lotus hospital
-
పాపం పసివాడు..!
పేద కుటుంబానికి పెద్ద కష్టమే వచ్చింది. కొడుకు పుట్టాడని మురిసిపోయిన ఆ తల్లిదండ్రులు ఇప్పుడు కొడుకు ఆరోగ్యం కోసం మొక్కని దేవుడంటూ లేడు. చిన్న వయస్సులో బ్రెయిన్ ట్యూమర్ రావడంతో కన్నవాళ్లు పడుతున్న కష్టాలు వర్ణణాతీతం. కూలీ చేసుకుంటేనే నాలుగేళ్లు నోట్లోకి వెళ్లే దుస్థితి వారిది. కొడుకు ఆరోగ్యం కోసం ఇప్పటికే లక్షలాది రూపాయల అప్పులు చేసి సహాయం కోసం పేద దంపతులు ఎదురు చూస్తున్నారు. జగదేవ్‌పూర్(గజ్వేల్): మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన రాగం బాల్‌రాజు, రమాదేవి దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. కొడుకు భానుప్రసాద్ గ్రామంలోనే 4వ తరగతి, కూతురు నందిని 1వ రతగతి చదువుతుంది. చిన్న కూతురు ఇంటి దగ్గరనే ఉంటోంది. వీరికి గల ఎకరం భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కూలీ పనులు నిర్వహించుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. బతుకుబండి సాఫీగా కొనసాగుతున్న ఆ కుటుంబానికి పెద్ద కష్టం వచ్చి పడింది. కొడుకు ఉన్నట్టుండి అనారోగ్యంబారిన పడ్డాడు. తల్లిదండ్రులు కొడుకు భానుప్రసాద్‌కు హైదరాబాద్‌లోని లోటస్ ప్రైవేట్ దవాఖానలో ఇటీవల వైద్య పరీక్షలు చేయించారు. బాబుకు బ్రెయిన్‌ట్యూమర్ ఉందని వైద్యులు నిర్ధారించారు. వెంటనే వైద్యుల సూచనల మేరకు సికిందరాబాద్‌లోని యశోద హాస్పిటల్‌లోని వైద్యం కోసం వెళ్లారు. బాబుకు వైద్యం పరీక్షలు నిర్వహించిన అనంతరం సుమారు రూ.20 లక్షల వరకు ఖర్చు వస్తుందని వైద్యులు చెప్పారు. వెంటనే తల్లిదండ్రులు కొంత డబ్బు చెల్లించి ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వైద్యం కొనసాగుతోంది. మా బాబుకు ప్రాణం పోయండి.. మా బాబు భానుప్రసాద్‌కు ప్రాణభిక్ష పెట్టండి... అంటూ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. తమకు ఎకరం భూమి మాత్రమే ఉందని, బాబు వైద్యం కోసం ఇప్పటికే రూ.12 లక్షలు చెల్లించాం. గ్రామంలోనే తెలిసివాళ్ల దగ్గర అప్పులు చేసి వైద్యం కోసం ఖర్చు చేస్తున్నాం. ఇంకా ఐదారు లక్షల వరకు ఖర్చు వస్తుందని డాక్టర్లు చెప్పుతున్నారు. ఇక అప్పులు పుట్టే పరిస్థితి లేదు. సహాయం అందించి బాబుకు ప్రాణభిక్ష పెట్టండి.. అంటూ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. ప్రభుత్వం ఆ కుటుంబానికి సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ఈ చిట్టితల్లి.. ఆడుకుంటూ...
మొదటి అంతస్తు నుంచి కిందపడిన పాప హైదరాబాద్: భవనం మొదటి అంతస్తు నుంచి 18 నెలల చిన్నారి కిందపడి గాయాలపాలైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైద రాబాద్లోని బహదూర్‌పురా ఎంవో కాలనీకి చెందిన ఉమర్ అలీ కుటుంబంతో కలసి నివాసం ఉంటున్నాడు. ఆదివారం ఉదయం 4 గం టలకు సహర్ భోజనం అనంతరం ఉమర్ కుమార్తె ఫాతిమా ఆడుకుంటూ మొదటి అంతస్తు నుంచి ఒక్కసారిగా కిందపడింది. ఎదురింటిలో నివాసముంటున్న వారు చిన్నారి ఏడుపు ను విని వెంటనే పాపను చేరదీసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. గాయాలపాలైన చి న్నారిని లక్డీకాపూల్‌లోని లోటస్ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో ఆదివారం పోలీసులు వివరాలను వెల్లడించలేదు. సోమవారం భవనంపై నుంచి చిన్నారి కిందపడిన వార్త ప్రసార మాధ్యమాల్లో రావడంతో బహదూర్ పురా పోలీసులు సమాచారాన్ని తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందు తున్న ఫాతిమాకు ప్రాణాపాయం లేదని ఆసుపత్రి వైద్యులు తెలిపిన ట్లు పోలీసులు చెప్పారు. సీసీటీవీ ఫుటేజీ లో లభించిన వీడియోలో ఒక్కసారిగా పాప కిందపడిపో యిన దృశ్యాలను గుర్తించారు. -
లోటస్ ఆస్పత్రి ఎదుట ఉద్రిక్తత
-
లోటస్ ఆస్పత్రి ఎదుట ఉద్రిక్తత
హైదరాబాద్: వైద్యుల నిర్లక్ష్యంతో గిరిజన బాలుడు మృతిచెందాడని కుటుంబసభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దానితో పాటు ఆస్పత్రిపై దాడి చేసి ఆస్పత్రి అద్దాలు, ఫర్నీచర్ ధ్వసం చేశారు. నగరంలోని లక్డీకాపుల్ లోటస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ గిరిజన బాలుడు గురువారం ఉదయం మృతిచెందాడు. దీంతో ఆగ్రహించిన అతని బంధువులు ఆస్పత్రిపై దాడి చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఆస్పత్రి చుట్టుపక్కల భారీగా పోలీసులను మొహరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.