London Classic Chess Tournament
-
విజేత ప్రజ్ఞానంద
చెన్నై: భారత చెస్ వండర్‌కిడ్ ప్రజ్ఞానంద అంతర్జాతీయ వేదికపై మరోసారి మెరిశాడు. తమిళనాడుకు చెందిన 14 ఏళ్ల ఈ కుర్రాడు ప్రతిష్టాత్మక లండన్ క్లాసిక్ ఓపెన్ చెస్ టోర్నమెంట్లో చాంపియన్‌గా అవతరించాడు. నిరీ్ణత తొమ్మిది రౌండ్ల తర్వాత భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద, ఆంటోన్ స్మిర్నోవ్ (ఆ్రస్టేలియా) 7.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరించగా ప్రజ్ఞానందకు టాప్ ర్యాంక్ ఖాయమైంది. భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ అరవింద్ చిదంబరం 7 పాయింట్లతో మూడో స్థానాన్ని సంపాదించాడు. ఈ ఏడాది ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్ అండర్–18 విభాగంలో విజేతగా నిలిచిన ప్రజ్ఞానంద లండన్ క్లాసిక్ టోర్నీలో అజేయంగా నిలిచాడు. ఆరు గేముల్లో గెలిచిన అతను, మిగతా మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నాడు. ఎచ్ సిల్వయిన్, బ్రోజెల్ సాచా, రిచర్డ్ బేట్స్, రేమండ్ సాంగ్, మారి్టన్ పెట్రోవ్, జూల్స్ ముసార్డ్లపై నెగ్గిన ప్రజ్ఞానంద... ఆంటోన్ స్మిర్నోవ్, అరవింద్ చిదంబరం, సహజ్ గ్రోవర్‌లతో గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నాడు. -
ఆనంద్ గేమ్ డ్రా లండన్ క్లాసిక్ చెస్
లండన్: భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ లండన్ క్లాసిక్ చెస్ టోర్నమెంట్లో మూడో ‘డ్రా’ నమోదు చేశాడు. అమెరికా గ్రాండ్‌మాస్టర్ సో వెస్లీతో జరిగిన ఐదో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 30 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ఐదో రౌండ్ తర్వాత ఆనంద్ 2.5 పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్నాడు. పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో ప్రస్తుతం సో వెస్లీ 3.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. -
ఆనంద్‌కు తొమ్మిదో స్థానం
* లండన్ క్లాసిక్ చెస్ టోర్నీ * చాంపియన్ కార్ల్సన్ లండన్: ప్రపంచ చెస్ మాజీ చాంపియన్, భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ 2015 సీజన్‌ను నిరాశజనకంగా ముగించాడు. లండన్ క్లాసిక్ చెస్ టోర్నమెంట్లో ఆనంద్ 3.5 పాయింట్లు సాధించి తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. చివరిదైన తొమ్మిదో రౌండ్లో అనీష్ గిరి (నెదర్లాండ్స్)తో తలపడిన ఆనంద్ గేమ్‌ను 33 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) విజేతగా నిలిచాడు. నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత కార్ల్సన్, అనీష్ గిరి, మాక్సిమి వాచిర్ లాగ్రెవ్ (ఫ్రాన్స్) 5.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే విజేతను నిర్ణయించేందుకు వీరిద్దరి మధ్య టైబ్రేక్‌ను నిర్వహించారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా కార్ల్సన్ నేరుగా ఫైనల్‌కు వెళ్లగా... అనీష్, లాగ్రెవ్ మధ్య సెమీఫైనల్‌ను నిర్వహించారు. సెమీస్‌లో లాగ్రెవ్ 2-1తో అనీష్ గిరిని ఓడించి కార్ల్సన్తో ఫైనల్లో తలపడ్డాడు. ర్యాపిడ్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో కార్ల్ సన్ 1.5.-0.5తో లాగ్రెవ్ను ఓడించి లండన్ క్లాసిక్ చాంపియన్‌గా అవతరించాడు. ఈ టైటిల్‌తోపాటు గ్రాండ్ చెస్ టూర్లోనూ కార్ల్‌సన్‌కే టైటిల్ దక్కింది. నార్వే ఓపెన్, సింక్యూఫీల్డ్ కప్, లండన్ క్లాసిక్ టోర్నీలను కలిపి గ్రాండ్ చెస్ టూర్‌గా పరిగణించారు. ఈ మూడు టోర్నీల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా కార్ల్సన్ మొత్తం 26 పాయింట్లతో విజేతగా నిలిచాడు. ఆనంద్ 14 పాయింట్లతో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. -
లండన్ క్లాసిక్ టోర్నీ: మళ్లీ ఓడిన ఆనంద్
లండన్: భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ లండన్ చెస్ క్లాసిక్ టోర్నమెంట్లో తన నిరాశజనక ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. మాక్సిమి వాచిర్ లాగ్రెవ్ (ఫ్రాన్స్)తో జరిగిన ఏడో రౌండ్ గేమ్‌లో ఆనంద్ 34 ఎత్తుల్లో ఓడిపోయాడు. పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో ఆనంద్‌కిది మూడో పరాజయం కావడం గమనార్హం. ఏడో రౌండ్ తర్వాత ఆనంద్ 2.5 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. 4.5 పాయింట్లతో మాక్సిమి వాచిర్ లాగ్రెవ్ అగ్రస్థానంలోకి వచ్చాడు. -
ఆనంద్‌కు రెండో ఓటమి
లండన్: లండన్ క్లాసిక్ చెస్ టోర్నమెంట్ ఆరో రౌండ్ గేమ్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ 54 ఎత్తుల్లో గ్రిష్చుక్ (రష్యా) చేతిలో ఓడిపోయాడు. ఈ టోర్నీలో ఆనంద్‌కిది రెండో పరాజయం. ఆరో రౌండ్ తర్వాత ఆనంద్ 2.5 పాయిం ట్లతో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. -
ఆనంద్‌కు ‘లండన్’ టైటిల్
లండన్: నాటకీయ పరిణామాల నడుమ భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ లండన్ క్లాసిక్ చెస్ టోర్నమెంట్లో తొలిసారి విజేతగా అవతరించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఈ టోర్నీలో ఆనంద్ 7 పాయింట్లతో వ్లాదిమిర్ క్రామ్నిక్ (రష్యా), అనీష్ గిరి (నెదర్లాండ్స్)లతో కలిసి ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచాడు. చివరిదైన ఐదో రౌండ్లో ఆనంద్ నల్లపావులతో ఆడుతూ 36 ఎత్తుల్లో మైకేల్ ఆడమ్స్ (ఇంగ్లండ్)పై గెలుపొందగా... క్రామ్నిక్, అనీష్ గిరిల మధ్య జరిగిన గేమ్ 63 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. దాంతో విజేతను నిర్ణయించడానికి ఈ ముగ్గురి మధ్య సూపర్ టైబ్రేక్ స్కోరును పరిగణనలోకి తీసుకున్నారు. ఈ టోర్నీలో నల్ల పావులతో గేమ్‌లు నెగ్గిన వారికి సూపర్ టైబ్రేక్ స్కోరింగ్ నిబంధన అనుకూలిస్తుంది. ఆనంద్ నల్లపావులతో విజయం సాధించగా... క్రామ్నిక్, అనీష్ గిరి (రెండో రౌండ్లో) తెల్లపావులతో నెగ్గారు. దీంతో ఆనంద్‌కు టైటిల్ ఖాయమైంది. ఆరుగురు గ్రాండ్‌మాస్టర్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో ఐదు రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో గేమ్ గెలిస్తే మూడు పాయింట్లు... ‘డ్రా’ చేసుకుంటే ఒక పాయింట్ లభిస్తాయి. ఆనంద్, క్రామ్నిక్, అనీష్ గిరి నాలుగేసి గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, ఒక్కో గేమ్‌లో గెలిచారు. అయితే నల్లపావులతో నెగ్గడం ఆనంద్‌కు కలిసొచ్చింది. ఆనంద్‌కు 50 వేల యూరోలు (రూ. 39 లక్షల 20 వేలు) ప్రైజ్‌మనీగా లభించింది.