ఏడుకొండలపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని సీబీఐ డైరెక్టర్ అలోక్ కుమార్ వర్మ దర్శించుకున్నారు.
తిరుమల: ఏడుకొండలపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని సీబీఐ డైరెక్టర్ అలోక్ కుమార్ వర్మ దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో దర్శనం కోసం వచ్చారు. టీటీడీ అధికారులు ఆయనకు అధికార లాంఛనాలతో స్వాగతం పలికారు.
దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శన అనంతరం రంగానాయకుల మండపం వద్ద వేద పండితులు అలోక్ కుమార్ వర్మకు శ్రీవారి తీర్థప్రసాదాలు అందించారు.