
ఆనంద్‌కు రెండో ఓటమి
లండన్: లండన్ క్లాసిక్ చెస్ టోర్నమెంట్ ఆరో రౌండ్ గేమ్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ 54 ఎత్తుల్లో గ్రిష్‌చుక్ (రష్యా) చేతిలో ఓడిపోయాడు. ఈ టోర్నీలో ఆనంద్‌కిది రెండో పరాజయం. ఆరో రౌండ్ తర్వాత ఆనంద్ 2.5 పాయిం ట్లతో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు.