ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి మౌన పోరాటం
పోచమ్మమైదాన్ : ప్రియుడి ఇంటి ఎదుట ఓ యువతి మౌన పోరాటానికి దిగిన సంఘటన నగరంలోని క్రిస్టియన్ కాలనీలో బుధవారం సాయంత్రం జరిగింది. బాధితురాలి కథనం ప్రకారం.. కిస్ట్రియన్ కాలనీకి చెందిన బైరపాక అఖిల్(సన్నీ), అదే ప్రాంతానికి చెందిన పోలేపాక మమత ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అరుుతే అతడు మమతను మోసం చేసి మరో యువతిని ఈ నెల 6న వివాహం చేసుకుంటున్నాడని తెలియడంతో బుధవారం సాయంత్రం ఆమె మహిళా సంఘాలతో వచ్చి ఇంటి ముందు దీక్షకు కూర్చుంది. మమతకు మహిళా సంఘాల సభ్యులు కూడా అండగా నిలిచి, బైఠారుుంచారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ ఏడేళ్లుగా కలిసి తిరిగామని, తమ ఇం ట్లోనో ఉండేవాడని, తీరా ఇప్పుడు మరో అమాయిని పెళ్లి చేసుకుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.
మూడేళ్లుగా పెళ్లి విషయూన్ని వారుుదా వేస్తూ వచ్చాడని, నవంబర్ 29న రిజిస్ట్రర్ మ్యారేజ్ చేసుకుందామన్నాడని, అంతేగాక బీరువా, బోల్లు, మంచం కోసం అని రూ.20 వేలు సైతం తీసుకెళ్లాడని చెప్పింది. తనను మోసం చేసి కాజీపేటకు చెందిన అమ్మాయిని వివాహం చేసుకునేం దుకు సిద్ధమయ్యూడని విలపించింది. చర్చి కమిటీ, సీఐ కి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఇప్పటికైనా తనకు న్యాయం చేయాలన్నారు. ధర్నాలో టీఆర్ఎస్ మిహ ళా నాయకులు తాళ్ల ఉమాదేవి, రేణుక పాల్గొన్నారు.