Lower Tank Bund
-
మెగా టూరిస్ట్ హబ్‌గా ట్యాంక్ బండ్– నెక్లెస్ రోడ్
చార్మినార్.. గోల్కొండ కోట.. సాలార్జంగ్ మ్యూజియం.. సెవెన్ టూంబ్స్ (కుతుబ్‌షాహీ సమాధులు).. జూపార్క్.. చౌమహల్లా ప్యాలెస్.. ఇవే ఒకప్పుడు హైదరాబాద్ పర్యాటక చిరునామాలు. కాలక్రమేణా వీటితో పాటు అక్కడక్కడా మరికొన్ని ఏర్పాటయ్యాయి. ఇప్పుడు ఏకంగా 10 కిలోమీటర్ల దూరంలోనే సుమారు 20కిపైగా ప్రదేశాలతో మెగా టూరిస్ట్ సర్కిల్‌గా రూపుదిద్దుకుంటోంది. ఒక్క రోజులోనే ఇవన్నీ చుట్టేసి రావొచ్చు. ఎలా వెళ్లినా తక్కువ బడ్జెట్‌తో ఒక రోజు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో హాయిగా గడిపేయొచ్చు. పర్యాటకుల కోలాహలానికి చిరునామాగా మారిన ట్యాంక్ బండ్ – నెక్లెస్ రోడ్‌పై ఓ లుక్కేద్దాం! – సాక్షి, సిటీడెస్క్ ట్యాంక్‌బండ్, బుద్ధ విగ్రహం, ఇందిరా పార్కు, స్నో వరల్డ్, మరో రెండురోజుల్లో ఆవిష్కరణ కానున్న 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం, అద్భుతంగా ఆవిష్కృతం కాబోతున్న రాష్ట్ర నూతన సచివాలయం, ప్రారంభానికి సిద్ధమైన అమరవీరుల స్మారకం, లుంబినీ పార్కు,, ఎన్టీఆర్ గార్డెన్, ప్రసాద్ ఐమాక్స్, బిర్లా మందిర్, బిర్లా ప్లానెటోరియం, జలవిహార్, థ్రిల్ సిటీ, ఈట్ స్ట్రీట్, సంజీవయ్య పార్కు, పీవీ జ్ఞాన భూమి, జైపాల్‌రెడ్డి స్మృతి వనం, ఇందిరా పార్కు.. ఇలా సుమారు 20కి పైగా ప్రదేశాలు పర్యాటక ప్రాంతాలుగా విరాజిల్లుతున్నాయి. ఇవన్నీ కేవలం 10కి.మీ సర్కిల్లో ఉండడం విశేషం. మరోవైపు ఇటీవల నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసింగ్ ఈవెంట్ ట్యాంక్‌బండ్ ఖ్యాతిని ఖండాంతరాలకు పరిచయం చేసింది. కొత్తందాల సమ్మేళనం ఎప్పుడూ చూసే ట్యాంక్‌బండే కదా అనుకుంటే పొరపడినట్లే. పర్యాటకుల అభిరుచులకు అనుగుణంగా తనను తాను మార్చుకుంటోంది. కొత్తందాలతో కళకళలాడుతోంది. మిరుమిట్లుగొలిపే వెలుగుల్లో తథాగతుడు కనువిందు చేస్తున్నాడు. సండే ఫన్డే రోజున జరిగే సంగీత కార్యక్రమాలు ఆబాలగోపాలాన్ని అలరిస్తున్నాయి. ఇటీవలే ఏర్పాటు చేసిన నీటి ఫౌంటేన్లు జిగేల్మంటున్నాయి. లగ్జరీ బోట్లలో వ్యక్తిగత పార్టీలు, రాత్రి వేళల్లో బర్త్‌డే పార్టీలకు కేరాఫ్‌గా మారింది. ఇక ఎన్టీఆర్ గార్డెన్లో అరుదైన బొన్సాయ్ మొక్కలు, ఆర్టిఫీషియల్ మర్రిచెట్టులోంచి రైలు ప్రయాణం, భయపెట్టించే హంటర్ హౌస్, అబ్బురపరిచే పూల వనాలు, వింటేజ్ కార్లలో స్నాక్స్, అత్యంత ఎత్తులో నెక్లెస్ రోడ్ అందాలను చూపించే జెయింట్ వీల్, అండర్ గ్రౌండ్లో ఆటలు, ఆకట్టుకునే బొమ్మలు, ఎడారి మొక్కలు, కళ్లముందు మ్యాజిక్ చేసే త్రీడీ షో.. ఇవన్నీ ఇప్పుడు ట్యాంక్ బండ్‌కు సమ్‌థింగ్ స్పెషల్. ప్రసాద్ ఐమాక్స్‌లో సినిమా, షాపింగ్, గేమింగ్, ఈటింగ్, జల్ విహార్‌లో రెయిన్ డ్యాన్స్, వాటర్ గేమ్స్‌తో ఫుల్ ఎంజాయ్ ఉంటుంది. థ్రిల్ సిటీలో ప్రమాదకరమైన ఆటలతో భయానకమైన వాతావరణంతో థ్రిల్లింగ్ అనుభూతిని పంచుతుంది. సంజీవయ్య పార్క్‌లో అనేక రంగులతో అలరించే రోస్ గార్డెన్, బటర్‌ఫ్లై పార్క్, అతిపెద్ద జాతీయ జెండా, డాగ్ పార్క్, సైక్లింగ్ క్లబ్ ఇలా ఎన్నో.. మరెన్నో విశేషాలకు వేదిక అయ్యింది. నీరా కేఫ్ హుస్సేన్‌సాగర్ తీరం చెంత నెక్లెస్ రోడ్లో మరో కొత్త పర్యాటక కేంద్రం నీరా కేఫ్ సిద్ధమైంది. అతి త్వరలో ఇది అందుబాటులోకి రానుంది. తెలంగాణ రుచులందించే స్టాళ్లతోపాటు కల్లుగీత వృత్తికి అద్దం పట్టేలా దీన్ని నిర్మించారు. పై అంతస్తులో ఒక సమావేశ మందిరం, రెస్టారెంట్ ఉంటుంది. మరోవైపు ప్రస్తుతం లుంబినీ పార్కు వద్ద ఉన్న బోటింగ్ పాయింట్‌కు తోడుగా నీరా కేఫ్ వెనుకభాగంలో మరో బోటింగ్ పాయింట్‌ను కొత్తగా అందుబాటులోకి తెచ్చారు. నెక్లెస్‌రోడ్‌లో విహరించేవారు లుంబినీ పార్కు బోటు యూనిట్ వరకూ వెళ్లాల్సిన అవసరం లేదు. సాగర్‌కు దక్షిణం వైపు నుంచి కూడా ప్రయాణించడానికి వీలు కల్పించినట్లయింది. ప్రతిరోజూ వెళ్లాలనిపిస్తోంది 15 ఏళ్ల క్రితం సిటీకి వచ్చాను. నేడు ఎంతగానో మారింది. ముంబై, బెంగళూరు నగరాల కంటే ఎక్కువగా పర్యాటక రంగం దూసుకెళుతోంది. ఒకప్పుడు ఈవెనింగ్ టైంలో ట్యాంక్‌బండ్‌కు వెళ్లి రెండు, మూడు గంటల పాటు ఎంజాయ్ చేసేవాడిని. లాస్ట్ వన్ ఇయర్లో ట్యాంక్‌బండ్ ఏరియాలో జరిగిన డెవలప్మెంట్కు వీకెండే కాదు ప్రతిరోజూ వెళ్లాలనిపిస్తోంది. సరికొత్తగా కనిపిస్తోంది, – చక్రవర్తి, ఐటీ ఉద్యోగి, రాంనగర్ బడ్జెట్ ఫ్రెండ్లీ సిటీ హైదరాబాద్ అనేది బడ్జెట్ ఫ్రెండ్లీ సిటీ . ఇతర నగరాల్లో అయితే పర్యాటక ప్రాంతాలు ఒకే దగ్గర ఉండవు. అదే మన సిటీలో ఒక్క ట్యాంక్ బండ్‌కు వస్తే చాలు బోలెడన్ని ప్లేస్‌లు. ఒక్క రోజులో అన్నీ చుట్టేసి రావచ్చు. ఎంటర్టైన్మెంట్ అందించే ప్రాంతాలే ఎక్కువ. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. పైగా తక్కువ ఖర్చులో వీటన్నింటినీ ఒకేరోజులో చూడొచ్చు. – శివాని సింగ్, ట్రావెలర్, బంజారాహిల్స్ ఇవి చేస్తే ఇంకా మేలు ● పర్యాటకుల సంఖ్యకు అనుగుణంగా రీఫ్రెష్మెంట్ సౌకర్యాలపై జీహెచ్ఎంసీ, టూరిజం విభాగం దృష్టి సారించాలి. ప్రధానంగా టాయిలెట్ల సంఖ్య పెంచాలి. ● మినీ మొబైల్ వ్యాన్లు, షటిల్ సర్వీస్‌లు పెడితే బావుంటుంది. రోజంతా తిరిగేందుకు ఆర్టీసీ తరహా సింగిల్ డే పాస్‌లు ఉంటే మేలు. ● మొబైల్ చార్జింగ్ పాయింట్లు ,లాన్లలో కూర్చుకునేందుకు స్ట్రీట్ ఫర్నీచర్ అవసరం (ట్యాంక్‌బండ్, పీవీ మార్గ్ మినహా మరెక్కడా ఎక్కడా లేవు). ● షీ–టీంలను పెంచి, పోకిరీలు, ఆకతాయిల వేధింపులపై మరింత దృష్టి సారించాలి. ● రద్దీ వేళల్లో సందర్శకులతో ట్రాఫిక్ జాం అవుతోంది. వీకెండ్స్‌లో ట్యాంక్ బండ్ మాదిరిగానే హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని నో వెహికిల్స్ జోన్‌గా మార్చాలి. -
హైదరాబాద్ లోయర్ ట్యాంక్‌బండ్ సమీపంలో భారీ పేలుడు
సాక్షి, హైదరాబాద్: గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లోయర్ ట్యాంక్ బండ్ స్నో వరల్డ్ సమీపంలోని చెత్త డంపింగ్ యార్డ్‌లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో అక్కడే ఉన్న తండ్రీ కొడుకులు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి, గాంధీనగర్ సీఐ మోహన్‌రావు, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. పేలుడుకు గల కారణాలపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వారు కర్నూలు జిల్లా నాంచార్ల గ్రామానికి చెందిన చంద్రన్న , ఆయన కుమారుడు సురేష్‌గా గుర్తించారు. సురేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చదవండి: కామారెడ్డి: గుహలో చిక్కుకున్న రాజు సురక్షితంగా బయటకి.. -
విద్యార్థి ఇంద్ర మేఘ్వాల్కు కొవ్వొత్తుల నివాళులు
కవాడిగూడ (హైదరాబాద్): రాజస్తాన్‌లో అగ్రకుల ఉపాధ్యాయుడు వారికి కేటాయించిన కుండలో దళిత విద్యార్థి నీటిని తాగినందుకు చితకబాది ఇంద్ర మేఘ్వాల్ హత్యకు కారణం కావడం అగ్ర కుల దురహంకారానికి నిదర్శనమని పీవోడబ్ల్యూ జాతీయ కన్వీనర్ సంధ్య ఆగ్రహం వ్యక్తంచేశారు. దళిత, మహిళా ట్రాన్స్‌జెండర్, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో లోయర్ ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద మంగళవారం విద్యార్థి ఇంద్ర మేఘ్వాల్కు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, మహిళ, విద్యార్థి సంఘాలు అగ్రకుల దురంహకార హత్యలను నిరసిస్తూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. సంధ్య మాట్లాడుతూ.. భారత్ గర్వించేలా వజ్రోత్సవాలు జరుపుకోవడం అదే రోజు రాజస్తాన్‌లో దళిత విద్యార్థి అగ్రకుల అహంకారా నికి బలికావడం అంటే స్వాతంత్య్రం ఎవరికి వచ్చిందని ఆమె ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం బీజేపీ అంబేడ్కర్ పేరును వాడుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. భారత రాజ్యాంగంపై నిజంగా ప్రేమ ఉంటే దళిత, ఆదివాసీ, గిరిజన, మైనార్టీలు, మహిళలపై జరుగుతున్న హత్యలు అత్యాచారాలపై ఎందుకు మాట్లాడటం లేదని సంధ్య నిలదీశారు. అనంతరం ప్రజా సంఘాల నేతలు శంకర్, చైతన్య, ఝాన్సీ, సజయ, స్నేహలత, కొండల్, మల్లేశ్ తదితరులు మాట్లాడుతూ దళిత విద్యార్థిపై అగ్రకుల ఉపాధ్యాయుడు చిత్రహింసలకు పాల్పడి హత్యకు కారణమైతే కనీసం ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒక్కరూ ఖండించకపోవడం దురదృష్టకరమన్నారు. మంచినీరు అనేది దేశ సహజ సంపద అని, దీనిపై అందరికీ హక్కు ఉంటుందని పేర్కొన్నారు. -
మింగేస్తున్న నాలాలు
-
ఆ లోపాలే ‘క్యాష్’!
చిరుద్యోగుల ఆధీనంలో రూ. కోట్ల నగదు పక్కాగా లేని ఆడిటింగ్ స్వాహా చేస్తున్న ఉద్యోగులు ‘ఆర్సీఐ కేసు’ యాజమాన్యానికీ భాగస్వామ్యం సిటీబ్యూరో: 2012లో లోయర్ ట్యాంక్‌బండ్‌లోని సీఎంఎస్ కార్యాలయంలో రూ.2.6 కోట్లు... 2014లో నెల్లూరు కేంద్రంగా పని చేస్తే సంస్థలో రూ.57 లక్షలు... 2015లో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సంస్థ నుంచి రూ.31 లక్షలు... తాజాగా ఆర్సీఐ సంస్థలో రూ.9.98 కోట్లు... వివిధ బ్యాంకులకు చెందిన ఏటీఎం మిషీన్లలో నగదు నింపే బాధ్యతలు నిర్వర్తిస్తున్న కస్టోడియన్లు స్వాహా చేసిన మొత్తాలివి. ఆయా సంస్థల్లో ఉన్న వ్యవస్థాగత లోపాలే వీరికి కలిసి వస్తున్నాయని పోలీసులు గుర్తించారు. వీటినే క్యాష్ చేసుకున్న నిందితులు భారీగా నగదు పక్కదారి పట్టింస్తున్నారని చెప్తున్నారు. ప్రజాధనం దుండగుల పాలవుతున్నా... ఆయా బ్యాంకులు మాత్రం సంస్కరణలపై దృష్టి పెట్టడంలేదు. ఆర్సీఐ ఫ్రాడ్‌లో కస్టోడియన్లతో పాటు ఏకంగా యాజమాన్యం పాత్ర వెలుగులోకి రావడంతో అధికారులే అవాక్కయ్యారు. ఔట్సోర్సింగ్ చేతుల్లో నగదు భర్తీ... ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు తమ ఏటీఎంల్లో నగదును నింపే కాంట్రాక్టును ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ కేంద్రాలుగా నడిచే ప్రైవేట్ సంస్థలకు ఔట్సోర్సింగ్ పద్ధతిలో కాంట్రాక్టుకు అప్పగిస్తున్నాయి. ఈ పని చేయడానికి ఆయా సంస్థలు అనేక మందిని ఉద్యోగులుగా నియమించుకుంటున్నాయి. వీరిలో కస్టోడియన్లుగా పిలిచే ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకం. వీరు బ్యాంకులకు చెందిన కేంద్రాల నుంచి కోట్ల రూపాయలు తమ సంస్థల వాహనాల్లో తీసుకొచ్చి, ఆ మొత్తాన్ని ఆయా బ్యాంకుల ఏటీఎం సెంటర్లలోని మిషీషన్లలో డిపాజిట్ చేస్తుంటారు. గతం తెలీదు.. నిఘా లేదు... కస్టోడియన్లుగా చేరే ఉద్యోగుల పూర్తి వివరాలు ఏటీఎంలో డబ్బు నింపే కాంట్రాక్టు పొందిన సంస్థలు తమ వద్ద ఉంచుకోవడం గానీ, వారి గత చరిత్రను పరిశీలించడంగానీ చేయడం లేదు. అలాగే వారి కార్యకలాపాలపై నిఘా ఉంచట్లేదు. ఫలితంగానే నేరం వెలుగులోకి వచ్చినా.. నిందితులను పట్టుకోవడం పోలీసులకు సవాల్‌గా మారుతోంది. ఓ బృందం బ్యాంక్ నుంచి సదరు వాహనంలో ఎంత మొత్తం తీసుకుని బయలుదేరింది. ఎంత మొత్తం కార్యాలయంలో అప్పగించింది అనే అంశాలు కేవలం మాన్యువల్‌గా పుస్తకాల్లో లేదా కంప్యూటర్లో నమోదు చేస్తున్నారు. అలాగే, ఈ డబ్బులో ఎంత మొత్తం ఏటీఎం సెంటర్లో డిపాజిట్ చేశారనేది కూడా మాన్యువల్‌గానే రికార్డు చేస్తున్నారు తప్ప.. డిపాజిట్ చేసిన మొత్తాన్ని సాంకేతికంగా లెక్కించే మెకానిజంను ఆయా సంస్థలు ఇప్పటి వరకూ అందిపుచ్చుకో లేదు. అంతర్గత విచారణతో జాప్యం... ఏటీఎం కేంద్రాల్లో నగదు నింపిన కస్టోడియన్లు డ్యూటీ దిగిన తర్వాత మళ్లీ వెళ్లి ఏటీఎంలను తెరిచినా గుర్తించే పరిజ్ఞానం బ్యాంకుల వద్ద ఉండట్లేదు. దీనిని ఆసరా చేసుకొని కస్టోడియన్లు ఏటీఎంల్లో అవసరమైన డబ్బు డిపాజిట్ చేశామని నమ్మిస్తూ కోట్ల రూపాయలు గోల్మాల్ చేస్తున్నా కాంట్రాక్టు సంస్థలు వెంటనే గుర్తించలేకపోతున్నాయి. అప్పుడప్పుడు జరిగే ఆడిటింగ్‌లో అసలు విషయం బయటకు వచ్చినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయకుండా అంతర్గత విచారణ పేరుతో జాప్యం చేస్తున్నాయి. ఇవన్నీ పూర్తయ్యాక పోలీసులను ఆశ్రయిస్తుండటంతో దర్యాప్తు క్లిష్టంగా మారుతోందని అధికారులు చెప్తున్నారు. ఈసారి ఏకంగా యాజమాన్యంతో కలిసి... ఏటీఎంల్లో నగదు గోల్మాల్ చేస్తున్న కస్టోడియన్లు ప్రైవేట్ వ్యక్తులతో కలిసి తొలినాళ్లలో కేవలం ఒకటి రెండు రోజుల సర్దుబాటు కోసం నగదు పక్కదారి పట్టించడం, ఆ తరవాత స్వాహా చేయడం పరిపాటిగా మారిందని పోలీసులు అంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో జరిగిన కేసునే తీసుకుంటే తొలుత ఏటీఎంల్లో నగదు డిపాజిట్ చేసిన కస్టోడియన్లు ఆ తర్వాత వెళ్లి మిషీన్లు ఓపెన్ చేసి, ఆ నగదును స్వాహా చేశారు. వీరిని కనిపెట్టే మెకానిజం, సీసీ కెమెరాలు ఉన్నా... కాంట్రాక్ట్ సంస్థల నిఘా లేకపోవం, నిర్లక్ష్యం వల్ల వెంటనే విషయం బయటకు రాలేదని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఆర్సీఐ సంస్థ విషయానికి వస్తే తొలుత సంస్థకు చెందిన కీలక వ్యక్తులే కస్టోడియన్ల ద్వారా నగదు పక్కదారి పట్టించారు. దీన్ని అదునుగా తీసుకుని ఉద్యోగులు ఆపై సొంతంగా స్వాహా చేశారు. ‘ఆర్సీఐ’పై పట్నాలోనూ కేసు... ఎస్బీఐ ఏటీఎంల్లో పెట్టాల్సిన నగదు గోల్‌మాల్‌కు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్సీఐ సంస్థపై బీహార్‌లోని పట్నాలోనూ కేసు నమోదైంది. ఆ నగరంలోని వివిధ బ్యాంకులకు చెందిన 770 ఏటీఎం కేంద్రాల్లో నగదు నింపే బాధ్యతల్ని ఆర్సీఐ పర్యవేక్షిస్తోంది. ఇందులో కస్టోడియన్లుగా పని చేస్తున్న రాకేష్ రాయ్, రాహుల్ కుమార్, అవినాష్ కుమార్, రాజీవ్ కుమార్, ధర్మ్వీర్ కుమార్, చంద్రభాను కుమార్, అభిమన్యు కుమార్, అభిషేక్‌కుమార్, పప్పు కుమార్‌లు 27 ఏటీఎంల్లో పెట్టాల్సిన రూ.2.12 కోట్లు కాజేశారంటూ ఆర్సీఐ అధికారి చిన్మయ్ చందన్ పట్నాలోని డిఘా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ పోలీసులు ప్రాథమికంగా ఈనెల 10న తొమ్మిది మందిపైనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే నగరంలో వెలుగులోకి వచ్చిన వ్యవహారంతో డిఘా పోలీసులు అప్రమత్తమయ్యారు. పట్నాలోనూ ఆర్సీఐ యాజమాన్యమే ఫ్రాడ్ చేసి, కస్టోడియన్లపై నెడుతోందా? లేక కస్టోడియన్లతో కలిసి గోల్‌మాల్‌కు పాల్పడిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆర్సీఐ సంస్థపై మరికొన్ని రాష్ట్రాల్లోనూ కేసులు ఉన్నట్లు సీసీఎస్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలోనూ ఆరా తీస్తున్నారు.