద్ర సంఘానికి అధ్యక్ష, కార్యదర్శులుగా తయారయ్యారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో చంద్రబాబు జన్మించడమే పెద్ద శాపమని ధ్వజమెత్తారు. మంత్రి ఇంకా మాట్లాడుతూ..‘అసలు లోకేష్ అనేవాడు ఎవరు, ఎక్కడ గెలిచాడు, ఏ ప్రజా ఉద్యమాల నుంచి వచ్చాడు. వార్డు మెంబరుగా కూడా గెలవనటువంటి వాడు నెల్లూరు వచ్చి, ముఖ్యమంత్రిని, మంత్రిని, స్థానిక ఎమ్మెల్యేలపై నోటికొచ్చినట్లు మాట్లాడతాడా.? ఇప్పటికైనా లోకేష్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని, నోరు అదుపులో పెట్టుకోవాలి.. ఫేక్ వ్యక్తులు ఎవరో రాష్ట్ర ప్రజలకు, సమాజానికి బాగా తెలుసు. చంద్రబాబు కుటుంబానికి ఉన్న క్రెడిబులిటీ ఏమిటో, క్యారెక్టర్ ఏమిటో అందరికీ తెలుసు. అటువంటి వీళ్ళు సీఎం జగన్ కుటుంబం గురించి మాట్లాడటానికి అర్హత ఎక్కడిది. మీ మాదిరిగా మేమూ మాట్లాడితే.. మీ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారు’ అని సూటిగా ప్రశ్నించారు. -
'పుత్రరత్నం పట్టాభిషేకానికే ఇదంతా'
నెల్లూరు(సెంట్రల్): టీడీపీ ఆర్భాటంగా నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమం బాబు పుత్రరత్నం లోకేష్ పట్టాభిషేకానికి తప్పా తెలుగు ప్రజలకు ఉపయోగపడేది కాదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ విమర్శించారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా ఇంతవరకు ప్రజలకు ఏమి చేయకుండా ఆర్భాటంగా మహానాడును జరుపుకోవడం ఏమిటో అర్థం కావటం లేదన్నారు. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు మొసలికన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. ఉదయం లేచింది మొదలు బాబు విదేశాలు పట్టుకుని తిరుగుతూ పెట్టుబడులు పెట్టమని భిక్షాటన చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా సాధించుకుంటే ఇలా భిక్షాటన చేయాల్సిన అవసరం ఉండదన్నారు. నిజంగా ప్రత్యేకహోదా తేవాలని బాబుకు ఉంటే కేంద్రంలో ఉన్న టీడీపీ మంత్రులను వెనక్కు తీసుకుని గట్టిగా పోరాడాలని హితవు పలికారు. కార్మిక హక్కులను కాలరాయడం, రైతుల భూములను బలవతంగా లాక్కోనే భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని చూడటం కేంద్ర సర్కారుకు తగదన్నారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పూర్తిగా అబద్ధాల కోరని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పిన వెంకయ్యనాయుడు ఇప్పుడు మాటమార్చడం చూసి.. జనం ఆయన్ను మాట మార్చిన వెంకయ్యగా పిలుస్తున్నారని ఎద్దేవ చేశారు.