జిల్లాలో 2.7 మి.మీ సగటు వర్షంపాతం
ఏలూరు (మెట్రో): జిల్లాలో గడిచిన 24 గంటల్లో 130.8 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి కె.సత్యనారాయణ తెలిపారు. జిల్లాలో 2.7 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైందన్నారు. అత్యధికంగా వీరవాసరం మండలంలో 23.2 మిల్లీమీటర్లు కాగా అత్యల్పంగా 0.2 మిల్లీమీటర్ల నమోదైంది. పాలకొల్లులో 13.4, ఇరగవరంలో 13.2, పెంటపాడులో 10.4, యలమంచిలిలో 10.2, భీమవరంలో 9.2, ఆకివీడులో 7.6, తాడేపల్లిగూడెంలో 6.8, లింగపాలెంలో 6.2, పెరవలిలో 5.2, పెదపాడు, దెందులూరులో 4.2, ఏలూరులో 4, పెనుగొండలో 2.6, భీమడోలులో 2.2, జంగారెడ్డిగూడెం, పెదవేగిలో 1.8, తాళ్లపూడిలో 1.6, కొవ్వూరు, కాళ్లలో 1, తణుకు, అత్తిలి మండలాల్లో 0.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.