Lottery process
-
లాటరీ పద్ధతిలో 600 వుడా ప్లాట్లు
బీచ్‌రోడ్ : దాకమర్రి లేఅవుట్‌కు జరిగిన వేలం పాటను రద్దు చేసి లాటరీ ద్వారా స్థలాలు విక్రయం చేయాలని కోరుతూ వుడా వీసీకి బీజేపీ నాయకులు మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నగర అధ్యక్షుడు ఎం.నాగేంద్ర మాట్లాడుతూ దాకమర్రి లేఅవుట్ వేలంపాటలో అమ్ముడయిన స్థలాల రేటు చూస్తే కళ్ళు తిరిగేటట్లు ఉన్నాయని పేర్కొన్నారు. వుడా ఏర్పాటు ముఖ్య ఉద్దేశం పేద, మధ్య తరగతి నివాసం లేని వారికి స్థలాలు సరసమయిన ధరలకు అందించడమని తెలిపారు. గతంలో వుడా స్థలాలను లాటరీ పద్ధతిలో తక్కువ ధరకే అందించారు...అలాగే ఈ స్థలాలను కూడా లాటరీ ద్వారా విక్రయించాలని కోరారు. ఇందుకు వుడా వీసీ టి.బాబురావు నాయుడు బదులిస్తూ దాకమర్రిలో లేఅవుట్లు 24 క్యారట్ బంగారమని అభివర్ణిస్తూ...వాటికి ఆ ధర తక్కువేనని తెలిపారు. స్థలం రేటు, అభివద్ధి రేటు రెండూ మొత్తం రూ.10 వేలు కంటే ఎక్కువ అని... అందుకే వాటి ధర వేలంలో సరాసరి రూ. 14 వేలుకు వెళ్లిందని తెలిపారు. త్వరలో ఎల్ఐజీ, ఈబీజీ వారికి సుమారు 600 స్థలాలను లాటరీ పద్ధతిలో విక్రయిస్తామని పేర్కొన్నారు. ఈమేరకు ఇటీవల ఉన్నతాధికారుల కమిటీ నిర్ణయం తీసుకుందని, త్వరలో విధి విధానాలు ప్రకటిస్తామని చెప్పారు. వుడా సంస్థ విశాఖను అభివృద్ధి చేయాలి అంటే...ఆదాయం లేకుండా ఎలా అభివృద్ధి సాధ్యమని ప్రశ్నించారు. -
కేడీఎంసీలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్
♦ వెల్లడించిన కార్పొరేషన్ ♦ లాటరీ ప్రక్రియ ద్వారా రిజర్వేషన్ల కేటాయింపు ♦ ఎస్సీలకు 12, ఎస్టీలకు 3, ఓబీసీ-33, ఓపెన్ కేటగిరీ-74 సీట్లు సాక్షి, ముంబై : కళ్యాణ్-డోంబివలి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మొదటిసారి మహిళలకు 50 శతం రిజర్వేషన్ కల్పించారు. కార్పొరేషన్ (కేడీఎంసీ) ఎన్నికలు అక్టోబర్‌లో జరగాల్సి ఉంది. ఎన్నికల తేదీ ఖరార కాకపోయినప్పటికీ రిజర్వేషన్ల కోసం శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమించిన అధికారి సంజయ్ జాదవ్ నేతృత్వంలో లాటరీ ప్రక్రియ చేపట్టారు. మొత్తం 122 వార్డుల్లో ఎస్సీలకు 12, ఎస్టీలకు 3, ఓబీసీకి 33, ఓపెన్ కేటగిరీకి 74 సీట్లు కేటాయించారు. ఈ రిజర్వేషన్లలో మహిళలకు 50 శాతం వాటా కల్పించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ సారి ఎన్నికలకు వార్డుల పునర్విభజన చేశారు. విభజనతో కొన్ని వార్డులు గల్లంతయ్యాయి. మరికొందరి వార్డుల్లో రిజర్వేషన్ల ప్రభావం పడింది. మల్లేశ్ శెట్టి, కైలాశ్ శిందే, సుదేష్ చుడనాయిక్, ప్రమోద్పింగలే, రామదాస్ పాటిల్, శ్రీకర్ చౌదరీ, శరద్ పావశే, గణేష్ జాధవ్, దుర్యోదన్ పాటిల్, సంజయ్ పాటిల్, అనంతా గైక్వాడ్, విశ్వనాథ్ రాణే, సునీల్ వైలే, వికాస్ మాత్రే, రమేష్ మాత్రే, విద్యాధర్ భోయిర్, శ్రేయస్ సమేల్, వికాస్ మాత్రే, రాజన్ మరాఠే, మనోజ్ ఘరత్ కార్పొరేటర్లపై రిజర్వేషన్ల ప్రభావం పడిందని చెప్పవచ్చు. ప్రస్తుత మేయర్ కళ్యాణి పాటిల్, డిప్యూటి మేయర్ రాహుల్ దామలే, మాజీ మేయర్ వైజయంతి ఘోలప్, సచిన్ పోటేల వార్డులలో మాత్రం ఎలాంటి మార్పులు జరగకపోవడంతో వారికి ఊరటనిచ్చాయి. 27 గ్రామాల వ్యతిరేకత.. కళ్యాణ్-డోంబివలి మున్సిపల్ కార్పొరేషన్లో కొత్తగా చేర్చిన 27 గ్రామాలలో కూడా ఎన్నికలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఈ 27 గ్రామాల నుంచి 22 కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహించనున్నారు. అయితే కళ్యాణ-డోంబివలి మున్సిపల్ కార్పొరేషన్లో తమ గ్రామాలను చేర్చడంపై తీవ్ర గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల విషయమై గ్రామస్తులందరితో సమావేశం ఏర్పాటు చేసి తుది నిర్ణయం ప్రకటిస్తామని సంఘర్ష్ సమితి గుజాల్ వజే పేర్కొన్నారు. -
కొత్త సిండికేట్ కు అమాత్యుని అండ !
బెడిసికొట్టిన మంత్రి మంత్రాంగం సోమవారం లాటరీ పద్ధతిలో షాపుల కేటాయింపు బందరు 15వ వార్డులోని షాపు మినహా... సాక్షి, విజయవాడ : కొత్తగా ఏర్పాటయిన మద్యం సిండికేట్ రాజకీయాలు పెట్రేగిపోతున్నాయి. ఎక్సైజ్ శాఖ మంత్రి ఈ నూతన సిండికేట్‌కు పూర్తిగా సహకరించడం తీవ్ర వివాదాస్పదమవుతుంది. తనకు అనుకూలంగా ఉండే సిండికేట్‌కు లబ్ధి చేకూర్చాలనే తాపత్రయంతో మంత్రి పాత మద్యం వ్యాపారుల ఆదాయానికి గండికొట్టేందుకు చేసిన ప్రయత్నం కాస్తా... కోర్టు జోక్యంతో కొంతమేర బెడిసికొట్టింది. జిల్లాలో 335 వైన్‌షాపులున్నాయి. విజయవాడ డివిజన్ పరిధిలో 162 షాపులు, మచిలీపట్నం డివిజన్లో 173 షాపులున్నాయి. వీటి కేటాయింపు కోసం గతంలో జారీచేసిన నోటిఫికేషన్ ప్రకారం శనివారం లాటరీ ప్రకియ నిర్వహించాల్సి ఉంది. అయితే మచిలీపట్నం డివిజన్లోని మచిలీపట్నం పట్టణం ఎక్సైజ్ గెజిట్‌లోని 15వ నంబరు వార్డులో షాపును ఏర్పాటు చేయాలని అధికారులు నూతనంగాగెజిట్లో పొందుపరచడం తీవ్ర గందరగోళానికి తెరలేపింది. ఈ సిఫారసును నిరసిస్తూ పాత సిండికేట్ వ్యాపారులు మచిలీపట్నం డివిజన్ లాటరీ ప్రకియపై హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ తీసుకొచ్చారు. దీంతో శనివారం మచిలీపట్నం డివిజన్ లాటరీ ప్రకియ నిలిచిపోయింది. ఈ క్రమంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమాత్యుని ఆదేశాలతో ఎక్సైజ్ అధికారులు స్టేపై మళ్లీ ఉత్తర్వులు తీసుకొచ్చారు. దీంతో సోమవారం లాటరీ ప్రకియ నిర్వహించనున్నారు.అయితే 15 వార్డులోని షాపులకు లాటరీ నిలిపివేసి మిగిలినవి నిర్వహించాలని అదివారం హైకోర్టు ఉత్తర్వులు వెలువరించడంతో అమాత్యుని అనుచరుల ఆశలు నిరాశలయ్యాయి. దూమారం రేపిన వివాదం ... మచిలీపట్నంలోని కాలేఖాన్ పేట, గిలకలదిండి, సత్రంపాలెంలో మూడు వైన్ షాపులను ఏర్పాటు చేయాలని రెండు నెలల కిత్రం గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ అధికారులు సిఫారసు చేశారు. దానికి ప్రభుత్వ ఆమోదముద్ర పడింది. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాగా.. మచిలీపట్నం నుంచి గెలుపొందిన కొల్లు రవీంద్ర ఎక్సైజ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈక్రమంలో 15 వార్డు పరిధిలోని కోనేరు సెంటర్లో షాపు ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను అదేశించారు. దీంతో మూడు షాపుల్లో ఒకదానికి బదులు కోనేరు సెంటర్లో ఏర్పాటు చేయాలని సూచనలతో గెజిట్‌లో పేర్కొని దరఖాస్తులను స్వీకరించారు. కోనేరు సెంటర్లో ఇప్పటికే మూడు బార్ అండ్ రెస్టారెంట్లున్నాయి. అవి పాత సిండికేట్వి. అలాగే మూడు షాపుల వ్యక్తులు ప్రతిపక్ష పార్టీకి చెందిన వారు. దీంతో వారి ఆదాయ వనరులు దెబ్బతీయాలనే లక్ష్యంతో మూడు షాపులు ఉన్నప్రాంతంలోనే వైన్‌షాపు ఏర్పాటు చేస్తే బార్ల ఆదాయం గణనీయంగా పడిపోతుందని అమాత్యులు భావించారు. అయితే ఎక్సైజ్ నిబంధనల ప్రకారం ఒకే ప్రాంతంలో బార్, వైన్ షాపులు ఏర్పాటు చేయకూడదు. కానీ అమాత్యుని అదేశాలతో వీటన్నింటినీ పక్కన పెట్టి ఏకపక్షంగా వ్యవహరించారు. దీంతో బార్ యజమానులు కోర్టును ఆశ్రయించటంతో షాపుల కేటాయింపు నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. 15వ నంబరు వార్డులో షాపు ఏర్పాటు చేయకూడదని, గెజిట్ నిబంధనలకు అనుగుణంగా లేదని మచిలీపట్నం డివిజన్ గెజిట్‌ను నిలిపివేసింది. దీంతో ప్రభుత్వం గెజిట్ నిలుపుదలపై మళ్లీ ఉత్తర్వులు తెచ్చింది. దీంతో బందరు 15 వార్డులోని షాపులకు లాటరీ నిలిపివేసి మిగిలిన వాటికి సోమవారం లాటరీ నిర్వహించటానికి అధికారులు సిద్ధమయ్యారు. -
‘లాటరీ’ ప్రత్యక్ష ప్రసారం..
సాక్షి, ముంబై: మహారాష్ట్ర గృహ నిర్మాణ అభివృద్థి సంస్థ (మాడా) ఈ నెల 25న నిర్వహించనున్న లాటరీ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయించింది. ‘వెబ్ కాస్టింగ్’ ద్వారా లాటరీ ప్రక్రియను ప్రసారం చేయడానికి తగిన ఏర్పాట్లు పూర్తి చేయడంలో మాడా టెక్నిషియన్లు నిమగ్నమయ్యారు. ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో ఎలాంటి అవాంతరం ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నగరంతోపాటు విరార్, కొంకణ్ రీజియన్‌లో మాడా దాదాపు 2,649 ఇళ్లు నిర్మించి సిద్ధంగా ఉంచింది. వీటికి ఈ నెల 25న బాంద్రాలోని రంగశారద సభా గృహంలో లాటరీవేసి అర్హులైన వారికి ఇళ్లు అందజేయనున్నట్లు ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. కాని ఆ రోజు ఎంతో ఆతృతతో అక్కడికి వచ్చే వేలాది జనాన్ని రంగశారద సభాగృహంలోకి అనుమతించేందుకు వీలులేదు. సభాగృహం పరిసరాల్లో ఒక్కసారిగా వేల సంఖ్యలో జనం గుమిగూడడంతో ట్రాఫిక్ జాం సమస్య ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఆ రోజు టెండర్ ప్రక్రియను ప్రత్యక్ష ప్రచారంచేస్తే అత్యధిక శాతం మంది తమ ఇళ్లవద్దే ఉండిపోతారని అధికారులు భావిస్తున్నారు. కాగా, ఉదయం 10 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమవుతుంది. ఒకవేళ ప్రత్యక్ష ప్రసారం చూసేందుకు వీలులేని వారు లేదా సభా గృహానికి వచ్చేందుకు వీలుపడనివారి సౌకర్యార్థం ఆ రోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత అర్హులైన వారి పేర్లు, వెయిటింగ్ లిస్టు జాబితా తదితర వివారాలను మాడా వెబ్ సైట్లో ఉంచుతారు. ఈ గృహాల కోసం లక్షకుపైనే దరఖాస్తులు వచ్చాయి. వాటిలోకొందరు ప్రత్యక్షంగా, మరికొందరు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నారు. పరిశీలన అనంతరం అర్హులుగా తేలిన 93,128 మంది దరఖాస్తులకు ఆ రోజు లాటరీ వేయనున్నట్లు మాడా ముంబై రీజియన్ ప్రధాన అధికారి నిరంజన్‌కుమార్ సుధాంశు అన్నారు. ఇదిలా ఉండగా లాటరీలో ఇళ్లు రాని వారి డిపాజిట్ సొమ్మును వారం, పది రోజుల్లో వారి ఖాతాల్లో డిపాజిట్ చేస్తామని ఆయన వివరించారు.