Lovers Couple Suicide
-
కులాలకు ఎదురెళ్లలేక రైలుకు ఎదురెళ్లి..
నవాబుపేట: రైలుకింద పడి ఓ ప్రేమజంట బలవన్మరణం చెందింది. మృతు లిద్దరూ మైనర్లే. ఈ సంఘటన గురువారం వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట మండలం కడ్చర్లలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పవన్‌కుమార్ (18), ధారూర్ మండలం ఎబ్బనూర్‌కు చెందిన అభినయ (17) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పవన్ ఇంటర్ సెకం డియర్ ఆపేసి ఇంటి వద్దే ఉంటున్నాడు. అభినయ ఇంటర్ ఫస్టియర్ పూర్తి చేసింది. వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నప్పుడు పవన్, అభినయ మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వారి విషయం కుటుంబ పెద్దలకు తెలిసింది. ఈ వయసులో ప్రేమలు ఏమిటంటూ మం దలించారు. అయినా ఇద్దరి కులాలు వేర్వేరని చెప్పారు. తమ పెళ్లికి వయసు, కులాలు అడ్డుగా ఉన్నాయని మనస్తాపం చెందిన పవన్, అభినయ.. కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. బుధవారం రాత్రి ఇద్దరూ బయట కలుసుకొని ద్విచక్ర వాహనంపై కడ్చర్ల సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు చేరుకున్నారు. అర్ధరాత్రి 12:30 సమయంలో హైదరాబాద్ నుంచి ఔరంగాబాద్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌కు ఎదురెళ్లి బలవన్మరణం చెందారు. రైలు వేగం ధాటికి పవన్ తల 200 మీటర్ల దూరంలో పడింది. గమనించిన రైలు డ్రైవర్ వికారాబాద్ స్టేషన్ మాస్టర్‌కి సమాచారం ఇచ్చారు. మృతదేహాలను చూసి ఇరువురి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృతురాలి తల్లి బావిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను ఇరువురి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు రైల్వే ఎస్ఐ నర్సింగ్ రాథోడ్ తెలిపారు. -
విడదీస్తారని.. తనువు వీడారు
సైదాపూర్(హుజూరాబాద్): ఓ వేడుకలో ఏర్పడిన పరిచయం.. స్నేహంగా మారింది. క్రమంగా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. రెండేళ్లుగా ప్రేమాయణం సాగించారు. ఇటీవల పెళ్లి చేసుకోవాలనుకున్నారు. విషయం పెద్దలకు చెప్పే ధైర్యం చేయలేదు. చెప్పినా పెళ్లికి ఒప్పుకోరని భయపడ్డారు. విషయం పెద్దలకు తెలిస్తే తమను విడదీస్తారని.. వీడిపోయి బతకడం కన్నా.. కలిసి చావడమే మేలనుకున్నారు. క్రిమిసంహారక మందు తాగి తనువు చాలించారు. ఈ విషాద సంఘటన సైదాపూర్ మండలం దుద్దెనపల్లి గ్రామంలో శనివారం జరిగింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఠాకూర్ వీరాసింగ్ ఏడాది పసికందుగా వరంగల్ జిల్లా కాశిబుగ్గ పోలీసులకు దొరికాడు. పోలీసుల తమదగ్గర పని చేస్తున్న ఠాకూర్ ప్రతాప్‌సింగ్–శోభారాణి దంపతులకు పెంపకానికి ఇచ్చారు. అప్పటికే ఈ దంపతులకు చిన్న కూతురు ఉంది. వీరాసింగ్‌ను పెంపకానికి తీసుకున్న కొద్ది రోజులకే శోభారాణి–ప్రతాప్‌సింగ్‌లు మృతిచెందాడు. ప్రతాప్‌సింగ్ బావ రాణాప్రతాప్‌సింగ్–బేబీబాయి వీరాసింగ్‌తో పాటు పాపను దుద్దెనపల్లికి తీసుకొచ్చారు. బడీడుకు వచ్చాక ఇద్దరిని హుస్నాబాద్ హాస్టల్లో చదివించారు. పాప హాస్టల్ నుంచి పారిపోయింది. ఇప్పటి వరకు ఆచూకీ లేదు. 5వ తరగతి వరకు చదువుకున్న వీరాసింగ్(25) చదవు మానేశాడు. లారీ డ్రైవింగ్ నేర్చుకున్నాడు. కొన్నేళ్లుగా లారీ డ్రైవింగ్ చేస్తున్నాడు. ఈనేపథ్యంలో ఎలిగేడు మండలం నారాయణపల్లికి చెందిన యాదగిరి సంపత్–స్వప్న కూతురు లయమాధురి(19) 8వ తరగతి చదివి మానేసింది. లయమాధురి, వీరాసింగ్లు ఓ ఫంక్షన్లో కలుసుకున్నారు. ఆ పరిచయం ప్రేమగా మారింది. రెండేళ్ల ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లాలనుకున్నారు. ప్రేమ విషయం పెద్దలకు చెప్పడానికి ధైర్యం చాలలేదు. దీంతో గురువారం రాత్రి 12.30 గంటలకు దుద్దెనపల్లిలో క్రిమిసంహారకమందు తాగారు. తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బంధువులకు చెప్పి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే బంధువులు హుజూరాబాద్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. శుక్రవారం మధ్యాహ్నం పోలీసులు లయమాధురి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వరంగల్ ఆస్పత్రి నుంచి లయమాధురిని కరీంనగర్ సివిల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ లయమాధురి శనివారం రాత్రి 1.45 గంటలకు, వీరాసింగ్ ఉదయం 5.30 గంటలకు మృతి చెందారు. -
నిన్న ప్రేమ పెళ్లి... నేడు ఆత్మహత్య
వెల్దుర్తి : మెదక్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంట 24 గంటల్లోపే ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన జిల్లాలోని వెల్దుర్తి మండలం నాగులగుట్ట గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రమేష్, మాధవి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. రమేష్ స్థానికంగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా... మాధవి మేడ్చల్‌లోని ఓ కాలేజీలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. వీరిద్దరి కులాలు వేరు కావడంతో ప్రేమ వ్యవహారంపై కొద్ది రోజుల కిందట గ్రామంలో పంచాయితీ జరిగింది. వీరిద్దరూ శనివారం వివాహం చేసుకున్నారు. అనూహ్యంగా ఆదివారం ఉదయం గ్రామంలోని చెట్టుకు ఇద్దరూ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇరు కుటుంబ పెద్దలు పెళ్లికి అంగీకరించకపోవడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. నవ వధువరుల మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.