london terror attack
-
ఆ ఉగ్రదాడి వెనకా పాక్ హస్తం!
ప్రపంచంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా.. దాని వెనక పాక్ హస్తం కనిపించేలాగే ఉంది. గతంలో ముంబై నగరం మీద జరిగిన ఉగ్రదాడి పాక్ పనేనని మన దేశం స్పష్టంగా చెప్పి, సాక్ష్యాలు చూపించింది. అయినా పాక్ కాదంది. ఇప్పుడు లండన్‌లో జరిగిన ఉగ్రదాడిలో కూడా పాక్ హస్తం ఉందని తేలిపోయింది. లండన్ ఉగ్రదాడిలో పాల్గొన్న ముగ్గురిలో ఒకడైన ఖుర్రమ్ షజాద్ భట్ అనే వ్యక్తి 'ద జీహాదీస్ నెక్స్ట్ డోర్' అనే ఒక డాక్యుమెంటరీలో కూడా నటించిన పాకిస్తానీ. ఆ విషయం బ్రిటన్‌కు చెందిన ఎంఐ5 ఇంటెలిజెన్స్ సర్వీస్ వాళ్లు చెప్పారు. పాకిస్తాన్లో పుట్టి, లండన్‌లో స్థిరపడిన ఖుర్రమ్తో పాటు అతడి ఇద్దరు ఉగ్రవాద సహచరులను పోలీసులు కాల్చి చంపేశారు. శనివారం రాత్రి రద్దీగా ఉన్న మార్కెట్లోకి చొరబడి ఏడుగురిని వీళ్లు చంపిన విషయం తెలిసిందే. కొన్నాళ్లు కేఎఫ్సీలోను, మరికొన్నాళ్లు వేరే కంపెనీలలోను ఖుర్రమ్ పనిచేశాడు. గత సంవత్సరం అతడు నటించిన డాక్యుమెంటరీ ప్రసారమైంది. ప్రస్తుతం నిషేధానికి గురైన అల్-ముహాజిరౌన్ అనే సంస్థ మాజీ అధినేత అంజెమ్ చౌదరితో ఖుర్రమ్కు మంచి సంబంధాలు ఉండేవి. ఇస్లామిక్ స్టేట్ జీహాదీలను ప్రోత్సహిస్తున్నందుకు, తన ప్రవచనాలతో యువతను రెచ్చగొడుతున్నందుకు చౌదరికి ఐదున్నరేళ్ల జైలు శిక్ష పడింది. అల్ ముహాజిరౌన్ సంస్థ ప్రవచనాలతో ప్రభావితమైనవారిలో 2005 జూలై నెలలో లండన్ ప్రజారవాణా వ్యవస్థ వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడి 52 మంది మరణానికి కారణమైన వాళ్లు కూడా ఉన్నారు. అలాంటి సంస్థతో ఖుర్రమ్ తిరిగేవాడు. అయితే.. అతడి ఇంటి చుట్టుపక్కల వాళ్లు మాత్రం ఖుర్రమ్ గురించి చాలా బాగా చెబుతున్నారు. ఏమాత్రం ఆవేశంగా ఉండేవాడు కాదని, కనిపించినప్పుడు హాయ్, బై చెప్పడం తప్ప పెద్దగా మాట్లాడేవాడు కాదని ఆ ప్రాంతంలో డ్రైవింగ్ స్కూలు నడిపే సలాహుదీన్ చెప్పారు. ఖుర్రమ్కు కొడుకు, కూతురు ఉన్నారని, వాళ్లను దగ్గరలోని పార్కుకు తీసుకెళ్లి ఫుట్‌బాల్ ఆడేవాడని తెలిపారు. ఖుర్రమ్తో పాటు ఉన్న రెండో ఉగ్రవాది పేరు రాచిడ్ రెడౌన్ అని పోలీసులు తెలిపారు. మూడో వ్యక్తి వివరాలు మాత్రం వెల్లడించలేదు. -
ఏకంగా ఉగ్రవాదినే చంపబోయిన ట్యాక్సీ డ్రైవర్!
లండన్: మాంచెస్టర్ మారణకాండ నుంచి తేరుకోకముందే బ్రిటన్‌పై మరోసారి పంజా విసిరిన ఉగ్రవాదులు ఆరుగురిని పొట్టన పెట్టుకున్నారు. సెంట్రల్ లండన్‌లో థేమ్స్ నదిపై ఉన్న ‘లండన్ బ్రిడ్జి’పై వ్యాన్‌ను వేగంగా నడుపుతూ పాదచారులను తొక్కించేస్తూ ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. అయితే అదే సమయంలో ఓ టాక్సీ డ్రైవర్ ఏకంగా ఉగ్రవాదులనే అంతమొందించేందుకు యత్నించాడు. కత్తులతో జనాలపై విచక్షణా రహితంగా దాడిచేస్తున్న ఓ ఉగ్రవాదిని తన కారుతో ఢీకొట్టి హతమార్చాలని చూడగా.. ఆ ఉగ్రవాది తప్పించుకున్నాడు. ఒకవేళ తాను చేసిన ప్రయత్నం ఫలించి ఉంటే కొందరు అమాయకుల ప్రాణాలు దక్కేవని ట్యాక్సీ డ్రైవర్ క్రిస్ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘నేను చూస్తుండగానే లండన బ్రిడ్జి పైనుంచి ఓ వ్యాన్ వేగంగా జనాలపైకి దూసుకొచ్చింది. దాంతో జనాలు చెల్లాచెదురైపోయారు. ఇక్కడి నుంచి త్వరగా పారిపోండి అంటూ గట్టిగా అరిచాను. వ్యాన్ ఆపి అందులో నుంచి ముగ్గురు ఉగ్రవాదులు దాదాపు 12 ఇంచుల పొడవైన కత్తులతో దిగారు. ఓ యువతిని ఏకంగా 15-20సార్లు కడుపులో పొడిచి చంపేయడం చూశాను. జనాలపై దాడి చేస్తున్న ఓ ఉన్మాదిని అంతం చేయాలని.. నా కారుతో ఢీకొట్టి చంపేయాలని చూశాను. అయితే తృటిలో తప్పించుకున్నాడు. అదృష్టవశాత్తూ నేను కూడా ఉగ్రవాది నుంచి తప్పించుకోగలిగాను. మూడు కార్లలో పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే జనాలు అప్పటికే ప్రాణ భయంతో పరుగులు తీశారని’ ప్రత్యక్ష సాక్షి అయిన టాక్సీ డ్రైవర్ క్రిస్ వివరించాడు. మే 22న బ్రిటన్ పారిశ్రామిక నగరం మాంచెస్టర్‌లో ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతిదాడిలో 22 మంది చనిపోయిన విషయం తెలిసిందే. -
ఆ పోలీస్‌కు లండన్ సలాం
-
విస్మయం రేపుతున్న లండన్ ఉన్మాది ఫొటోలు!
లండన్‌లో ఉగ్రవాద దాడికి పాల్పడిన దుండగుడి ఫొటోలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. కత్తులతో విరుచుకుపడి లండన్‌ను గగుర్పాటుకు గురిచేసిన దుండుగుడు పోలీసుల కాల్పుల్లో గాయపడిన అనంతరం అంబులెన్స్ సిబ్బంది అతనికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం అతడు ప్రాణాలు విడిచాడు. ఈ సందర్భంగా అంబులెన్స్ సిబ్బంది స్ట్రెచర్‌లో అతన్ని తరలిస్తుండగా తీసిన ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. విస్మయం కలిగించేరీతిలో ఉన్న ఈ ఫొటోలలో దుండగుడు ఉపయోగించిన రెండు కత్తులు సైతం ఉండటం గమనార్హం. బ్రిటన్ పార్లమెంటు లక్ష్యంగా బీభత్సానికి తెగబడిన నిందితుడు ఆసియాకు చెందిన వాడని, అతని వయస్సు సుమారు 40 ఏళ్లు ఉంటుందని భావిస్తున్నారు. రూ. 26 లక్షలు (32వేల పౌండ్లు) విలువచేసే హ్యుండయ్ కారులో దూసుకొచ్చిన అతను వెస్ట్‌మినిష్టర్ బ్రిడ్జ్‌పై విచక్షణారహితంగా వాహనాన్ని నడుపుతూ 40మందిని గాయపర్చాడు. అనంతరం నేరుగా పార్లమెంటు గేటు ముందుకు దూసుకుపోయి.. అక్కడ ఓ పోలీసు అధికారిని పొడిచిచంపారు. అనంతరం పోలీసుల చేతిలో మరణించాడు. ఈ దాడిలో మొత్తం ఐదుగురు ప్రాణాలు విడిచారు. నిందితుడికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. అతను ఉపయోగించిన కారు విలాసవంతమైన ఎస్సెక్స్ ప్రాంతానికి చెందినదిగా రిజిస్టర్ అయి ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయ ఇస్లామిక్ ఉగ్రవాద అనుబంధ ఘటనగానే దీనిని భావిస్తున్నట్టు పోలీసులు చెప్తున్నారు. -
లండన్ టెర్రర్ అటాక్: భారతీయులు సేఫ్!
న్యూఢిల్లీ: బ్రిటన్ పార్లమెంటు లక్ష్యంగా బుధవారం జరిగిన ఉగ్రవాద దాడిలో భారతీయ బాధితులు ఎవరూ లేనట్టు తెలుస్తున్నదని విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు. లండన్‌లో జరిగిన ఈ ఉగ్రవాద దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. కొన్నాళ్లుగా ప్రశాంతంగా ఉన్న లండన్‌పై ఓ ఉగ్రవాది విరుచుకుపడ్డాడు. థేమ్స్ బ్రిడ్జిపై కారుతో బీభత్సం సృష్టించి.. సమీపంలోని పార్లమెంట్‌ను టార్గెట్ చేశాడు. బ్రిడ్జిపై కారును వేగంగా నడిపి ఇద్దరిని పొట్టనబెట్టుకొని.. పార్లమెంట్ భవనం వద్దా ఓ పోలీసు అధికారిని కత్తితో పొడిచి చంపాడు. చివరికి పోలీసుల కాల్పుల్లో అతడు హతమయ్యాడు. బుధవారం పార్లమెంటులో సమావేశాలు జరుగుతుండగానే ఈ ఘటన చోటుచేసుకోవడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటనపై విదేశాంగ మంత్రి సుష్మా ట్విట్టర్లో స్పందించారు. 'లండన్‌లోని భారత హైకమిషన్‌తో నేను నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాను. లండన్ దాడుల్లో భారతీయులు ఎవరూ గాయపడలేదని ఇప్పటివరకు అందిన నివేదికలను బట్టి తెలుస్తున్నది' అని సుష్మా ట్వీట్ చేశారు. I am in constant touch with Indian High Commission in London. There is no Indian casualty reported so far. #LondonAttack @HCI_London — Sushma Swaraj (@SushmaSwaraj) 22 March 2017