ఈ చిట్టితల్లి.. ఆడుకుంటూ... | Baby fell down from the first flore | Sakshi
Sakshi News home page

ఈ చిట్టితల్లి.. ఆడుకుంటూ...

Published Wed, Jun 14 2017 12:07 AM | Last Updated on Tue, Sep 5 2017 1:31 PM

ఈ చిట్టితల్లి.. ఆడుకుంటూ...

ఈ చిట్టితల్లి.. ఆడుకుంటూ...

మొదటి అంతస్తు నుంచి కిందపడిన పాప 
 
హైదరాబాద్‌: భవనం మొదటి అంతస్తు నుంచి 18 నెలల చిన్నారి కిందపడి గాయాలపాలైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైద రాబాద్‌లోని బహదూర్‌పురా ఎంవో కాలనీకి చెందిన ఉమర్‌ అలీ కుటుంబంతో కలసి నివాసం ఉంటున్నాడు. ఆదివారం ఉదయం 4 గం టలకు సహర్‌ భోజనం అనంతరం ఉమర్‌ కుమార్తె ఫాతిమా ఆడుకుంటూ మొదటి అంతస్తు నుంచి ఒక్కసారిగా కిందపడింది. ఎదురింటిలో నివాసముంటున్న వారు చిన్నారి ఏడుపు ను విని వెంటనే పాపను చేరదీసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. గాయాలపాలైన చి న్నారిని లక్డీకాపూల్‌లోని లోటస్‌ ఆసుపత్రికి తరలించారు.

ఈ సంఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో ఆదివారం పోలీసులు వివరాలను వెల్లడించలేదు. సోమవారం భవనంపై నుంచి చిన్నారి కిందపడిన వార్త ప్రసార మాధ్యమాల్లో రావడంతో బహదూర్‌ పురా పోలీసులు సమాచారాన్ని తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందు తున్న ఫాతిమాకు ప్రాణాపాయం లేదని ఆసుపత్రి వైద్యులు తెలిపిన ట్లు పోలీసులు చెప్పారు. సీసీటీవీ ఫుటేజీ లో లభించిన వీడియోలో ఒక్కసారిగా పాప కిందపడిపో యిన దృశ్యాలను గుర్తించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement