TTD: తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు టీటీడీ గుడ్న్యూస్ చెప్పింది. తిరుమలలో యూపీఐ(Unified Payments Interface) విధానాన్ని ప్రవేశపెట్టినట్టు టీటీడీ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, పైలట్ ప్రాజెక్టు కింద గదుల కేటాయింపులో యూపీఐ విధానాన్ని అమలు చేస్తున్నట్టు టీటీడీ తెలిపింది. ఇక, త్వరలోనే తిరుమలలో అన్ని చెల్లింపులు యూపీఐ విధానంలోనే చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: భక్తులకు గమనిక: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఎప్పుడంటే..