lorry - car accident
-
లారీని ఢీకొన్న కారు.. ముగ్గురు విద్యార్థుల దుర్మరణం
గుడుపల్లె(చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలం చిన్నశెట్టిపల్లె వద్ద ఆదివారం వేకువజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వైద్య విద్యార్థులు, మరో ఇంజనీరింగ్ విద్యార్థి దుర్మరణం చెందారు. గుడుపల్లె ఎస్ఐ రామాంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పెనుబర్తి గ్రామానికి చెందిన సి.శ్రీవికాస్‌రెడ్డి (21), అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం రెడ్డివారిపల్లెకు చెందిన ప్రవీణ్‌కుమార్ (24) కుప్పం పీఈఎస్ కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్నారు. వీరికి మదనపల్లెలోని మిట్స్ కళాశాలలో బి.టెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అన్నమయ్య జిల్లా రాజంపేటకు చెందిన కల్యాణ్(20) స్నేహితుడు. కల్యాణ్ పిన్ని కుమారుడు సాయికృష్ణ తేజ కూడా కుప్పం పీఈఎస్ కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి కల్యాణ్ పీఈఎస్ కళాశాలకు వచ్చి సాయికృష్ణ తేజను కలిశాడు. ఆ తర్వాత తన స్నేహితులైన సి.శ్రీవికాస్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్ రూముకు వెళ్లాడు. ముగ్గురు కలిసి ఆదివారం వేకువజామున మూడు గంటల సమయంలో తమ స్నేహితుని కారు తీసుకుని కుప్పానికి బయలుదేరారు. మార్గమధ్యంలో గుడుపల్లె మండలం చిన్నశెట్టిపల్లె వద్ద ముందు వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న మరో లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కారు పల్టీలు కొట్టింది. అదే సమయంలో మరో లారీ వచ్చి కారును ఢీకొట్టడంతో సి.శ్రీవికాస్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్, కల్యాణ్ అక్కడికక్కడే మృతిచెందారు. గుడుపల్లె పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కుప్పం ఏరియా ఆస్పత్రిలో ఆదివారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. ముగ్గురు విద్యార్థుల మృతితో అస్పత్రి వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి. ప్రాక్టికల్ పరీక్షలకు వెళుతూ మరో ఇద్దరు మృతి... అయినవిల్లి: లారీ ఢీకొని ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలకు వెళుతున్న ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. ఈ ఘటన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఆదివారం జరిగింది. అంబాజీపేట మండలం ముక్కామల నందెపుపాలేనికి చెందిన నందెపు రాజేష్ (17), కొత్తపేట మండలం అల్లపల్లిపాలెం కండ్రిగకు చెందిన అల్లపల్లి నాగేంద్ర (17), రాకుర్తివారిపాలేనికి చెందిన కోటిపల్లి మోహన వీరవెంకట సాయికృష్ణ (18) అమలాపురంలో శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. ముగ్గురూ కళాశాలలో ప్రాక్టికల్ పరీక్షకు బైక్‌పై బయలుదేరారు. అయినవిల్లి మండలం నేదునూరు పెదపాలెం టి.సావరం వద్ద జమ్మిచెట్టు సమీపానికి వచ్చేసరికి వీరి బైక్‌ను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో నందెపు రాజేష్, అల్లపల్లి నాగేంద్ర అక్కడికక్కడే మృతిచెందారు. సాయికృష్ణ (18) స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అమలాపురం రూరల్ సీఐ డి.ప్రశాంత్‌కుమార్, అయినవిల్లి ఎస్ఐ ఎస్.నాగేశ్వరరావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
నలుగురు స్నేహితుల దుర్మరణం
ప్రత్తిపాడు: రోడ్డుపై నిలిపి ఉంచిన లారీని.. వేగంగా వెళుతున్న కారు వెనుక నుంచి ఢీకొట్టిన ఘటనలో నలుగురు స్నేహితులు మృత్యువాత పడిన ఘటన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా విజయవాడ వన్‌టౌన్ ఫిష్ మార్కెట్ బురదవారి వీధికి చెందిన చుక్కా గౌతమ్‌రెడ్డి (26), కాకినాడ నగరంలోని జగన్నాథపురం కాలనీకి చెందిన వాడపల్లి అనంత పద్మనాభ చైతన్య పవన్ (25), విశాఖ జిల్లా పెందుర్తి మండలం దేశపాత్రునిపాలెంకు చెందిన పిరిధి సౌమిక (25) విశాఖలోని వరాహ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ కళాశాలలో 2014–19 బ్యాచ్ ఆర్కిటెక్చర్ చదివారు. వీరు ముగ్గురూ విశాఖకు చెందిన తమ స్నేహితురాలు పావనితో కలిసి సోమవారం మధ్యాహ్నం విజయవాడ నుంచి అరుణాచలంకు కారులో బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న కారు సాయంత్రం 5 గంటల సమయంలో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం సమీపంలో టైరు పంక్చర్ కావడంతో జాతీయ రహదారిపై నిలిపి ఉంచిన లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న గౌతమ్‌రెడ్డి, అనంత పద్మనాభ చైతన్య పవన్, సౌమిక అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలపాలై కొనఊపిరితో ఉన్న పావనిని 108లో గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందింది. వీరిలో చైతన్య పవన్, సౌమిక వైజాగ్‌లో ఉద్యోగం చేస్తున్నారని, గౌతమ్‌రెడ్డి ఇంటినుంచే ప్రాజెక్టులు చేస్తూ ఉంటారని స్నేహితులు చెబుతున్నారు. పావని వివరాలు తెలియాల్సి ఉంది. -
తప్పతాగి.. తప్పుడు మార్గంలో..
చిన్నకోడూరు (సిద్దిపేట): తప్పతాగిన డ్రైవర్ విచక్షణ కోల్పోయి తప్పుడు మార్గంలో లారీని నడిపి కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రెండు కుటుంబాలకు చెందిన ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ ఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మల్లారం వద్ద రాజీవ్ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన రిటైర్డ్ లెక్చరర్ తాండ్ర పాపారావు(64), భార్య పద్మ (58)తో కలసి కరీంనగర్లో నివాసముం టున్నారు. అమెరికాలో ఉంటున్న వీరి కుమా రుడు ప్రీతమ్‌రావు, కోడలు అనూష వద్దకు వచ్చే నెలలో వెళ్లాల్సి ఉండటంతో షాపింగ్ చేయడానికని అద్దెకారులో హైదరాబాద్ బయ లుదేరారు. మల్లారం వద్దకు రాగానే రాంగ్ రూట్లో వచ్చిన లారీ వీరి కారును ఢీ కొట్టింది. దీంతో పాపారావు, పద్మ, కారు డ్రైవర్ గొంటి ఆంజనేయులు(48) అక్కడికక్కడే మృతి చెందారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని తెలిసింది. విషయం తెలుసుకున్న చిన్నకోడూరు ఎస్ఐ శివానందం, సిద్దిపేట రూరల్ సీఐ జానకిరాంరెడ్డి, నంగనూరు ఎస్ఐ మహిపాల్‌రెడ్డి సిబ్బందితో సంఘటనా స్థలానికి వచ్చి కారులో ఇరుక్కుపోయిన వారిని జేసీబీ సాయంతో బయటకు తీశారు. మృతదేహాలను సిద్దిపేట జిల్లా ఆస్పత్రికి తరలించి, ప్రమాదానికి గురైన వాహనాలను జేసీబీతో తొలగించి ట్రాఫిక్‌ను సరిచేశారు. 40 రోజుల క్రితం తండ్రి మృతి పాపారావు తండ్రి సూర్యారావు 40 రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. తండ్రి మరణం నుంచి కోలుకుంటున్న సమయంలోనే పాపారావు దంపతులు మృతి చెందడంతో వారి కుటుంబంలో విషాదం అలుముకుంది. ఆస్పత్రి వద్ద పాపారావు సోదరులు, కుటుంబీకులు కన్నీటిపర్యంతమయ్యారు. పాపారావు సిద్దిపేట ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేశారు. కుటుంబ పెద్దను కోల్పోయారు... కారు డ్రైవర్ గొంటి ఆంజనేయులు స్వస్థలం కరీంనగర్ జిల్లా బావుపేట మండలం నాగుల మల్యాల. అతడికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు కుమారులు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు. ఆంజనేయులు క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. -
పండుగ నాడు ఘోర విషాదం
తుమకూరు: రంజాన్ పండుగ రోజు విషాదం చోటుచేసుకుంది. లారీ, కారు ఢీకొన్న దుర్ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. మరొకరు గాయపడ్డారు. ఈ ఘటన హులియూరు దుర్గ పోలీసు స్టేషన్ పరిధిలో రాష్ట్ర రహదారి– 33లో మంగళవారం జరిగింది. రామనగర జిల్లా చెన్నపట్టణకు చెందిన సయ్యద్ మహమ్మద్ నజ్మి (42), నాజియా (30), వారి పిల్లలు సైయద్ ఖుద్ మీర్ హసి (2), సైయద్ ఖుద్ మీర్ నబీ (3)లు రంజాన్ పండుగ కావడంతో భద్రావతిలోని బంధువుల ఇంటికి కారులో వెళుతున్నారు. కుణిగల్ తాలూకా ప్యాలెస్ హోన్నమాచనహళ్లి వద్ద ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జు కాగా, దంపతులు, హసి మృతి చెందారు. మరో బాలుడు నబీకి తీవ్ర గాయాలు తగిలాయి. మృతదేహాలను ఆదిచుంచనగిరి ఆస్పత్రికి తరలించారు. బాలుని మృతదేహాన్ని తల్లి ఒడిలోనే ఉంచడం చూపరులను కలచివేసింది. నీటి గుంతలో పడి అక్కాచెల్లి మృతి మైసూరు: నీటి కుంటలో పడి అక్కాచెల్లెలు మృతి చెందిన సంఘటణ చామరాజనగర జిల్లాలోని గుండ్లుపేట తాలూకా కుబ్బెపురలో మంగళవారం జరిగింది. రైతు రేచప్ప, వేదా దంపతుల కుమార్తెలు పుణ్య (11) పూజా (13) మృతులు. తల్లిదండ్రులు పొలం పనిలో ఉండగా, బాలికలు ఆడుకుంటూ వెళ్లి ఒక ఫారంపాండ్‌లో పడ్డారు. లోతుగా ఉండడంతో బయటకు రాలేకపోయారు. వీరిలో పూజ 8వ తరగతి, పుణ్య 6వ తరగతి చదివేవారు. ఇద్దరు పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు. (చదవండి: కారు పల్టీ, 8 మందికి గాయాలు) -
శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
శంషాబాద్: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన కారు, లారీని ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు మృతి చెందగా... 15 మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటనలో మరో ఆరుగురు లారీ కింద ఇరుక్కున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. క్షత గాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో లారీలో 30 మందికిపైగా కార్మికులు ఉన్నట్లు సమాచారం. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన పరిస్థితులపై ఆరాతీస్తున్నారు. -
లారీని ఢీకొన్న కారు,ఇద్దరు మృతి
-
వంతెనపై నుంచి కిందపడిన కారు
-
అయ్యో..దేవుడా !
తిమ్మాపూర్ (మానకొండూర్): కరీంనగర్లో ఓ లారీ మృత్యువై దూసుకొచ్చింది. ఆదివారం దైవ దర్శనం కోసం వెళ్తున్న దంపతుల కారును మానేరు వంతెనపై ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు వంతెన పైనుంచి కిందపడటంతో భర్త మృతిచెందగా.. భార్య తీవ్రంగా గాయపడింది. అదే సమయంలో ఘటనాస్థలంలో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు వచ్చిన కానిస్టేబుల్ కూడా అదుపు తప్పి వంతెనపై నుంచి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. కరీంనగర్ సుభాష్‌నగర్‌కు చెందిన గంటి శ్రీనివాస్, స్వరూప భార్యాభర్తలు. శ్రీనివాస్ గంగాధర మండలం ఉప్పర మల్యాల ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం సెలవు కావడంతో కొమురవెల్లి మల్లికార్జునస్వామి దర్శనం కోసం భార్యతో కలసి ఉదయం 9 గంటలకు కారులో ఇంటి నుంచి బయల్దేరారు. కారు మానేరు వంతెనపైకి చేరుకున్న సమయంలో కరీంనగర్ నుంచి వస్తున్న లారీ కారును వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. దీంతో కారు అదుపు తప్పి మానేరు వంతెన రెయిలింగ్‌ను ఢీకొని కిందపడింది. సుమారు 200 మీటర్ల ఎత్తు నుంచి కింద ఉన్న బండరాళ్లపై పడడంతో కారు నడుపుతున్న శ్రీనివాస్ (40) అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి భార్య స్వరూప తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే కరీంనగర్, ఎల్ఎండీ పోలీసులకు సమాచారం అందించారు. కరీంనగర్–1 టౌన్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ ప్రమాద స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను నియంత్రించే క్రమంలో అదుపుతప్పి వంతెన పైనుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. 108లో స్వరూప, చంద్రశేఖర్‌ను కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చంద్రశేఖర్ మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని మంత్రి గంగుల కమలాకర్, సీపీ కమలాసన్‌రెడ్డి, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ క్రాంతి సందర్శించారు. ప్రమాదంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
అర్ధరాత్రి లారీ బీభత్సం
-
ఆగి ఉన్నలారీని ఢీ కొట్టిన ఆటో: ముగ్గురు మృతి
-
ఆగి ఉన్నలారీని ఢీ కొట్టిన ఆటో: ముగ్గురు మృతి
పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో బైపాస్ రోడ్డు వద్ద ఈ రోజు తెల్లవారుజామున ఆగి ఉన్నలారీని ఆటో ఢీ కొట్టింది. ఆ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 ద్వారా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే ఆ ప్రమాదంలో మరణించిన మృతదేహలను పోలీసులు స్వాధీనం చేసకున్నారు. అనంతరం మృతదేహలను పోస్ట్‌మార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అలాగే లారీని కూడా పోలీస్‌స్టేషన్‌కు తరలించి సీజ్ చేశారు. ఖమ్మం జిల్లాలోని సత్తెనపల్లి నుంచి కాకినాడ వెళ్తుండగా ఆ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు వెల్లడించారు.