లెజెండరీ ఇన్వెస్టర్ రాకేష్కూ తప్పని షాక్!
ముంబై: మార్కెట్ మాంత్రికుడు , బిగ్‌బుల్‌గా ప్రసిద్ధిగాంచిన రాకేష్ ఝున్ ఝున్ వాలాకు స్టాక్ మార్కెట్లో భారీ నష్టాలు తప్పలేదు. ఒకవైపు అంతర్జాతీయ, జాతీయ అంశాల కారణంగా ఇటీవల దేశీ స్టాక్ మార్కెట్లు దాదాపు 10 శాతం నష్టపోతుండగా, రాకేష్ కు చెందిన వేలకోట్ల పెట్టుబడులు గాలిలో కలిసిపోయాయి. టాటా గ్రూపు వివాదం, పెద్ద నోట్ల రద్దుతో నెలకొన్న సంక్షోభం ఈయన పెట్టుబడులపై భారీ ప్రభావాన్ని పడవేసింది. దలాల్ స్ట్రీట్‌లో దిగ్గజ కంపెనీల్లో ప్రధానంగా రియల్టీ కంపెనీల్లో భారీ పెట్టుబడులు పెట్టిన రాకేష్ ఝున్ ఝున్ వాలాకు భారీ షాక్ తగిలింది. నవంబరు 1 వ తేదీనుంచి ఈ 16 రోజుల కాలంలో సుమారు రూ.1478 కోట్లు (200 మిలియన్ డాలర్లు) ఆవిరైపోయినట్టు సమాచారం. ఈ మొత్తం నష్టంలో టాటా గ్రూప్ వివాదం కూడా రాకేష్ పెట్టుబడులకు అశనిపాతంలా చుట్టుకుంది.
ముఖ్యంగా రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్లో పెట్టుబడులు బాగా దెబ్బతీసినట్టు తెలుస్తోంది. పెట్టుబడుల శాతం ఎంత అనేది స్పష్టం కాన్పటికీ, ఈ కంపెనీ ఫేర్ 30శాతం పతనం అయింది. దీంతో భారీ నష్టం తప్పలేదు. ఇవేకాకుండా, టాటా గ్రూప్ దిగ్గజం టైటన్, టాటా గ్రూప్‌లోని మరో దిగ్గజం ఆటోమేజర్ టాటా మోటార్స్ లో15 శాతం తో సహా ర్యాలీస్ కంపెనీలోని పెట్టుబడులు భారీగా ఆవిరైపోయాయి. ఇవేకాకుండా బుల్స్ పోర్ట్ ఫోలియో లోని ఇతర పెట్టుబడులు డీబీ రియల్టీ లో 33 శాతం, దీవాన్ హౌసింగ్ ఫినాన్స్, 28శాతం డెల్టా కార్ప్ 40శాతం, అనంత్‌రాజ్ 15 శాతం నష్టాలను నమోదు చేశాయి.
అయితే ఆయన పెట్టుబడులు పెట్టిన ఎంసీఎక్స్, రేటింగ్ దిగ్గజం క్రిసిల్ షేర్లు మాత్రం ఫ్లాట్‌గా న్నాయి. మొత్తంగా ఈ లెజెండరీ ఇన్వెస్టర్ రాకేష్ కు చెందిన రూ. 1500 కోట్లను కోల్పోయినట్టయింది. కాగా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలుపు, ఫెడ్ అంచనాలు, డాలర్ బలపడటం, రూపాయి పతనానికి తోడు రూ. 500, రూ.1000 నోట్లను కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా రద్దు చేయడంవంటి అంశాలు ప్రభావితం చేసాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.