lord venkateswara temple
-
కంపెనీలను మించిన వెంకన్న సంపద
న్యూఢిల్లీ: వడ్డీ కాసులవాడైన తిరుపతి గోవిందుడి సంపద .. ఇంతింతై .. అన్నట్లుగా ఏయేటికాయేడు పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో వ్యాపార దిగ్గజ కంపెనీలను కూడా వెనక్కు నెట్టేస్తోంది. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించిన గణాంకాలను బట్టి చూస్తే ఈ విషయంలో ఐటీ సేవల దిగ్గజం విప్రో, ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు ఓఎన్జీసీ, ఐవోసీ మొదలైనవి కూడా వెంకన్న ముందు దిగదుడుపే. టీటీడీ గణాంకాల ప్రకారం ఆయన సంపద విలువ రూ. 2.5 లక్షల కోట్లు. వీటిలో 10.25 టన్నుల బంగారం డిపాజిట్లు, 2.5 టన్నుల బంగారు ఆభరణాలు, రూ. 16,000 కోట్ల డిపాజిట్లు, దేశవ్యాప్తంగా 960 ప్రాపర్టీలు ఉన్నాయి. తిరుమల బాలాజీ సంపద నికర విలువ .. పలు దేశీ బ్లూ చిప్ కంపెనీల వేల్యుయేషన్ (ప్రస్తుత ట్రేడింగ్ ధరల ప్రకారం) కన్నా అధికం. స్టాక్ ఎక్ఛేంజీలో శుక్రవారం నాటి ముగింపు డేటా బట్టి చూస్తే విప్రో మార్కెట్ క్యాప్ రూ. 2.14 లక్షల కోట్లు కాగా అల్ట్రాటెక్ సిమెంట్‌ది రూ. 1.99 లక్షల కోట్లుగా ఉంది. స్విస్ బహుళజాతి దిగ్గజం నెస్లే భారత విభాగం మార్కెట్ విలువ రూ. 1.96 లక్షల కోట్లు. అటు ప్రభుత్వ రంగంలోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) విలువ కూడా బాలాజీ ట్రస్టు సంపద కన్నా తక్కువే. రెండు డజన్ల కంపెనీలకు మాత్రమే ఇంతకు మించిన మార్కెట్ వేల్యుయేషన్ ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ (రూ. 17.53 లక్షల కోట్లు), టీసీఎస్ (రూ. 11.76 లక్షల కోట్లు), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (రూ. 8.34 లక్షల కోట్లు), ఐటీసీ (రూ. 4.38 లక్షల కోట్లు) మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. 2022–23 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 3,100 కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రకారం బ్యాంకుల్లోని నగదు డిపాజిట్లపై రూ. 668 కోట్లు, హుండీ ఆదాయం రూ. 1,000 కోట్ల వరకూ ఉంటుందని టీటీడీ అంచనా వేసింది. -
తిరుమల: భక్తులకు గుడ్ న్యూస్
తిరుమల: దాదాపు రెండేళ్ల తర్వాత వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తుల ప్రత్యేక దర్శనాలను టీటీడీ పునరుద్ధరించింది. కరోనా తగ్గుముఖం పట్టడంతో శుక్రవారం ఉదయం 11 గంటలకు టీటీడీ ఆన్లైన్లో ప్రత్యేక దర్శన టికెట్ల కోటా విడుదల చేసింది. టికెట్లు పొందిన భక్తులకు శనివారం ఉదయం 10 గంటలకు దర్శనానికి అనుమతించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. శ్రీవారి ఆలయం పక్కనున్న తిరుమల నంబి ఆలయం వద్ద ప్రత్యేక క్యూ ఏర్పాటు చేసింది. అలాగే రాంభగీచా నుంచి ప్రత్యేక క్యూ వరకు వెళ్లేందుకు శ్రీవారి సేవకులతోపాటు బ్యాటరీ వాహనాలు, వీల్‌చైర్స్‌ను ఏర్పాటు చేసింది. రెండేళ్ల తర్వాత శ్రీవారిని దర్శించుకున్న భక్తులు పులకించిపోయారు. -
శ్రీవారి సేవలో సీబీఐ డైరెక్టర్
తిరుమల: ఏడుకొండలపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని సీబీఐ డైరెక్టర్ అలోక్ కుమార్ వర్మ దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో దర్శనం కోసం వచ్చారు. టీటీడీ అధికారులు ఆయనకు అధికార లాంఛనాలతో స్వాగతం పలికారు. దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శన అనంతరం రంగానాయకుల మండపం వద్ద వేద పండితులు అలోక్ కుమార్ వర్మకు శ్రీవారి తీర్థప్రసాదాలు అందించారు. -
నేలకొండపై చిన్నచూపు
-
శ్రీవారి సేవకు వెళ్లాలిలా ...
తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి వారిని ఎంతోమంది దర్శించుకుని తరిస్తారు. అయితే ఆ స్వామి వారి సన్నిధిలో వారం రోజులపాటు సేవ చేసే భాగ్యాన్ని కూడా కల్పిస్తోంది టీటీడీ. శ్రీవారి సన్నిధిలోని క్యూ లైన్లు, దేవాలయ పరిసరాలు తదితర చోట్ల విధులు నిర్వహించేందుకు వలంటీర్లను ఎంపిక చేస్తుంది. స్వామివారి సన్నిధిలో సేవకు ఎలా వెళ్లాలి?, మార్గదర్శకాలు ఏమిటో? తెలుసుకోండి మరి... నెల రోజుల ముందే సమాచారమివ్వాలి.. ఆధ్యాత్మిక పరిజ్ఞానం కలిగి ఉండాలి. స్త్రీ, పురుష బేధం లేకుండా పదిమంది భక్తులకు తక్కువగాకుండా బృందంగా వెళ్లాలి. గ్రూపులోని సభ్యులంతా వారి పేరు, చిరునామా, వయస్సు తదితర వివరాలను నెలరోజుల ముందుగానే టీటీడీకి పంపాలి. హిందువులు మాత్రమే అర్హులు. హిందువుగా గుర్తించేందుకు తిరుమల నామం, తిలకం లేదా కుంకుమ లేదా చందనం బొట్టు ధరించాలి. శ్రీవారి సేవకు వచ్చే గ్రూపు లీడరు లేదా కోఆర్డినేటర్ వలంటీర్ల పూర్తి వివరాలు తిరుమల సేవా సదన్‌లో అందించాలి. వారి వయసు 18 ఏళ్లు నిండి 60 ఏళ్లలోపు ఉండాలి. ఆరోగ్య ధ్రువీకరణ పత్రాన్ని (మెడికల్ సర్టిఫికెట్) గుర్తింపు పొందిన వైద్యునిచేత అటెస్ట్ చేయించి సమర్పించాలి. కేటాయించి తేదీల్లో ఉ. 10 నుంచి సా.5 వరకు సేవాసదన్‌లోని సహాయ ప్రజా సంబంధాల అధికారికి రిపోర్ట్ చేయాలి. సేవకులకు ఉచిత బస కల్పిస్తారు. పురుషులకు పీఏసీ-3లో, మహిళలకు సేవాసదన్‌లో వసతి కల్పిస్తారు. సేవకులు తమ లాకర్ కోసం తాళం చెవిలు తెచ్చుకోవాలి. శ్రీవారి సేవాసదన్‌లో రోజూ సాయంత్రం 4గంటలకు డ్యూటీలు కేటాయిస్తారు. రోజుకు కనీసం ఆరుగంటలు విధులు నిర్వహిం చాల్సి ఉంటుంది. సేవా సమయంలోనే శ్రీవారి స్కార్ఫ్‌లు ధరించాలి. గోవిందుడిని స్మరిస్తూ, భక్తులను గోవిందా గోవిందా అని సంభోదించాలి. శ్రీవారి సేవ పూర్తిగా యాత్రికుల సహా యం చేసేందుకు ఉద్దేశించిన స్వచ్ఛంద సేవ మాత్రమే. సేవ కోసం గ్రూపు కోఆర్డినేటర్‌కు కానీ సిబ్బందికి కానీ ధన, వస్తురూపంలో ఎలాంటి చెల్లింపులు ఉండవు. కేటాయించిన ప్రదేశంలోనే సేవ చేయాలి. గర్భాలయ సేవ నిర్బంధ సేవ కాదు. గర్భాలయం సేవ కోసం ఒత్తిడి చేయకూడదు. సేవా సదన్‌లో ఉండే మహిళా సేవకులు రాత్రి వేళల్లో నైటీలు ధరించరాదు. నియమ, నిబంధనలు అతిక్రమిస్తే రెండేళ్ల వరకు సేవకు అనుమతించరు. తిరుమల ఆస్థాన మండపంలో ప్రతి శుక్రవారం ఉదయం 9నుంచి ప్రారంభమయ్యే శిక్షణ తరగతులకు శ్రీవారి సేవకులు హాజరుకావాల్సి ఉంటుంది. సేవకులు తమ చిన్నారులు, వృద్ధులను వెంట తీసుకు రాకూడదు. డ్రెస్ కోడ్.. సేవకు వచ్చే మహిళలు మెరూన్ బార్డర్ కలర్‌తో కూడిన ఆరెంజ్ కలర్ చీర, రవిక ధరించాలి. పురుషులు తెలుపు రంగు వస్త్రాలు ధరించాలి. వివరాలు పంపాల్సిన చిరునామా పౌరసంబంధాల అధికారి, తిరుమల తిరుపతి దేవస్థానము, కపిలతీర్థం రోడ్డు, తిరుపతి, పిన్ కోడ్ 517501. వివరాలకు 0877-2263544, 0877-2264392 నంబర్లలో సంప్రదించవచ్చు.